tri-series tournament
-
ఉత్కంఠ ఫైనల్లో బంగ్లాదేశ్‌పై జయభేరి
-
దినేశ్ కార్తీక్ సూపర్ హిట్
ఇది అలాంటి ఇలాంటి ఉత్కంఠ కాదు. తనువును ఉన్నచోటే బంధించింది. కళ్లను రెప్పలు కొట్టకుండా కట్టేసింది. గుండె దడను అమాంతం పెంచేసింది. నిజం... ఆ ఉత్కంఠకు నరాలు కాదు ఉక్కు తీగలే తెగుతాయేమో?భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు... క్రీజులో పాతుకుపోయిన బ్యాట్స్‌మన్ లేడు. కేవలం జిడ్డుగా, పరుగులకు అడ్డుగా ఉన్న విజయ్ శంకరే ఉన్నాడు. దినేశ్ కార్తీక్ అప్పుడే వచ్చాడు. అది 19వ ఓవర్! ఇక గెలుపు ఆశలే లేవు. టి20ల్లో ఏనాడూ బంగ్లాదేశ్ చేతిలో ఓడిపోని భారత్... ఇపుడు ఏకంగా కప్‌నే కోల్పోవాల్సిన పరిస్థితి. కానీ దినేశ్ దడదడలాడించాడు. రూబెల్ హొస్సేన్ వేసిన ఆ ఓవర్లో జూలు విదిల్చాడు. 6, 4, 6, 0, 2, 4 అంతే! భారత విజయ సమీకరణం 6 బంతుల్లో 12 పరుగులైంది. సౌమ్య సర్కార్ చేతిలో బంతి. ఇక ఈజీలే అనుకుంటే విజయ్ శంకర్ బంతులు మింగే పనిలో ఉన్నాడు. తొలి బంతికి వైడ్‌తో పరుగొచ్చింది. 0, 1, 1, ఎట్టకేలకు 4వ బంతికి ఫోర్ కొట్టి ఐదో బంతికి ఔటయ్యాడు. ఇక మిగిలింది ఒక్కటే బంతి! గెలిచేందుకు 5 పరుగులు.క్రీజులో దినేశ్ కార్తీక్... ఉత్కంఠ ఎవరెస్టంతా. అందరిలోనూ టెన్షన్... టెన్షన్... కార్తీక్ ఒక్కడే అటెన్షన్. సౌమ్య సర్కార్ బంతి వేశాడు. అందరూ కళ్లప్పగించి చూస్తుండగా కార్తీక్ బ్యాట్ నుంచి ఎక్స్ట్రా కవర్స్ మీదుగా ఫ్లాట్ షాట్. ఫోరేమోననే బెంగ... కానీ అది సిక్సర్. భారతే విన్నర్. కొలంబో: దినేశ్ కార్తీక్ 29 నాటౌట్. లెక్కకు స్కోరు తక్కువే! కానీ 8 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో మ్యాచ్‌నే మలుపు తిప్పే ఇన్నింగ్స్ ఆడాడు. భారత్‌కు ఒంటిచేత్తో నిదహస్ ట్రోఫీని అందించాడు. బంగ్లాదేశ్‌తో ఆదివారం జరిగిన ఫైనల్లో భారత్ 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. షబ్బీర్ రహమాన్ (50 బంతుల్లో 77; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) రాణించాడు. యజువేంద్ర చహల్ 3, ఉనాద్కట్ 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 168 పరుగులు చేసి గెలిచింది. రోహిత్ శర్మ (42 బంతుల్లో 56; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించాడు. రూబెల్ హొస్సేన్కు 2 వికెట్లు దక్కాయి. దినేశ్ కార్తీక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’... వాషింగ్టన్ సుందర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి. ఈ మ్యాచ్‌లో భారత్ ఒక మార్పు చేసింది. హైదరాబాదీ పేసర్ సిరాజ్ స్థానంలో ఉనాద్కట్‌ను బరిలోకి దించింది. స్పిన్‌తో విలవిల... టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్‌కు దిగిన బంగ్లా బ్యాట్స్‌మెన్‌ను భారత స్పిన్నర్లు కట్టడి చేశారు. ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో జట్టు స్కోరు 27 పరుగుల వద్ద ఓపెనర్ లిటన్ దాస్ (11; 1 సిక్స్)ను సుందర్ ఔట్ చేయగా, ఆ మరుసటి ఓవర్లోనే చహల్ దెబ్బమీద దెబ్బ తీశాడు. మరో ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ (15; 1 ఫోర్)తో పాటు సౌమ్య సర్కార్ (1)నూ పెవిలియన్ చేర్చాడు. తమీమ్ భారీ సిక్సర్‌కు ప్రయత్నించగా, లాంగాన్‌లో ఫీల్డర్ శార్దుల్ ఠాకూర్ బౌండరీ లైన్ వద్ద తనను తాను నియంత్రించుకుంటూ అద్భుతమైన క్యాచ్ పట్టాడు. దీంతో 27 పరుగుల వద్దే బంగ్లా రెండో వికెట్ కోల్పోయింది. తర్వాత వచ్చిన సౌమ్య సర్కార్ స్వీప్‌షాట్ ఆడగా... స్క్వేర్ లెగ్‌లో శిఖర్ ధావన్ క్యాచ్ అందుకున్నాడు. 