In the second Test
-
'బెంగ' తీర్చాల్సిన సమయం
► నేటి నుంచి రెండో టెస్టు ► భారత్‌పైనే ఒత్తిడి ► ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా ► టీమిండియాలో మార్పులు! అంతా అనుకున్నట్లు సాగితే ఈ సమయానికి భారత జట్టు 1–0 ఆధిక్యంతో అమితోత్సాహంతో రెండో టెస్టు బరిలోకి దిగేది. కానీ ‘రెండున్నర రోజుల’ పతనం తర్వాత ఆ షాక్ నుంచి కోలుకొని నిలబడాల్సిన స్థితి ఇప్పుడు మన జట్టుది. ఒక మ్యాచ్‌లో జట్టు ఓడటం అసాధారణం ఏమీ కాకపోయినా, ఘోర వైఫల్యం సహజంగానే మానసికంగా కూడా జట్టును దెబ్బ తీసింది. అయితే ఇప్పుడు తమలో అసలు సత్తాను బయట పెట్టి పుణే పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవాల్సిన సమయం వచ్చింది. బెంగళూరులోనైనా మన ఆట మారుతుందా అనేది ఆసక్తికరం. సిరీస్‌కు ముందు అన్ని వైపుల నుంచి అండర్డాగ్ ముద్ర పడటంతో ఒక రకమైన ఆందోళనతో కనిపించిన ఆస్ట్రేలియాను తొలి మ్యాచ్ విజయం ఆకాశంలో నిలిపింది. ‘భారత బ్యాట్స్‌మెన్‌ను రెచ్చగొట్టము’ అంటూ మర్యాద చూపిన కంగారూలు ఇప్పుడు తమ సహజశైలిలో మాటల దాడి చేసేందుకు కావాల్సిన ధైర్యాన్ని పుణే విజయం ఇచ్చింది. పైగా భారత గడ్డపై వారికి మెరుగైన రికార్డు ఉన్న వేదికపై జరగబోతున్న మ్యాచ్ ఆసీస్ ఆత్మవిశ్వాసాన్ని అమాంతం పెంచేసింది. మరి ఆ జట్టు అదే జోరు కొనసాగిస్తుందా లేక ప్రత్యర్థి ముందు సాగిలపడుతుందా! బెంగళూరు: బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో మరో కీలక పోరుకు రంగం సిద్ధమైంది. నాలుగు టెస్టుల ఈ సిరీస్‌లో భాగంగా నేటి (శనివారం) నుంచి ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. సిరీస్‌లో వెనుకబడిన భారత్ ఇక్కడ విజయం సాధించి సమంగా నిలవాలని పట్టుదలగా ఉండగా... ఈ మ్యాచ్ గెలిస్తే ట్రోఫీని నిలబెట్టుకునే అవకాశం ఉన్న ఆసీస్ మరో గెలుపు అందుకోవాలని భావిస్తోంది. పుణే పిచ్‌పై వివాదం చెలరేగడంతో ఈ వికెట్‌పై కూడా అందరి దృష్టి నిలిచింది. అయితే ఇక్కడ వికెట్ గురించి ఎలాంటి సమస్య ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఆశ్చర్యకర మార్పులు... భారత జట్టు కెప్టెన్‌గా పూర్తి స్థాయిలో బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా గత 22 టెస్టుల్లో విరాట్ కోహ్లి ఒక మ్యాచ్‌లో ఆడిన తుది జట్టును తర్వాతి మ్యాచ్‌లో కొనసాగించలేదు. ప్రతీసారి కనీసం ఒక ఆటగాడినైనా మారుస్తూ వచ్చాడు. పుణేలో సమష్టి వైఫల్యం నేపథ్యంలో ఇప్పుడు కూడా జట్టులో మార్పులు ఖాయంగా కనిపిస్తోంది. కోహ్లి స్వయంగా చెప్పినట్లు ఇవి ‘ఆశ్చర్యకరంగా’ ఉండవచ్చు. అందుకోసం తాను మొదటి నుంచి జపిస్తున్న ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని పక్కన పెడతాడా అనేది చూడాలి. తొలి టెస్టులో భారత బ్యాటింగ్ పూర్తిగా విఫలమైంది. కాబట్టి అదనపు బ్యాట్స్‌మన్ అవసరం కనిపిస్తోంది. అప్పుడు కరుణ్ నాయర్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. అదే జరిగితే గత మ్యాచ్‌లో విఫలమైన ఆల్‌రౌండర్ జయంత్ యాదవ్‌ను పక్కన పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలం కాబట్టి భారత్ సాధ్యమై నంత భారీ స్కోరు సాధిస్తేనే మ్యాచ్‌పై పట్టు చిక్కు తుంది. ఈ మైదానంలో చక్కటి రికార్డు ఉన్న విజయ్, పుజారాలతో పాటు ‘హోం బాయ్’ లోకేశ్ రాహుల్ కూడా మెరుగైన ప్రదర్శన ఇవ్వాల్సి ఉంది. ఇంగ్లండ్ సిరీస్ నుంచి చూస్తే బంగ్లాదేశ్‌తో టెస్టు మినహా అన్నింటిలో విఫలమైన రహానేకు ప్రస్తుతానికైతే కెప్టెన్, కోచ్ నుంచి గట్టి మద్దతు లభిస్తోంది. కానీ దీనిని నిలబెట్టుకునేందుకు రహానే ఆ స్థాయి ఇన్నింగ్స్ ఒకటి ఆడాల్సి ఉంది. ఇక విరాట్ కూడా గత మ్యాచ్ అరుదైన వైఫల్యం తర్వాత తనకూ సొంత గ్రౌండ్‌లాంటి ఈ వేదికపై గొప్ప ఇన్నింగ్స్ ఆడితే భారత్‌కు మ్యాచ్‌లో విజయావకాశాలు ఖాయంగా ఉంటాయి. పిచ్ మారుతున్న కొద్దీ చివర్లో కీలకపాత్ర పోషించాల్సిన అశ్విన్, జడేజాలు గత మ్యాచ్ పరాభవానికి బదులు తీర్చుకోవాలని పట్టుదలగా ఉన్నారు. పేసర్లలో ఉమేశ్ ఖాయం కాగా, రివర్స్ స్వింగ్‌కు అవకాశం ఉంటే ఇషాంత్ స్థానంలో భువనేశ్వర్ రావచ్చు. ఏదేమైనా గత మ్యాచ్‌లో కలిసికట్టుగా విఫలమైన టీమిం డియా, ఈసారి ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిస్తేనే ఈ టెస్టులో ఆధిక్యం ప్రదర్శించవచ్చు. జోరు కొనసాగుతుందా... పుణే టెస్టులో గెలిచిన జట్టునే ఏ మాత్రం మార్పులు లేకుండా కొనసాగిస్తున్నట్లు ఆస్ట్రేలియా ఇప్పటికే ప్రకటించేసింది. అద్భుత విజయంతో ఆ జట్టులో ఉత్సాహం కనిపిస్తున్నా... ఏమరుపాటుగా వ్యవహరిస్తే పరాభవం తప్పదని ఆసీస్‌కు బాగా తెలుసు. అందుకే సిరీస్‌పై పట్టు సాధించేందుకు వచ్చిన కీలక అవకాశాన్ని ఆ జట్టు కోల్పోరాదని భావిస్తోంది. బ్యాటింగ్‌లో స్మిత్ ముందుండి నడిపిస్తుండగా, కొత్త కుర్రాడు రెన్షా ఆకట్టుకున్నాడు. అద్భుతంగా ఆడకపోయినా షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్ కూడా మెరుగ్గానే ఆడారు. తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకునేలా ఈసారి మరింత బాగా ఆడాల్సిన బాధ్యత మరో ప్రధాన బ్యాట్స్‌మన్ డేవిడ్ వార్నర్‌పై ఉంది. ఈ విధ్వంసకర ఓపెనర్ ఒక్కసారి క్రీజ్‌లో నిలదొక్కుకుంటే మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయగలడు. పుణేలో తొలి సెషన్లో అతని శైలిలో దూకుడు కూడా కనిపించింది. ఇక 12 వికెట్లతో క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించిన స్పిన్నర్ ఒకీఫ్ తనపై ఉన్న ఒత్తిడిని అధిగమించి మరోసారి భారత బ్యాట్స్‌మెన్‌ను నిరోధించగలడా చూడాలి. భారత్‌తో పోలిస్తే ఆసీస్ అదనపు బలం పేస్ బౌలింగ్‌లో కూడా ఉంది. ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్ల జాబితాలో ఉన్న మిషెల్ స్టార్క్, హాజల్‌వుడ్‌లు భారత్‌ను ఏ సమయంలోనైనా దెబ్బ తీయగల సమర్థులు. ప్రస్తుత ఆస్ట్రేలియా జట్టు ఆటగాళ్లలో ఎవరూ కూడా బెంగళూరులో టెస్టు మ్యాచ్ ఆడలేదు. తుది జట్ల వివరాలు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, జయంత్/నాయర్, అశ్విన్, జడేజా, ఉమేశ్, ఇషాంత్/భువనేశ్వర్. ఆస్ట్రేలియా: స్మిత్ (కెప్టెన్), రెన్షా, వార్నర్, షాన్ మార్‡్ష, హ్యాండ్స్కోంబ్, మిషెల్ మార్‡్ష, వేడ్, స్టార్క్, ఒకీఫ్, లయోన్, హాజల్‌వుడ్. ఒత్తిడా... నాపైనా లేక జట్టు పైనా! నేను ఒత్తిడిలో ఉన్నట్లు కనిపిస్తున్నానా? నేను చాలా ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నాను. అంతా బాగుంది. అందుకే చిరునవ్వులు కూడా చిందిస్తున్నాను! మాపై ఒత్తిడి ఉందంటూ ఆసీస్ కెప్టెన్ చెప్పడం అతని వ్యక్తిగత అభిప్రాయం. మీడియా సమావేశాల్లో ఈ తరహా మాటల యుద్ధం చేయడంలో వారు నిష్ణాతులు అని నాకు బాగా తెలుసు. అయితే వారి మాటలకంటే కూడా మేం మా ఆటపైనే ఎక్కువగా దృష్టి పెట్టాం. పుణే టెస్టులో కనబర్చిన చెత్త ఆటను మేం మళ్లీ ప్రదర్శించబోమని హామీ ఇస్తున్నాను. ఆ మ్యాచ్ ఓడినంత మాత్రాన అన్నీ ఓడతామని కాదు. గత రెండేళ్లుగా మంచి క్రికెట్ ఆడుతున్నాం. ఇక్కడా అలాంటి ఆటనే చూపిస్తాం. ఫలితం ఎలా ఉంటుందో సిరీస్ ముగిశాక చూద్దాం. మా లోపాలు సరిదిద్దుకునేందుకు తొలి టెస్టు అవకాశం ఇచ్చింది. మ్యాచ్ ఫలితాన్ని బట్టి మా సన్నాహకాల్లో మార్పు ఉండదు. అదే పట్టుదలతో మేం సాధన చేస్తాం. ప్రత్యేకంగా ఏ ఒక్క ఆటగాడిపైనో దృష్టి పెట్టడం లేదు. టెస్టు గెలవాలంటే 20 వికెట్లు తీయాల్సిందే. ఈ మైదానంలో చాలా మ్యాచ్‌లు ఆడాను కాబట్టి వికెట్ గురించి బెంగ లేదు. మ్యాచ్ ముందు పరిస్థితులను బట్టే తుది జట్టుపై నిర్ణయం తీసుకుంటాం. – విరాట్ కోహ్లి, భారత కెప్టెన్ తొలి టెస్టులో పిచ్ కూడా మా విజయంలో కీలక పాత్ర పోషించింది. ఈసారి మాత్రం పిచ్ చాలా భిన్నంగా ఉంది కాబట్టి పరిస్థితులకు అనుగుణంగా మమ్మల్ని మేం మార్చుకోవాల్సి ఉంది. ఇక్కడ తొలి ఇన్నింగ్స్‌లో సుదీర్ఘ సమయం పాటు బ్యాటింగ్ చేసి భారీ స్కోరు చేయాల్సి ఉంటుంది. ఇంగ్లండ్ ప్రతీ మ్యాచ్‌లో 400కు పైగా స్కోరు చేసినా సరిపోలేదు. మేం గెలవాలంటే కనీసం 550– 600 పరుగులైనా చేయాలి. ట్రోఫీని నిలబెట్టుకునేందుకు మాకు మరో విజయం కావాలి. చాలా వేగంగా ఒకటి, రెండు సెషన్లలో కూడా మ్యాచ్ మావైపు మొగ్గు చూపవచ్చు. కాబట్టి భారత్‌పై చాలా ఒత్తిడి ఉంటుంది. వారు బలంగా కోలుకునే ప్రయత్నం చేస్తారని తెలుసు కానీ మేం సిద్ధంగా ఉన్నాం. అశ్విన్‌తో పోటీ బాగుంది. గతం లో అతడిని నెట్స్‌లో ఎదుర్కొన్న సమయంలో అతను నాకు లెగ్ స్పిన్ బంతులేసి తన బలం బయటపడకుండా చూసుకున్నాడు కూడా. – స్టీవ్ స్మిత్, ఆస్ట్రేలియా కెప్టెన్ ► 2 చిన్నస్వామి స్టేడియంలో ఆస్ట్రేలియా 2 టెస్టులు గెలిచింది. భారత్‌లో ఎక్కడా ఆ జట్టు ఒక మ్యాచ్‌కు మించి గెలవలేదు. ఇక్కడ ఆడిన 4 టెస్టుల్లో మరొకటి ఓడి, ఒక మ్యాచ్‌ను ఆసీస్ ‘డ్రా’ చేసుకుంది. ► 4 ఈ మైదానంలో భారత్ గత 20 ఏళ్లలో 4 మ్యాచ్‌లలో ఓడి 2 మాత్రమే గెలవగలిగింది. సొంతగడ్డపై భారత్‌కు ఒక మైదానంలో ఇదే పేలవమైన రికార్డు. ► 50 మురళీ విజయ్‌కు ఇది 50వ టెస్టు మ్యాచ్. ► 112 స్టీవెన్ స్మిత్ మరో 112 పరుగులు చేస్తే టెస్టుల్లో ఐదువేల పరుగులు పూర్తవుతాయి. పిచ్, వాతావరణం సాధారణ ఉపఖండపు వికెట్. ఆరంభంలో కనీసం రెండు రోజుల పాటు బ్యాటింగ్‌కు అనుకూలించి ఆ తర్వాత టర్న్ అవుతుంది. ఇలాంటి చోట తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు సాధించడమే కీలకమవుతుంది. కాబట్టి టాస్కు అమిత ప్రాధాన్యత