ఫైనల్లో జింబాబ్వే | The success of the triangular tournament against West Indies | Sakshi
Sakshi News home page

ఫైనల్లో జింబాబ్వే

Published Fri, Nov 25 2016 11:55 PM | Last Updated on Mon, Sep 4 2017 9:06 PM

ఫైనల్లో జింబాబ్వే

ఫైనల్లో జింబాబ్వే

ముక్కోణపు టోర్నీలో వెస్టిండీస్‌పై విజయం

బులవాయో: ముక్కోణపు వన్డే టోర్నీలో జింబాబ్వే జట్టు అనూహ్యంగా ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు పరుగుల తేడాతో (డక్‌వర్త్-లూయీస్ ప్రకారం) వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసింది.

సికందర్ రజా (103 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో పాటు  తెందై చిసోరో (35 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించారు. నర్స్, బిషూ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 27.3 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులు చేసిన దశలో వర్షం కురిసింది. కార్టర్ (56 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు), హోల్డర్ (22 నాటౌట్) జట్టును గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయీస్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఆ సమయానికి వెస్టిండీస్ 130 పరుగులు చేస్తే గెలిచి ఉండేది. ఫైనల్లో శ్రీలంకతో జింబాబ్వే తలపడుతుంది. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement