తిప్పేదెవరో... తిరిగేదెవరో! | India, England in the second Test from today | Sakshi
Sakshi News home page

తిప్పేదెవరో... తిరిగేదెవరో!

Published Wed, Nov 16 2016 11:31 PM | Last Updated on Mon, Sep 4 2017 8:15 PM

తిప్పేదెవరో...   తిరిగేదెవరో!

తిప్పేదెవరో... తిరిగేదెవరో!

భారత్, ఇంగ్లండ్ రెండో టెస్టు నేటి నుంచి 
కీలకం కానున్న టాస్ 
గంభీర్ స్థానంలో రాహుల్ 
ఇంగ్లండ్ జట్టులోనూ ఒక మార్పు 

సాగర తీరాన చారిత్రక ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆంధ్ర క్రికెట్ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్‌కు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం వేదిక కాబోతోంది. భారత్, ఇంగ్లండ్ జట్లు స్పిన్ పోరాటానికి సై అంటున్నారుు. తొలి టెస్టులో ఆధిపత్యం సాధించిన ధీమాతో ఇంగ్లండ్... తమ బలంతో ప్రత్యర్థిని చిత్తు చేయాలనే కసితో భారత్ అమీతుమీ తేల్చుకోబోతున్నారుు.

కోహ్లి కోరుకున్నట్లే వైజాగ్‌లో స్పిన్ పిచ్ రెడీగా ఉంది. మూడో రోజు ఉదయం నుంచి బంతి తిరుగుతుందనే అంచనా ఉన్న పిచ్‌ను  మరింత తడిపేశారు. దీంతో తొలి రోజే స్పిన్ తిరిగినా... ఏదైనా జట్టు కుప్పకూలినా... ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఈ నేపథ్యంలో భారత్ తమ స్పిన్నర్లతో ఎంత ధీమాగా ఉందో ఇంగ్లండ్ కూడా తమ స్పిన్ త్రయంతో అంతే ధీమాగా బరిలోకి దిగుతోంది. 

విశాఖపట్నం నుంచి సాక్షి క్రీడా ప్రతినిధి
ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఇద్దరు కోహ్లి, జో రూట్. ఇటు భారత కెప్టెన్‌తో పాటు అటు ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కూడా తమ 50వ టెస్టు మ్యాచ్ ఆడటానికి సిద్ధమయ్యారు. ఈ ఇద్దరి కెరీర్‌లోనూ ఇదో మైలురారుు. వైజాగ్ నగరంలో ఎప్పుడూ విఫలంకాని కోహ్లి గత రికార్డు దృష్ట్యా ఈ మ్యాచ్‌నూ చిరస్మరణీయంగా మార్చుకోవాలని భావిస్తున్నాడు. అటు ఇంగ్లండ్ కూడా తమ కీలక పేసర్ అండర్సన్ కోలుకోవడం, స్పిన్నర్ల రాణింపు, బ్యాట్స్‌మెన్ ఫామ్ కారణంగా ఆత్మవిశ్వాసంతో ఉంది. తొలి టెస్టు అనుభవాలను పరిగణలోకి తీసుకుంటే ఇంగ్లండ్ స్పిన్నర్లను ఆడటం కూడా అంత తేలికేం కాదని అర్థమైంది. స్పిన్ భారత ఆయుధమైతే అదే ఆయుధంతో తిప్పిగొట్టగల సామర్థ్యం తమకు ఉందని కుక్ సేన బలంగా నమ్ముతోంది. ఈ నేపథ్యంలో భారత్, ఇంగ్లండ్‌ల మధ్య రెండో టెస్టు నేటి నుంచి (గురువారం) డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరుగుతుంది. మరి తిప్పేదెవరో..? గిర్రున తిరిగేదెవరో తేలాలంటే కనీసం మూడు రోజులు మ్యాచ్ చూడాల్సిందే. ఏమైనా టాస్ గెలిచిన జట్టుకు ఫలితం అనుకూలంగా ఉండే అవకాశం ఉంది.