33 పరుగులకే మూడు కీలక వికెట్లను కోల్పోయిన బంగ్లాను షబ్బీర్ రహమాన్, ముష్ఫికర్ రహీమ్ ఆదుకునే ప్రయత్నం చేశారు. కానీ చహల్ వారికి ఆ అవకాశం ఇవ్వలేదు. గూగ్లీతో ముష్ఫికర్ (9) ఆట కట్టించాడు. అతని క్యాచ్‌ను విజయ్ శంకర్ డైవ్ చేసి పట్టడంతో బంగ్లా 68 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. ఆదుకున్న షబ్బీర్... అనంతరం షబ్బీర్‌కు మహ్ముదుల్లా జతయ్యాడు. ఇద్దరు అడపాదడపా బౌండరీలతో రన్‌రేట్ తగ్గకుండా జాగ్రత్త పడ్డారు. దీంతో బంగ్లాదేశ్ 14వ ఓవర్ చివరి బంతికి 100 పరుగులు పూర్తి చేసుకుంది. ఇన్నింగ్స్ కుదుటపడిందనుకున్న ఈ దశలో సమన్వయలేమితో మహ్ముదుల్లా (16 బంతుల్లో 21; 2 ఫోర్లు) రనౌటయ్యాడు. లేని పరుగుకు ప్రయత్నించిన షబ్బీర్... మహ్ముదుల్లాను బలిచేశాడు. తర్వాత వచ్చిన షకీబుల్ హసన్ అండతో షబ్బీర్ 37 బంతుల్లో (5 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాడు. విజయ్ శంకర్ వేసిన ఇన్నింగ్స్ 17వ ఓవర్లో షబ్బీర్ 2 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. అదే ఓవర్ ఐదో బంతికి షకీబుల్ (7) కూడా రనౌటయ్యాడు. డెత్ ఓవర్లలో స్కోరు పెంచేందుకు సిద్ధమవుతున్న షబ్బీర్‌ను 19వ ఓవర్లో ఉనాద్కట్ క్లీన్‌బౌల్డ్ చేశాడు. మరుసటి బంతికి రూబెల్ హొస్సేన్ (0) కూడా బౌల్డయ్యాడు. శార్దుల్ వేసిన చివరి ఓవర్లో మెహదీ హసన్ మిరాజ్ 2 ఫోర్లు, 1 సిక్స్‌తో మొత్తం 18 పరుగులు సాధించాడు. స్పిన్‌కు పేస్ జతకాలేదు... స్పిన్నర్లు చహల్ (3/18), సుందర్ (1/20) పవర్ ప్లేలో బంగ్లా (40/3)ను కట్టడి చేశారు. వీరి శ్రమకు పేసర్లు జతయితే బంగ్లా స్వల్ప స్కోరుకే పరిమితమయ్యేది. కానీ విజయ్ శంకర్ (0/48), శార్దుల్ ఠాకూర్ (0/45) ధారాళంగా పరుగులు సమర్పించుకోవడంతో బంగ్లాదేశ్ పోరాడే లక్ష్యాన్నే భారత్ ముందుంచింది. తడబడింది... లక్ష్యఛేదనకు దిగిన భారత ఇన్నింగ్స్ ధాటిగా ప్రారంభమైంది. రెండో ఓవర్లో కెప్టెన్ రోహిత్ రెండు సిక్సర్లు, ఒక ఫోర్ బాదడంతో 17 పరుగులు వచ్చాయి. రెండు ఓవర్లలోనే 24 పరుగులు చేయగా... ఆ తర్వాతి వరుస ఓవర్లలో ధావన్ (10), రైనా (0)లు నిష్క్రమించడంతో భారత్ ఇన్నింగ్స్ తడబడింది. ఈ దశలో రోహిత్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. ముందుగా రాహుల్‌తో కలిసి రన్‌రేట్ తగ్గకుండా లక్ష్యం దిశగా నడిపించాడు. బ్యాట్‌కు అందిన బంతిని భారీ సిక్సర్లుగా, అదుపు తప్పిన బంతిని బౌండరీగా మలుస్తూ ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. మూడో వికెట్‌కు వీరిద్దరు 51 పరుగులు జోడించాక జట్టు స్కోరు 83 పరుగుల వద్ద రాహుల్... రూబెల్ హొస్సేన్ బౌలింగ్‌లో షబ్బీర్‌కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో మనీశ్ పాండే క్రీజ్‌లోకి రాగా... రోహిత్ 35 బంతుల్లో (4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. అంతర్జాతీయ టి20ల్లో అతనికిది 14వ అర్ధ సెంచరీకాగా కొద్దిసేపటికే నాలుగో వికెట్‌గా నిష్క్రమించాడు. నజ్ముల్ ఇస్లామ్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించిన రోహిత్ మహ్ముదుల్లా క్యాచ్ పట్టడంతో పెవిలియన్ చేరాడు. బ్యాటింగ్ ఆర్డర్లో ప్రమోషన్‌గా వచ్చిన విజయ్ శంకర్ భారత ఇన్నింగ్స్‌కు గుదిబండగా మారాడు. పాండే (27 బంతు ల్లో 28; 3 ఫోర్లు) వేగంగా పరుగులు చేస్తుంటే... మరోవైపు విజయ్ (19 బంతుల్లో 17; 3 ఫోర్లు) అదేపనిగా బంతుల్ని వృథా చేశాడు. దీంతో సమీకరణం మారింది. 15 ఓవర్లు ముగిసే సరికి 30 బంతుల్లో 52 పరుగులు చేయాల్సి ఉండగా, 18 బంతుల్లో 35కు పెరిగింది. 18వ ఓవర్ వేసిన ముస్తఫిజుర్ కేవలం పరుగు మాత్రమే ఇచ్చి పాండే వికెట్ తీశాడు. ఇక భారత్ గెలవాలంటే 12 బంతుల్లో 34 పరుగులు చేయాలి. ఈ దశలో వచ్చిన దినేశ్ కార్తీక్ అసాధారణ ఆటతీరుతో భారత్‌ను గెలిపించాడు. ►టి20 ఫార్మాట్లో బంగ్లాదేశ్‌పై భారత్‌కిది వరుసగా ఎనిమిదో విజయం. ►టి20 మ్యాచ్‌ల్లో చివరి బంతికి విజయానికి 5 పరుగులు అవసరం కాగా... సిక్స్ కొట్టి గెలిపించిన తొలి బ్యాట్స్‌మన్ కార్తీక్. ►అంతర్జాతీయ టోర్నమెంట్ ఫైనల్లో చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన రెండో క్రికెటర్ దినేశ్ కార్తీక్. ఇంతకుముందు 1986లో షార్జాలో జరిగిన ఆస్ట్రేలేసియా కప్ ఫైనల్లో భారత్‌పై చివరి ఓవర్ చివరి బంతికి మియాందాద్ సిక్స్ కొట్టి పాక్‌ను గెలిపించాడు. ►ఆఖరి బంతికి సిక్స్ కొట్టి అంతర్జాతీయ టి20 మ్యాచ్‌లో జట్టును గెలిపించిన ఐదో క్రికెటర్ దినేశ్ కార్తీక్. గతంలో కపుగెడెర (శ్రీలంక; భారత్‌పై 2010లో), మోర్గాన్ (ఇంగ్లండ్; భారత్‌పై 2012లో), బాబర్ (పాకిస్తాన్; విండీస్‌పై 2013లో), సిబండ (జింబాబ్వే; నెదర్లాండ్స్‌పై 2014లో) ఇలా చేశారు. -
ఫైనల్లో జింబాబ్వే
ముక్కోణపు టోర్నీలో వెస్టిండీస్‌పై విజయం బులవాయో: ముక్కోణపు వన్డే టోర్నీలో జింబాబ్వే జట్టు అనూహ్యంగా ఫైనల్లోకి ప్రవేశించింది. శుక్రవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో జింబాబ్వే ఐదు పరుగుల తేడాతో (డక్‌వర్త్-లూయీస్ ప్రకారం) వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే 49 ఓవర్లలో 8 వికెట్లకు 218 పరుగులు చేసింది. సికందర్ రజా (103 బంతుల్లో 76 నాటౌట్; 3 ఫోర్లు) అర్ధసెంచరీతో పాటు తెందై చిసోరో (35 బంతుల్లో 42 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు. వీరిద్దరు తొమ్మిదో వికెట్‌కు అభేద్యంగా 91 పరుగులు జోడించారు. నర్స్, బిషూ చెరో 3 వికెట్లు తీశారు. అనంతరం వెస్టిండీస్ 27.3 ఓవర్లలో 5 వికెట్లకు 124 పరుగులు చేసిన దశలో వర్షం కురిసింది. కార్టర్ (56 బంతుల్లో 43 నాటౌట్; 4 ఫోర్లు), హోల్డర్ (22 నాటౌట్) జట్టును గెలిపించే ప్రయత్నంలో ఉన్నారు. వర్షం తగ్గకపోవడంతో డక్‌వర్త్-లూయీస్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. ఆ సమయానికి వెస్టిండీస్ 130 పరుగులు చేస్తే గెలిచి ఉండేది. ఫైనల్లో శ్రీలంకతో జింబాబ్వే తలపడుతుంది. -
ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’
భారత్ ‘ఎ’పై 3 వికెట్ల విజయం అగర్‌కు 5 వికెట్లు చెన్నై: ముక్కోణపు వన్డే టోర్నీలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఆ జట్టు విజయం సాధిం చింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ‘ఎ’ 3 వికెట్లతో భారత్ ‘ఎ’ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది. అనంతరం ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (61 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అస్టిన్ అగర్ (5/39) చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను కట్టి పడేశాడు. క్రిస్ లిన్ (61 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆడమ్ జంపా (49 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... ఫెర్గూసన్ (45 నాటౌట్), హెడ్ (45) రాణించాడు. లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ (3/45) ధాటికి ఒక దశలో ఆసీస్ మిడిలార్డర్ 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే జంపా, ఫెర్గూసన్ ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును గెలిపించారు. -
ధోనీ ప్రణాళికలు సరిగా లేవు: గవాస్కర్
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఘోరంగా వైఫల్యం చెందడంతో సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. శుక్రవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ లో కూడా ధోనీ సేన పూర్తిగా విఫలం కావడంతో మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ విమర్శనాస్త్రాలు సంధించాడు. అసలు ఈ టోర్నీలో ధోనీ ప్రణాళికలను సరిగా అమలు చేయడంలో వైఫల్యం చెందాడని గవాస్కర్ అభిప్రాయపడ్డాడు. ధోనీ ప్రణాళికలు చాలా నాసిరకంగా ఉండటమే కాకుండా.. వాటిలో కుదింపు స్పష్టంగా కనబడిందన్నాడు. రానున్నది ప్రపంచకప్ ను దృష్టిలో పెట్టుకుని టీమిండియా ఆడినట్లు లేదన్నాడు.టీమిండియా ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ తన బౌలింగ్ లో ఆకట్టుకున్నా.. ధోనీ అతన్ని సరిగా వినియోగించుకోలేదని మండిపడ్డాడు. ఎనిమిది ఓవర్లలో మూడు వికెట్లు తీసిన ఆటగాడిరి పూర్తి కోట ఇవ్వకుండా ఉండటం ధోనీ చేసిన తప్పుగా గవాస్కర్ తెలిపాడు. తానొక ఆశావాదినని.. టీమిండియా ఓటమి పాలుకావడం తనను తీవ్రంగా కలచి వేసిందని మాజీ లెజెండ్ ఆటగాడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా స్టువర్ట్ బిన్నీ మంచి ఆటగాడైనా.. ఆస్ట్రేలియాలో ఆ యువ ఆటగాడు షాట్ల ఎంపిక సరిగా లేదన్నాడు. ఆస్ట్రేలియాలో స్టేడియాలు పెద్దవి అన్న సంగతిని బిన్నీ మరచినట్టున్నాడని గవాస్కర్ పాఠాలు చెప్పాడు. ఆస్ట్రేలియాలో కట్ అండ్ పుల్ షాట్లు ఆడితే బాగుండేదని హితవు పలికాడు. -
ఫైనల్లో ఇంగ్లండ్
-
టీమిండియా అవుట్: ఫైనల్లో ఇంగ్లండ్
పెర్త్: ఊహించినట్టుగానే టీమిండియా ముక్కోణపు సిరీస్ నుంచి వైదొలిగింది. టోర్నీలో ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయని టీమిండియా కు వరల్డ్ కప్ ముందు మంచి ఎదురుదెబ్బ తగిలింది. ముక్కోణపు సిరీస్ లో భాగంగా శుక్రవారం ఇంగ్లండ్ తో జరిగిన కీలకమైన ఆఖరి లీగ్ మ్యాచ్ లో టీమిండియా బోక్కా బోర్లా పడి టోర్నీ నుంచి భారంగా నిష్ర్కమించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 201పరుగుల స్వల్ప లక్ష్యాన్ని మాత్రమే ఇంగ్లండ్ ముందుంచింది. ఈ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లండ్ ఆదిలో కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పయనించింది. 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ను జేమ్స్ టేలర్(82), బట్లర్(67 )లు ఆదుకున్నారు. ఒత్తిడిని జయంచి చివరి వరకూ క్రీజ్ లో నిలబడిన ఈ ఇద్దరు ఆటగాళ్లు ఇంగ్లండ్ కు మరపురాని విజయాన్ని అందించారు.190 పరుగుల వద్ద జేమ్స్ టేలర్, 193 పరుగుల వద్ద బట్లర్ లు పెవిలియన్ కు చేరినా.. అప్పటికే ఇంగ్లండ్ విజయం ఖాయం కావడంతో చివరి వరుస ఆటగాళ్ల ఆ పనిని పూర్తి చేశారు.. మూడు వికెట్ల తేడాతో విజయం సాధించి ఫైనల్ కు చేరిన ఇంగ్లండ్.. ఆస్ట్రేలియాతో తుదిపోరుకు సన్నద్ధమైంది. టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీకి మూడు వికెట్లు లభించగా, మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. ఈ టోర్నమెంట్ లో టీమిండియా ఒక్క విజయాన్ని కూడా చేజిక్కించుకోలేక పోవడం గమనార్హం. ముక్కోణపు సిరీస్ లో టీమిండియా ఆటగాళ్లు ఘోరంగా వైఫల్యం చెందడం అభిమానుల్ని తీవ్రంగా కలచివేస్తోంది. రానున్న ప్రపంచకప్ లో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగుతున్న టీమిండియా ఇదే తరహా ఆటను ప్రదర్శిస్తే ఆదిలోనే ఇంటిదారి పట్టాల్సి ఉంటుంది. ఈ సిరీస్ ను ఒక గుణపాఠంగా భావించి టీమిండియా ఏ మేరకు రాణిస్తుందో వేచి చూడాల్సిందే. -
ఏడో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(193/7)
పెర్త్ :ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 193 పరుగుల వద్ద ఏడో వికెట్ ను కోల్పోయింది. వరుస రెండు వికెట్లు కోల్పోవడంతో ఇంగ్లండ్ ఆటగాళ్లలో కలవరం మొదలైంది. ఇంకా ఇంగ్లండ్ విజయానికి ఏడు పరుగులు అవసరం కాగా, మూడు వికెట్లు చేతిలో ఉన్నాయి.ఇదిలా ఉండగా మ్యాచ్ ముగియడానికి 4.4 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండటం గమనార్హం. -
ఆరో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ 190 పరుగుల వద్ద ఆరో వికెట్ ను కోల్పోయింది. జేమ్ టేలర్(82)పరుగులు చేసి ఆరో వికెట్ రూపంలో వెనుదిరిగాడు.ఇంకా ఇంగ్లండ్ విజయానికి 11 పరుగులే అవసరం కావడంతో వారి విజయం దాదాపు ఖాయమైంది. టీమిండియా బౌలర్లలో స్టువర్ట్ బిన్నీ కి మూడు వికెట్లు లభించగా,మోహిత్ శర్మకు రెండు వికెట్లు దక్కాయి. -
బట్లర్ హాఫ్ సెంచరీ:విజయం దిశగా ఇంగ్లండ్
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో ఇంగ్లండ్ విజయం దిశగా పయనిస్తోంది. శుక్రవారం టీమిండియాతో జరుగుతున్న ఆఖరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆదిలో ఇబ్బంది పడ్డ తరువాత గాడిలో పడింది. ఇంగ్లండ్ ఆటగాళ్లలో బట్లర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకోగా, అంతకుముందు జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీ చేశాడు. 201 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించి ఇంగ్లండ్ తొలుత కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడినట్లు కనిపించింది. అయితే టేలర్- బట్లర్ ల జోడీ మంచి ఇన్నింగ్స్ తో ఇంగ్లండ్ తేరుకుంది.41.5 ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ 178 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. -
జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీ(131/5)
పెర్త్: ముక్కోణపు సిరీస్ లో భాగంగా టీమిండియాతో ఇక్కడ జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్ లో ఇంగ్లండ్ ఆటగాడు జేమ్స్ టేలర్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బవరుస వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్న ఇంగ్లండ్ ను టేలర్ మరోసారి కాపాడాడు. 90 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ టేలర్ బ్యాటింగ్ తో తేరుకుని విజయం దిశగా పయనిస్తోంది.ఇంగ్లండ్ 33 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టానికి 131 పరుగులు చేసింది. -
ఐదో వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్(66/5)
పెర్త్: ముక్కోణపు సిరీస్ లోభాగంగా ఇక్కడ టీమిండియాతో జరుగుతున్న కీలక వన్డేలో ఇంగ్లండ్ 66 పరుగుల వద్ద ఐదో వికెట్ ను కోల్పోయింది. 201 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన ఇంగ్లండ్ వరుస వికెట్లను చేజార్చుకుని కష్టాల్లో పడింది. ఇంగ్లండ్ ఆటగాడు రవి బొపారా(4)పరుగులు చేసి ఐదో వికెట్ రూపంలో వెనుదిరిగాడు. అంతకుముందు బెల్ (10), అలీ (17)తో పాటు రూట్ (3), మోర్గాన్ (2) అవుటయ్యారు. టీమిండియా బౌలర్లలోస్టువర్ట్ బిన్నీ, అక్షర్ పటేల్ కు తలో రెండు వికెట్లు దక్కగా,మహ్మద్ షమీకి ఒక వికెట్ లభించింది. -
పెర్త్ వన్డే: ఇంగ్లండ్ 54 పరుగులకే 4 వికెట్లు
పెర్త్: ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో భారత బౌలర్లు రాణిస్తున్నారు. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 18 ఓవర్లలో 54 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లు బిన్నీ రెండు.. మోహిత్, అక్షర్ పటేల్ చెరో వికెట్ తీశారు. ఇంగ్లండ్ ఓపెనర్లు బెల్ (10), అలీ (17)తో పాటు రూట్ (3), మోర్గాన్ (2) అవుటయ్యారు. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
10 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరు 35/1
పెర్త్: 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 10 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 35 పరుగులు చేసింది. ఇంగ్లండ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 14 వద్ద బెల్ (10) మోహిత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ అలీ (17), టేలర్ (5) క్రీజులో ఉన్నారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
తొలి వికెట్ కోల్పోయిన ఇంగ్లండ్
పెర్త్: లక్ష్యఛేదనలో బరిలోకి దిగిన ఇంగ్లండ్ కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. జట్టు స్కోరు 14 వద్ద బెల్ (10) అవుటయ్యాడు. మోహిత్ శర్మ బౌలింగ్ లో వికెట్ల ముందు దొరికిపోయాడు. మరో ఓపెనర్ అలీకి తోడు టేలర్ క్రీజులోకి వచ్చాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 201 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. -
పెర్త్ వన్డే: మనోళ్లు మళ్లీ బ్యాట్లెత్తేశారు
పెర్త్: ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో మనోళ్లు బ్యాట్లెత్తేశారు. పోరాడకుండానే పెవిలియన్ బాట పట్టారు. ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) మినహా ఇతర బ్యాట్స్‌మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఓపెనర్లు శుభారంభం అందించినా టీమిండియా సద్వినియోగం చేసుకోలేకపోయింది. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ 48.1 ఓవర్లలో 200 పరుగులకు ఆలౌటైంది. ఇంగ్లండ్ బౌలర్లు ఫిన్ మూడు.. బ్రాడ్, అలీ, వోక్స్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. ఓపెనర్లు రహానె, ధవన్ జట్టుకు శుభారంభం అందించారు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో వోక్స్ బౌలింగ్‌లో ధవన్ అవుటవడంతో కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత టీమిండియా బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు క్యూ కట్టారు. కోహ్లీ (8), రైనా (1) వెంటవెంటనే అవుటయ్యారు. ఇంగ్లండ్ బౌలర్ అలీ వీరిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కోహ్లీ.. రూట్‌కు, రైనా.. వోక్స్‌కు క్యాచిచ్చారు. ఆ తర్వాత భారత్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. కాసేపటి తర్వాత అంబటి రాయుడు (12) అవుటవగా, నిలకడగా రాణిస్తున్న రహానె కూడా ఫిన్ బౌలింగ్‌లో అదే దారిపట్టాడు. ఫిన్ మరుసటి ఓవర్లో బిన్నీ అవుటవగా, కెప్టెన్ ధోనీ (17), ఆల్ రౌండర్ జడేజా (5) వరుస ఓవర్లలో పెవిలియన్ చేరారు. చివర్లో షమీ (25) రాణించడంతో స్కోరు అతికష్టమ్మీద 200 మార్క్ చేరుకుంది. షమీ అవుటవడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది. ముక్కోణపు సిరీస్‌లో ఆస్ట్రేలియా ఫైనల్ చేరగా, మరో బెర్తు కోసం ఇంగ్లండ్, భారత్ పోటీపడుతున్న సంగతి తెలిసిందే. సిరీస్‌లో ఇంగ్లండ్.. భారత్‌పై బోనస్ పాయింట్‌తో ఘనవిజయం సాధించింది. కాగా టీమిండియా బోణీ కూడా కొట్టలేకపోయింది. ఆస్ట్రేలియాతో మ్యాచ్ వర్షం కారణంగా రద్దవడంతో భారత్ కు రెండు పాయింట్లు వచ్చాయి. భారత్ ఫైనల్ చేరాలంటే తాజా మ్యాచ్‌లో కచ్చితంగా గెలవాలి. ఈ మాత్రం స్కోరుతో గెలవాలంటే అద్భుతమే జరగాలి. -
ఎనిమిదో వికెట్ కోల్పోయిన భారత్
పెర్త్: ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో భారత బ్యాట్స్ మెన్లు ఘోరంగా విఫలమవుతున్నారు. ఓపెనర్లు రహానె, ధావన్ మినహా మిగతా బ్యాట్స్ మెన్లు బ్యాట్లు ఎత్తేస్తున్నారు. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో భారత్ 43 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. తాజాగా జడేజా (5), ధోని (7) వెంటవెంటనే అవుటయ్యారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఓపెనర్లు రహానె (73), ధవన్ (38) శుభారంభం అందించారు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ తర్వాత కష్టాలు మొదలయ్యాయి. -
30 ఓవర్లలో భారత్ స్కోరు 111/3
పెర్త్: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్లు రాణించారని అభిమానులు సంబరపడినంతలోపే కథ మొదటికి వచ్చింది. భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో భారత్ 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (62) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ ధవన్‌తో ధవన్ (38)తో కలసి జట్టుకు శుభారంభం అందించాడు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో వోక్స్ బౌలింగ్‌లో ధవన్ అవుటవడంతో కష్టాలు మొదలయ్యాయి. కోహ్లీ (8), రైనా (1) వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. ఇంగ్లండ్ బౌలర్ అలీ వీరిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కోహ్లీ.. రూట్‌కు, రైనా.. వోక్స్‌కు క్యాచిచ్చారు. -
పెర్త్ వన్డే: రహానె హాఫ్ సెంచరీ
పెర్త్: ఇంగ్లండ్‌తో కీలక మ్యాచ్‌లో భారత్ ఓపెనర్ రహానె (50) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం రహానెకు తోడు విరాట్ క్రీజులో ఉన్నాడు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. రహానె మరో ఓపెనర్ ధవన్‌తో కలసి జట్టుకు శుభారంభం అందించాడు. వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా అదే స్కోరు వద్ద భారత ఓపెనర్ ధవన్ (38) అవుటయ్యాడు. వోక్స్ బౌలింగ్‌లో ధవన్ కీపర్ బట్లర్‌కు దొరికిపోయాడు. -