ఏర్పడింది. ఇక్కడ జరిగిన ఆఖరి టెస్టు (భారత్–దక్షిణాఫ్రికా) వర్షం కారణంగా ఒక రోజు తర్వాత రద్దయింది. ఆ తర్వాత అవుట్‌ఫీల్డ్‌ను కొత్త తరహా టెక్నాలజీలో పూర్తిగా ఆధునీకరించారు. మ్యాచ్ రెండో రోజు ఆదివారం వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచిస్తోంది. గత మ్యాచ్ వివాదం నేపథ్యంలో బీసీసీఐ పిచెస్ కమిటీ చైర్మన్ దల్జీత్ సింగ్ ఈసారి బెంగళూరు పిచ్ ఛాయలకే రాకుండా పూర్తిగా స్థానిక సంఘానికే అప్పగించారు. -
దక్షిణాఫ్రికాదే సిరీస్
రెండో టెస్టులో శ్రీలంక చిత్తు కేప్‌టౌన్: శ్రీలంకతో జరిగిన రెండో టెస్టులో కూడా దక్షిణాఫ్రికా ఘనవిజయం సాధించింది. 507 పరుగుల భారీ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన లంక నాలుగో రోజు పేసర్ కగిసో రబడా (6/55) ధాటికి 62 ఓవర్లలో 224 పరుగులకే కుప్పకూలింది. దీంతో దక్షిణాఫ్రికా 282 పరుగుల తేడాతో భారీ విజయాన్ని దక్కించుకుంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్ (82 బంతుల్లో 49; 8 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 130/4 ఓవర్‌నైట్ స్కోరుతో గురువారం ఆట ప్రారంభించిన లంకను ఆదిలోనే రబడ దెబ్బతీశాడు. నిలకడగా ఆడుతున్న చండిమాల్ (55 బంతుల్లో 30; 3 ఫోర్లు)ను అవుట్ చేయడంతో లంక కోలుకోలేకపోయింది. దీంతో ఐదో వికెట్‌కు 75 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం ప్రమాదకరంగా మారుతున్న మాథ్యూస్, తరంగ (7 బంతుల్లో 12; 3 ఫోర్లు)ను ఒకే ఓవర్లో రబడ పెవిలియన్‌కు చేర్చాడు. చివర్లో హెరాత్ (35 నాటౌట్) కొద్ది సేపు పోరాడినా లాభం లేకపోయింది. ఫిలాండర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఈ టెస్టులో మొత్తం పది వికెట్లు తీసిన ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ రబడా శ్రీలంకపై ఈ ఘనత సాధించిన రెండో దక్షిణాఫ్రికా బౌలర్‌గా పేరు తెచ్చుకున్నాడు. తాజా ఫలితంతో సఫారీలు మూడు టెస్టుల సిరీస్‌ను 2–0తో గెలుచున్నారు. చివరి టెస్టు 12 నుంచి జొహన్నెస్‌బర్గ్‌లో జరుగుతుంది. -
ఓటమి దిశగా శ్రీలంక
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పరాజయం దిశగా పయనిస్తోంది. 507 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అంతకుముందు 35/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 224/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 282 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని లంక ముందు 507 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. -
పాకిస్తాన్ 216 ఆలౌట్
హామిల్టన్: పేసర్ టిమ్ సౌతీ (6/80) బౌలింగ్‌లో చెలరేగడంతో న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో పాకిస్తాన్ తొలి ఇన్నింగ్సలో 67 ఓవర్లలో 216 పరుగులకు ఆలౌటైంది. దీంతో కివీస్‌కు 55 పరుగుల తొలి ఇన్నింగ్స ఆధిక్యం లభించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్‌సకు బరిలోకి దిగిన కివీస్ ఒక్క బంతి ఆడగానే భారీ వర్షం రావడంతో మిగిలిన ఆటను రద్దు చేశారు. -
తిప్పేదెవరో... తిరిగేదెవరో!
► భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు నేటి నుంచి ► కీలకం కానున్న టాస్ ► గంభీర్ స్థానంలో రాహుల్ ► ఇంగ్లండ్ జట్టులోనూ ఒక మార్పు సాగర తీరాన చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కాబోతోంది. భారత్, ఇంగ్లండ్ జట్లు స్పిన్ పోరాటానికి సై అంటున్నారుు. తొలి టెస్టులో ఆధిపత్యం సాధించిన ధీమాతో ఇంగ్లండ్... తమ బలంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలనే కసితో భారత్ అమీతుమీ తేల్చుకోబోతున్నారుు. కోహ్లి కోరుకున్నట్లే వైజాగ్‌లో స్పిన్ పిచ్ రెడీగా ఉంది. మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరుగుతుందనే అంచనా ఉన్న పిచ్‌ను మరింత తడిపేశారు. దీంతో తొలి రోజే స్పిన్ తిరిగినా... ఏదైనా జట్టు కుప్పకూలినా... ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో భారత్ తమ స్పిన్నర్లతో ఎంత ధీమాగా ఉందో ఇంగ్లండ్ కూడా తమ స్పిన్ త్రయంతో అంతే ధీమాగా బరిలోకి దిగుతోంది. విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి ప్రస్తుతం ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరు కోహ్లి, జో రూట్. ఇటు భారత కెప్టెన్‌తో పాటు అటు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కూడా తమ 50వ టెస్టు మ్యాచ్ ఆడటానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరి కెరీర్లోనూ ఇదో మైలురారుు. వైజాగ్ నగరంలో ఎప్పుడూ విఫలంకాని కోహ్లి గత రికార్డు దృష్ట్యా ఈ మ్యాచ్‌నూ చిరస్మరణీయంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. అటు ఇంగ్లండ్ కూడా తమ కీలక పేసర్ అండర్సన్ కోలుకోవడం, స్పిన్నర్ల రాణింపు, బ్యాట్స్‌మెన్ ఫామ్ కారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంది. తొలి టెస్టు అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇంగ్లండ్ స్పిన్నర్లను ఆడటం కూడా అంత తేలికేం కాదని అర్థమైంది. స్పిన్ భారత ఆయుధమైతే అదే ఆయుధంతో తిప్పిగొట్టగల సామర్థ్యం తమకు ఉందని కుక్ సేన బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు నేటి నుంచి (గురువారం) డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతుంది. మరి తిప్పేదెవరో..? గిర్రున తిరిగేదెవరో తేలాలంటే కనీసం మూడు రోజులు మ్యాచ్ చూడాల్సిందే. ఏమైనా టాస్ గెలిచిన జట్టుకు ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. ఒక్కటే మార్పు తొలి టెస్టు ఆడిన జట్టులో భారత్ ఒక్క మార్పు చేయనుంది. ఓపెనర్ రాహుల్ తిరిగి వచ్చినందున గంభీర్ బెంచ్‌కు పరిమితం కావలసి ఉంటుంది. మరో ఓపెనర్ మురళీ విజయ్, పుజారా కూడా ఫామ్‌లో ఉన్నందున భారత టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ లాంటి పిచ్‌పై రహానే లాంటి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్ కీలకం. అలాగే కోహ్లి కూడా మంచి టచ్‌లోనే కనిపిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ లైనప్ ఓవరాల్‌గా పటిష్టంగా కనిపిస్తున్నాం బంతి అనూహ్యంగా టర్న్ అరుుతే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. కనీసం ఇద్దరైనా క్రీజులో రెండు సెషన్ల పాటు గడపాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే మరోసారి స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, మిశ్రా తుది జట్టులో ఉండటం ఖాయం. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు కుంబ్లే వ్యాఖ్యలను బట్టి చూస్తే షమీ, ఉమేశ్ కూడా తుది జట్టులో ఉండొచ్చు. ఏమైనా గత సిరీస్‌ల తరహాలో ఈసారి స్పిన్నర్లను ఊరించే పిచ్ సిద్ధమైన నేపథ్యంలో అశ్విన్ కీలకం కానున్నాడు. అమిత్ మిశ్రా కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే ఆత్మవిశ్వాసంతోనే కనిపిస్తున్నాడు. అండర్సన్ రావచ్చు... అటు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేయొచ్చు. పేసర్ వోక్స్‌కు చిన్నపాటి గాయం ఉంది. కాబట్టి తన స్థానంలో అండర్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అరుుతే దాదాపు రెండు నెలలుగా తను పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అరుునా అతని అనుభవం దృష్టా ్య అండర్సన్ తుది జట్టులో ఉంటాడు. ఇక మిగిలిన జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న కొత్త కుర్రాడు హమీద్, ఫామ్‌లో ఉన్న కుక్, రూట్లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ముఖ్యంగా కుక్ స్పిన్ పిచ్‌లపై బాగా ఆడతాడు. కాబట్టి తన వికెట్ కీలకం. బౌలింగ్ విభాగంలో బ్రాడ్, అండర్సన్, స్టోక్స్ పేస్ బాధ్యతలు తీసుకుంటే మొరుున్ అలీ, రషీద్, అన్సారీ స్పిన్నర్లుగా తుది జట్టులో ఉంటారు. ఏమైనా గత మ్యాచ్ తరహాలో స్పిన్నర్లు రాణిస్తే ఇంగ్లండ్‌కు కూడా మంచి అవకాశాలు ఉంటారుు. జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, షమీ, ఉమేశ్/పాండ్యా. ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హమీద్, రూట్, డకెట్, మొరుున్ అలీ, స్టోక్స్, బెరుుర్‌స్టో, రషీద్, అన్సారీ, బ్రాడ్, అండర్సన్. టాస్ గెలవడం వల్ల కొంత లాభం ఉంటుంది. అలాగని టాస్ ఓడిపోతే ఏం చేయలేమని కాదు. ఒత్తిడిని ఎలా జరుుంచాలో గత మ్యాచ్‌లో నేర్చుకున్నాం. గెలవడం కోసం ఆడే సమయంలో ఆలోచన ఒకలా ఉంటుంది. మ్యాచ్ కాపాడుకోవడానికి ఆడే సమయంలో పరిస్థితి మరోలా ఉంటుంది. టెస్టు క్రికెట్లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలేశాం. కానీ దాని గురించి చింత లేదు. ఈసారి అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటాం. సొంతగడ్డపై మనకు అనుకూలంగానే పిచ్‌లు ఉండాలి. వైజాగ్ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. - కోహ్లి, భారత కెప్టెన్ తొలి టెస్టులో ఐదురోజుల పాటు అన్ని విభాగాల్లోనూ రాణించాం. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాం. అదే ఆత్మవిశ్వా సంతో రెండో టెస్టులో బరిలోకి దిగుతున్నాం. పిచ్ గురించి వార్తలు చూస్తున్నాం. మా స్పిన్నర్లు తొలి టెస్టు తరహాలో బౌలింగ్ చేస్తే భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగలుగుతాం. బంగ్లాదేశ్‌లో ఒకే సెషన్లో పది వికెట్లు పడ్డ పిచ్‌పై మేమే కాదు, ఎవరూ ఆడలేరు. ఆ తర్వాత అలాంటి పిచ్‌లపై ఆడేందుకు కూడా సన్నద్ధమయ్యాం. మా జట్టు కూర్పు దృష్ట్యా వైజాగ్ పిచ్‌పై కూడా మేం ఆత్మవిశ్వాసంతో ఆడగలం. - కుక్, ఇంగ్లండ్ కెప్టెన్ స్టేడియం ప్రొఫైల్ ►పేరు: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం ►నిర్మాణం: 2003లో, సామర్థ్యం: 38 వేలు ►ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లు: ఆరు వన్డేలు, రెండు టి20లు ►తొలి అంతర్జాతీయ మ్యాచ్: ఏప్రిల్ 5న, 2005లో ప్రత్యేక పూజలు తమ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్న సందర్భంగా స్టేడియం సిబ్బంది బుధవారం ఉదయం మైదానం సమీపంలో పిచ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆటోగ్రాఫ్‌లు చేసి ఇచ్చేయడమే... నోట్ల