ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో భారత్ 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది.
పెర్త్: ఎట్టకేలకు టీమిండియా ఓపెనర్లు రాణించారని అభిమానులు సంబరపడినంతలోపే కథ మొదటికి వచ్చింది. భారత్ వెంటవెంటనే మూడు వికెట్లు కోల్పోయింది.
ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో భారత్ 30 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 111 పరుగులు చేసింది. ఓపెనర్లు రహానె (62) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. మరో ఓపెనర్ ధవన్తో ధవన్ (38)తో కలసి జట్టుకు శుభారంభం అందించాడు. 20 ఓవర్లలో వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. భారత్ ఇన్నింగ్స్ సాఫీగా సాగుతున్న దశలో వోక్స్ బౌలింగ్లో ధవన్ అవుటవడంతో కష్టాలు మొదలయ్యాయి. కోహ్లీ (8), రైనా (1) వెంటవెంటనే పెవిలియన్ బాటపట్టారు. ఇంగ్లండ్ బౌలర్ అలీ వీరిద్దరినీ వరుస ఓవర్లలో అవుట్ చేశాడు. కోహ్లీ.. రూట్కు, రైనా.. వోక్స్కు క్యాచిచ్చారు.