పెర్త్ వన్డే: ధవన్ అవుట్
పెర్త్: భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 83 పరుగుల వద్ద భారత ఓపెనర్ ధవన్ (38) అవుటయ్యాడు. వోక్స్ బౌలింగ్‌లో ధవన్ కీపర్ బట్లర్‌కు దొరికిపోయాడు. విరాట్ కోహ్లీ క్రీజులోకి వచ్చాడు. కీలక మ్యాచ్‌లో ఓపెనర్లు ధవన్, రహానె (43 నాటౌట్) రాణించి జట్టుకు శుభారంభం అందించారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 20.1 ఓవర్లలో వికెట్ నష్టానికి 83 పరుగులు చేసింది. ధవన్, రహానె 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. -
పెర్త్ వన్డే: రాణిస్తున్న భారత్ ఓపెనర్లు
పెర్త్: ఎట్టకేలకు భారత ఓపెనర్లు కీలక మ్యాచ్‌లో రాణిస్తున్నారు. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రహానె (43 నాటౌట్), ధవన్ (38 నాటౌట్) హాఫ్ సెంచరీల దిశగా దూసుకెళ్తున్నారు. ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 20 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 83 పరుగులు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్‌ను ఓపెనర్లు ఆదుకున్నారు. -
పెర్త్ వన్డే: ఆచితూచి ఆడుతున్న భారత్
పెర్త్: ముక్కోణపు సిరీస్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆచితూచి బ్యాటింగ్ చేస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన భారత్ 10 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 34 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె 20 , ధవన్ 13 పరుగులు చేశారు. -
పెర్త్ వన్డే: బ్యాటింగ్ కు దిగిన భారత్
పెర్త్: ముక్కోణపు సిరీస్‌లో కీలక చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్ బ్యాటింగ్ దిగింది. పెర్త్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. భారత ఓపెనర్లు రహానె, ధవన్ క్రీజులోకి వచ్చారు. రోహిత్ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఫైనల్ బెర్తు లభిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. జట్లు: భారత్: ధోని (కెప్టెన్/కీపర్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, మోహిత్, అక్షర్ ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్ (కీపర్), బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్. -
పెర్త్ వన్డే: ఫీల్డింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్
పెర్త్: ఫైనల్ బెర్తు ఎవరిదో తేల్చే మ్యాచ్ కాసేపట్లో ఆరంభంకానుంది. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్‌లో భారత్, ఇంగ్లండ్ తలపడుతున్నాయి. పెర్త్‌లో జరుగుతున్న ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టు ఫైనల్లో ప్రవేశిస్తుంది. ఆస్ట్రేలియా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. భారత్ ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా ఈ మ్యాచ్‌కు దూరమయ్యాడు. పేసర్ ఇషాంత్ శర్మ స్థానంలో మోహిత్ శర్మను తుది జట్టులోకి తీసుకున్నారు. జట్లు: భారత్: ధోని (కెప్టెన్/కీపర్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, మోహిత్, అక్షర్ ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్ (కీపర్), బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్. -
ఇక చావో రేవో!
భారత్, ఇంగ్లండ్ వన్డే నేడు గెలిచిన జట్టు ముక్కోణపు టోర్నీ ఫైనల్‌కు ప్రపంచకప్‌ను నిలబెట్టుకుంటామనే ధీమాతో ఆస్ట్రేలియా వెళ్లిన భారత జట్టు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉంది. ముక్కోణపు టోర్నీలో ఒక్క విజయం కూడా లేక... తుది జట్టు కూర్పు ఎలాగో అర్థం కాక తల్లడిల్లిపోతోంది. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారం కావాలంటే తక్షణమే ఓ విజయం కావాలి. ఇంగ్లండ్‌తో నేడు జరిగే మ్యాచ్‌లో గెలిస్తే ఫైనల్ ఆడే అవకాశం రావడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. లేదంటే ప్రపంచకప్‌నూ అయోమయ స్థితిలోనే ప్రారంభించాల్సి వస్తుంది. పెర్త్: ముక్కోణపు వన్డే టోర్నీలో సెమీఫైనల్‌లాంటి పోరుకు భారత్, ఇంగ్లండ్ జట్లు సిద్ధమయ్యాయి. శుక్రవారం ఇక్కడి ‘వాకా’ మైదానంలో జరిగే టోర్నీ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టు బోనస్ పాయింట్, రన్రేట్లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఆదివారం ఇదే మైదానంలో ఆస్ట్రేలియాతో ఢీకొంటుంది. మ్యాచ్ గెలిస్తే భారత్‌కు ప్రపంచ కప్‌కు ముందు మరో మ్యాచ్ ఆడే అవకాశం దక్కుతుంది. లేదంటే ఇక నేరుగా వరల్డ్ కప్ వార్మప్లకే. వర్షం లేదా మరే కారణంగా మ్యాచ్ రద్దయినా, ‘టై’ అయినా ఇంగ్లండ్ ఫైనల్‌కు చేరుకుంటుంది. కోహ్లి రాణిస్తాడా! రోహిత్ శర్మ ఈ మ్యాచ్‌కు కూడా దూరం కావడంతో ప్రధాన బ్యాట్స్‌మన్‌గా విరాట్ కోహ్లి బాధ్యత మరింత పెరిగింది. కెప్టెన్ చెబుతున్నదాని ప్రకారం అతను మరోసారి నాలుగో స్థానంలోనే బ్యాటింగ్‌కు రావడం ఖాయమైంది. గత రెండు మ్యాచ్‌లలో విఫలమైన కోహ్లి ఈ మ్యాచ్‌లో తన స్థాయికి తగ్గట్లుగా ఆడితే ప్రపంచ కప్‌కు ముందు భారత్ శిబిరంలో పెద్ద ఆందోళన తగ్గిపోతుంది. ధావన్ ఘోరంగా ఆడుతున్నా తప్పనిసరి పరిస్థితుల్లో జట్టు అతడిని కొనసాగిస్తోంది. అయితే మరో ఓపెనర్ రహానే కూడా అంతంత మాత్రంగానే ఆడుతున్నాడు. రహానేతో పాటు మూడో స్థానంలో రాయుడు, ఆ తర్వాత రైనా కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. రద్దయిన గత మ్యాచ్‌లో ప్రకటించిన జట్టునుంచి అక్షర్‌ను తప్పించి ఉమేశ్‌కు చోటు కల్పించే అవకాశం ఉంది. బౌలింగ్‌కు అనుకూలించే ఈ వికెట్‌పైనైనా మన పేసర్లు ఏ మాత్రం రాణించగలరో చూడాలి. ఆత్మవిశ్వాసంతో ఇంగ్లండ్ మరో వైపు ఇంగ్లండ్ జట్టు భారత్‌తో గత మ్యాచ్ ఫలితాన్ని పునరావృతం చేయాలని పట్టుదలగా ఉంది. తొలి లీగ్‌లో భారత్‌పై ఘన విజయం సాధించిన ఆ జట్టు ఆ తర్వాత ఆసీస్ చేతిలో ఓడినా 300కు పైగా స్కోరు చేసి చివరి వరకు పోరాడింది. జట్టులో ప్రధాన ఆటగాళ్లంతా ఫామ్‌లోకి వచ్చారు. ఇయాన్ బెల్ టోర్నీలో టాప్ స్కోరర్‌గా కొనసాగుతుండగా, యువ ఆటగాడు టేలర్ నిలకడగా ఆడుతున్నాడు. అలీ, బొపారా, వోక్స్వంటి ఆల్‌రౌండర్లతో ఆ జట్టు కూడా పటిష్టంగా కనిపిస్తోంది. పెర్త్ వికెట్ పేసర్లు ఫిన్, అండర్సన్లకు పండగలాంటిది. భారత్‌లాంటి జట్టును మరో సారి ఓడిస్తే ఇంగ్లండ్‌ను కూడా ప్రపంచ కప్ ఫేవరేట్లలో ఒకటిగా భావించాల్సి రావచ్చు. జట్ల వివరాలు (అంచనా): భారత్: ధోని (కెప్టెన్), ధావన్, రహానే, రాయుడు, కోహ్లి, రైనా, జడేజా, బిన్నీ, షమీ, ఇషాంత్, అక్షర్/ఉమేశ్. ఇంగ్లండ్: మోర్గాన్ (కెప్టెన్), బెల్, టేలర్, అలీ, రూట్, బట్లర్, బొపారా, వోక్స్, బ్రాడ్, అండర్సన్, ఫిన్. ‘ప్రస్తుతం మా అత్యుత్తమ 11 మంది ఎవరో గుర్తించాలి. అలా జరగాలంటే మొత్తం 15 మందీ పూర్తి ఫిట్నెస్తో ఉండాలి. లేకపోతే ప్రపంచకప్‌కు ముందు ఇబ్బందిపడతాం. టాపార్డర్‌పై మాకు ఆందోళన లేదు. మిడిలార్డర్లో మంచి భాగస్వామ్యాలు, చివరి 10-12 ఓవర్లు బాగా ఆడటం ముఖ్యం. కొన్నిసార్లు ఆటగాళ్లు తమకు నచ్చిన బ్యాటింగ్ స్థానాలను త్యాగం చేయాల్సి ఉంటుంది. కోహ్లి నాలుగో స్థానంలో ఆడితే జట్టు సమతుల్యంగా ఉంటుంది. రెండు మంచి షాట్లు ఆడితే ధావన్ ఫామ్‌లోకి వచ్చేస్తాడు. ఇంగ్లండ్‌తో గత మ్యాచ్ ఫలితం ప్రభావం మాపై ఉండదు’. - ధోని పిచ్, వాతావరణం ‘వాకా’పై సహజంగానే ఎక్కువ బౌన్స్ ఉంటుంది. ఈ పర్యటనలో భారత్ ఇక్కడ ఆడలేదు. మ్యాచ్ రోజు చిరుజల్లులు పడే అవకాశం ఉన్నా...ఉష్ణోగ్రత కూడా చాలా ఎక్కువగా (37 డిగ్రీలు) ఉండవచ్చు. ఉ.గం. 8.50 నుంచి స్టార్ స్పోర్ట్స్ 1, డీడీలో ప్రత్యక్ష ప్రసారం