రద్దుపై కోహ్లి పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కోహ్లి కొనియాడాడు. ‘రాజ్ కోట్లో హోటల్ బిల్లు కట్టేందుకు ఐదొందలు తీశాను. తర్వాత గుర్తొచ్చింది, అది చెల్లదని. ఇక ఆ నోట్లపై ఆటోగ్రాఫ్‌లు చేసి ఇచ్చేయడమే. అంతకుమించి అవి పనికిరావు. నేను చూసినంత వరకు భారత రాజకీయ చరిత్రలో ఇది అతి గొప్ప నిర్ణయం. ఇది నిజంగా నమ్మశక్యం కాని గొప్ప విషయం’ అంటూ కోహ్లి ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడాడు. పిచ్, వాతావరణం ఎలాంటి సందేహం లేకుండా స్పిన్ పిచ్ సిద్ధంగా ఉంది. మొదటి రోజు కాస్త బ్యాటిం గ్‌కు అనుకూలంగా ఉండొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ప్రమాదం ఏమీ లేదు. ఉదయం గం. 9.30 నుంచి స్టార్ స్పోర్-1లో ప్రత్యక్ష ప్రసారం -
రెండో టెస్టుకు రాహుల్
ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండో టెస్టు కోసం భారత జట్టుతో చేరాడు. తొడ కండరాల గాయం కారణంగా జట్టుకు దూరమైన రాహుల్ పూర్తిగా కోలుకున్నాడని, ఇంగ్లండ్‌తో వైజాగ్‌లో గురువారం మొదలయ్యే రెండో టెస్టుకు అందుబాటులో ఉంటాడని జట్టు ప్రకటించింది. గౌతమ్ గంభీర్ స్థానంలో తను మురళీ విజయ్‌తో కలిసి ఇన్నింగ్స్ ను ప్రారంభించే అవకాశం ఉంది. -
డి కాక్ సెంచరీ
దక్షిణాఫ్రికాకు భారీ ఆధిక్యం హోబర్ట్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులోనూ దక్షిణాఫ్రికా పట్టు బిగించింది. మ్యాచ్ మూడో రోజు సోమవారం దక్షిణాఫ్రికా తమ తొలి ఇన్నింగ్సలో 326 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డి కాక్ (143 బంతుల్లో 104; 17 ఫోర్లు) సెంచరీతో చెలరేగగా, బవుమా (74) రాణించాడు. వీరిద్దరు ఆరో వికెట్‌కు 144 పరుగులు జోడించారు. ఆసీస్ బౌలర్లలో హాజల్‌వుడ్‌కు 6 వికెట్లు దక్కారుు. దక్షిణాఫ్రికాకు తొలి ఇన్నింగ్సలో 241 పరుగుల భారీ ఆధిక్యం లభిం చింది. అనంతరం రెండో ఇన్నింగ్స ప్రారంభించిన ఆస్ట్రేలియా ఆట ముగిసే సమయానికి 2 వికెట్లకు 121 పరుగులు చేసింది. బర్న్స్(0), వార్నర్ (45) అవుట్ కాగా... ఉస్మాన్ ఖాజా (56), స్మిత్ (18) క్రీజ్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆసీస్ మరో 120 పరుగులు వెనుకబడి ఉంది. -
పాప ఐసీయూలో ఉన్నా...
కోల్‌కతా: కన్నబిడ్డ ఆసుపత్రిలో ఉంటే ఏ పని చేస్తున్నా మనసంతా పాప మీదే ఉండటం సహజం. ఇలాంటి స్థితిలోనూ తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి అందరితో శభాష్ అనిపించుకున్నాడు భారత పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ. కోల్‌కతాలో న్యూజిలాండ్‌తో రెండో టెస్టు సందర్భంగా రెండో రోజు ఉదయం 14 నెలల వయసున్న షమీ కూతురు ఆయేరా అనారోగ్యం బారిన పడింది. ఆసుపత్రికి తీసుకెళ్తే ఐసీయూలో చేర్చారు. మ్యాచ్ ముగిశాక ఈ విషయం షమీకి తెలిసింది. వెంటనే ఆసుపత్రికి వెళ్లి కూతురుని చూసుకుని వచ్చాడు. మూడో రోజు ఆట ముగిశాక కూడా ఆసుపత్రికి వెళ్లాడు. నాలుగో రోజు మ్యాచ్ ముగిసే సమయానికి ఆయేరాను డిశ్చార్జ్ చేశారు. ఈ మ్యాచ్‌లో షమీ తొలి ఇన్నింగ్సలో బ్యాటింగ్‌లో, రెండో ఇన్నింగ్సలో రివర్స్ స్వింగ్‌తో వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. ‘కెప్టెన్‌తో పాటు జట్టు సహచరులంతా ఆయేరా త్వరగా కోలుకుంటుందంటూ ధైర్యం చెప్పారు. ప్రతిరోజూ ఆసుపత్రి నుంచి రాగానే పాప గురించి అడిగేవారు. వారందరికీ నా ధన్యవాదాలు’ అని షమీ భారత క్రికెటర్లకు కృతజ్ఞతలు తెలిపాడు. -
ఇక ‘డ్రా’నందమే!
వరుసగా మూడో రోజు ఆట రద్దు భారత్, దక్షిణాఫ్రికా రెండో టెస్టు బెంగళూరు: భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో ఇక ఎంతమాత్రం ఫలితం వచ్చే అవకాశాలు లేవు. కేవలం తొలి రోజు ఆట మాత్రమే సాధ్యమైన ఈ మ్యాచ్‌లో వరుసగా మూడో రోజు కూడా వరుణుడు అడ్డుపడ్డాడు. దీంతో నాలుగో రోజు మంగళవారం కూడా ఒక్క బంతి పడకుండానే మ్యాచ్ రద్దయ్యింది. భారీ వర్షాల కారణంగా మైదానం పూర్తి చిత్తడిగా మారింది. ఉదయం వర్షం పడకపోవడంతో మ్యాచ్‌పై కాస్త ఆశలు రేకెత్తాయి. అంపైర్లు కూడా మూడు సార్లు మైదానాన్ని పరిశీలించారు. ముందుగా లంచ్ సమయం వరకు వాయిదా వేసినా పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోవడంతో పాటు చిరు జల్లులు కూడా కురుస్తుండడంతో రద్దుకే మొగ్గుచూపారు. అయితే ఆటవిడుపుగా భారత ఆటగాళ్లు కొద్దిసేపు మైదానంలో ఫుట్‌బాల్ ఆడారు. చివరి రోజు బుధవారం పరిస్థితి అనుకూలిస్తే ఉదయం 9.15 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. తొలి రోజు ప్రొటీస్ 214 పరుగులకు ఆలౌట్ కాగా... భారత్ వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ‘రహానే మెరుపు ఫీల్డింగ్ వెనుక కఠోర శ్రమ’ ప్రస్తుతం స్లిప్‌లో అద్భుతంగా ఫీల్డింగ్ చేస్తుండడంతో పాటు ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాడిగా అజింక్యా రహానే ఘనత సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ నైపుణ్యం వెనుక కఠోర శ్రమ దాగి ఉందని భారత ఫీల్డింగ్ కోచ్ ఆర్.శ్రీధర్ తెలిపారు. ‘రహానే అద్భు త స్లిప్ ఫీల్డర్‌గా ఎదుగుతున్నాడు. దీనికోసం తను విపరీతంగా కష్టపడ్డాడు. కొన్ని వందల క్యాచ్‌లను ప్రాక్టీస్ చేశాడు. బ్యాట్స్‌మన్ నుంచి వచ్చే బంతిని సరిగ్గా అంచనా వేయగలిగి దానికి తగ్గట్టు స్పందిస్తున్నాడు’ అని శ్రీధర్ అన్నారు. -
సంగక్కర ‘డబుల్’
వెల్లింగ్టన్: న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. వెటరన్ బ్యాట్స్‌మన్ సంగక్కర (306 బంతుల్లో 203; 18 ఫోర్లు, 3 సిక్సర్లు) డబుల్ సెంచరీ మోత మోగించడంతో... ఆదివారం రెండో రోజు లంక తొలి ఇన్నింగ్స్‌లో 102.1 ఓవర్లలో 356 పరుగులకు ఆలౌటైంది. దీంతో మ్యాథ్యూస్ సేనకు 135 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం దక్కింది. చండిమల్ (143 బంతుల్లో 67; 8 ఫోర్లు) రాణించాడు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కివీస్ ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 11 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 22 పరుగులు చేసింది. లాథమ్ (9 బ్యాటింగ్), రూథర్‌ఫోర్డ్ (12 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ఆతిథ్య జట్టు ఇంకా 113 పరుగులు వెనుకబడి ఉంది. అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన జాబితాలో సంగక్కర రెండో స్థానంలో ఉన్నాడు. 12 డబుల్ సెంచరీలతో డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) అగ్రస్థానంలో ఉన్నాడు. అంతకుముందు 78/5 ఓవర్‌నైట్ స్కోరుతో రెండో ఆట కొనసాగించిన లంక ఇన్నింగ్స్‌కు సంగక్కర వెన్నెముకగా నిలిచాడు. అటాకింగ్‌ను పక్కనబెట్టి ఓపికగా ఏడు గంటల పాటు బ్యాటింగ్ చేసి కివీస్ బౌలర్లపై పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించాడు. చండిమల్ కూడా నిలకడను చూపడంతో ఈ ఇద్దరు ఆరో వికెట్‌కు 130 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను పటిష్టపరిచారు. అయితే చండిమల్ అవుటైన తర్వాత లంక ఇన్నింగ్స్‌లో తడబాటు మొదలైంది. సహచరులు అవుటవుతున్నా... సంగక్కర మాత్రం వేగంగా పరుగులు రాబట్టాడు.