ఒక్కటే మార్పు
తొలి టెస్టు ఆడిన జట్టులో భారత్ ఒక్క మార్పు చేయనుంది. ఓపెనర్ రాహుల్ తిరిగి వచ్చినందున గంభీర్ బెంచ్‌కు పరిమితం కావలసి ఉంటుంది. మరో ఓపెనర్ మురళీ విజయ్, పుజారా కూడా ఫామ్‌లో ఉన్నందున భారత టాపార్డర్ పటిష్టంగా కనిపిస్తోంది. వైజాగ్ లాంటి పిచ్‌పై రహానే లాంటి టెక్నిక్ ఉన్న బ్యాట్స్‌మన్ కీలకం. అలాగే కోహ్లి కూడా మంచి టచ్‌లోనే కనిపిస్తున్నాడు. భారత్ బ్యాటింగ్ లైనప్ ఓవరాల్‌గా పటిష్టంగా కనిపిస్తున్నాం బంతి అనూహ్యంగా టర్న్ అరుుతే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. కనీసం ఇద్దరైనా క్రీజులో రెండు సెషన్ల పాటు గడపాలి. ఇక బౌలింగ్ విషయానికొస్తే మరోసారి స్పిన్ త్రయం అశ్విన్, జడేజా, మిశ్రా తుది జట్టులో ఉండటం ఖాయం. మ్యాచ్‌కు రెండు రోజుల ముందు కుంబ్లే వ్యాఖ్యలను బట్టి చూస్తే షమీ, ఉమేశ్ కూడా తుది జట్టులో ఉండొచ్చు. ఏమైనా గత సిరీస్‌ల తరహాలో ఈసారి స్పిన్నర్లను ఊరించే పిచ్ సిద్ధమైన నేపథ్యంలో అశ్విన్ కీలకం కానున్నాడు. అమిత్ మిశ్రా కూడా గత మ్యాచ్‌తో పోలిస్తే ఆత్మవిశ్వాసంతోనే కనిపిస్తున్నాడు.

అండర్సన్ రావచ్చు...
అటు ఇంగ్లండ్ జట్టు కూడా ఈ మ్యాచ్‌లో ఒక మార్పు చేయొచ్చు. పేసర్ వోక్స్‌కు చిన్నపాటి గాయం ఉంది. కాబట్టి తన స్థానంలో అండర్సన్ బరిలోకి దిగే అవకాశం ఉంది. అరుుతే దాదాపు రెండు నెలలుగా తను పోటీ క్రికెట్‌కు దూరంగా ఉన్నాడు. అరుునా అతని అనుభవం దృష్టా ్య అండర్సన్ తుది జట్టులో ఉంటాడు. ఇక మిగిలిన జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న కొత్త కుర్రాడు హమీద్, ఫామ్‌లో ఉన్న కుక్, రూట్‌లతో ఇంగ్లండ్ బ్యాటింగ్ విభాగం బలంగా ఉంది. ముఖ్యంగా కుక్ స్పిన్ పిచ్‌లపై బాగా ఆడతాడు. కాబట్టి తన వికెట్ కీలకం.  బౌలింగ్ విభాగంలో బ్రాడ్, అండర్సన్, స్టోక్స్ పేస్ బాధ్యతలు తీసుకుంటే మొరుున్ అలీ, రషీద్, అన్సారీ స్పిన్నర్లుగా తుది జట్టులో ఉంటారు. ఏమైనా గత మ్యాచ్ తరహాలో స్పిన్నర్లు రాణిస్తే ఇంగ్లండ్‌కు కూడా మంచి అవకాశాలు ఉంటారుు.

జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రాహుల్, విజయ్, పుజారా, రహానే, సాహా, అశ్విన్, జడేజా, మిశ్రా, షమీ, ఉమేశ్/పాండ్యా.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హమీద్, రూట్, డకెట్, మొరుున్ అలీ, స్టోక్స్, బెరుుర్‌స్టో, రషీద్, అన్సారీ, బ్రాడ్, అండర్సన్.

