కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో శ్రీలంక పరాజయం దిశగా పయనిస్తోంది. 507 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్యంతో బరిలోకి దిగిన లంక రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి 40 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది.
అంతకుముందు 35/0 ఓవర్‌నైట్ స్కోరుతో బుధవారం ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను 224/7 స్కోరు వద్ద డిక్లేర్ చేసింది. తొలి ఇన్నింగ్స్ 282 పరుగుల ఆధిక్యాన్ని కలుపుకొని లంక ముందు 507 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
ఓటమి దిశగా శ్రీలంక
Published Thu, Jan 5 2017 12:55 AM | Last Updated on Tue, Sep 5 2017 12:24 AM
Advertisement
Advertisement