టాస్ గెలవడం వల్ల కొంత లాభం ఉంటుంది. అలాగని టాస్ ఓడిపోతే ఏం చేయలేమని కాదు. ఒత్తిడిని ఎలా జరుుంచాలో గత మ్యాచ్‌లో నేర్చుకున్నాం. గెలవడం కోసం ఆడే సమయంలో ఆలోచన ఒకలా ఉంటుంది. మ్యాచ్ కాపాడుకోవడానికి ఆడే సమయంలో పరిస్థితి మరోలా ఉంటుంది. టెస్టు క్రికెట్‌లో వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలి. గత మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలేశాం. కానీ దాని గురించి చింత లేదు. ఈసారి అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ వినియోగించుకుంటాం. సొంతగడ్డపై మనకు అనుకూలంగానే పిచ్‌లు ఉండాలి. వైజాగ్ పిచ్ ఎప్పుడూ స్పిన్నర్లకు అనుకూలిస్తుంది.  - కోహ్లి, భారత కెప్టెన్

తొలి టెస్టులో ఐదురోజుల పాటు అన్ని విభాగాల్లోనూ రాణించాం. భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టాం. అదే ఆత్మవిశ్వా సంతో రెండో టెస్టులో బరిలోకి దిగుతున్నాం. పిచ్ గురించి వార్తలు చూస్తున్నాం. మా స్పిన్నర్లు తొలి టెస్టు తరహాలో బౌలింగ్ చేస్తే భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగలుగుతాం. బంగ్లాదేశ్‌లో ఒకే సెషన్‌లో పది వికెట్లు పడ్డ పిచ్‌పై మేమే కాదు, ఎవరూ ఆడలేరు. ఆ తర్వాత అలాంటి పిచ్‌లపై ఆడేందుకు కూడా సన్నద్ధమయ్యాం. మా జట్టు కూర్పు దృష్ట్యా వైజాగ్ పిచ్‌పై కూడా మేం ఆత్మవిశ్వాసంతో ఆడగలం.
- కుక్, ఇంగ్లండ్ కెప్టెన్

స్టేడియం ప్రొఫైల్
పేరు: డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఏసీఏ-వీడీసీఏ స్టేడియం
నిర్మాణం: 2003లో, సామర్థ్యం: 38 వేలు
ఇప్పటివరకూ జరిగిన మ్యాచ్‌లు: ఆరు వన్డేలు, రెండు టి20లు
తొలి అంతర్జాతీయ మ్యాచ్: ఏప్రిల్ 5న, 2005లో

ప్రత్యేక పూజలు
తమ చరిత్రలో తొలి టెస్టు మ్యాచ్ నిర్వహిస్తున్న సందర్భంగా స్టేడియం సిబ్బంది బుధవారం ఉదయం మైదానం సమీపంలో పిచ్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు.

 

ఆటోగ్రాఫ్‌లు చేసి ఇచ్చేయడమే... నోట్ల రద్దుపై కోహ్లి
పెద్ద నోట్ల రద్దు నిర్ణయాన్ని కోహ్లి కొనియాడాడు. ‘రాజ్ కోట్‌లో హోటల్ బిల్లు కట్టేందుకు ఐదొందలు తీశాను. తర్వాత గుర్తొచ్చింది, అది చెల్లదని. ఇక ఆ నోట్లపై ఆటోగ్రాఫ్‌లు చేసి ఇచ్చేయడమే. అంతకుమించి అవి పనికిరావు. నేను చూసినంత వరకు భారత రాజకీయ చరిత్రలో ఇది అతి గొప్ప నిర్ణయం. ఇది నిజంగా నమ్మశక్యం కాని గొప్ప విషయం’ అంటూ కోహ్లి ప్రధాని నరేంద్ర మోదీని కొనియాడాడు.

పిచ్, వాతావరణం
ఎలాంటి సందేహం లేకుండా స్పిన్ పిచ్ సిద్ధంగా ఉంది. మొదటి రోజు కాస్త బ్యాటిం గ్‌కు అనుకూలంగా ఉండొచ్చు. టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. వర్షం ప్రమాదం ఏమీ లేదు. ఉదయం గం. 9.30 నుంచి   స్టార్ స్పోర్‌‌-1లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement