భారత్ ‘ఎ’పై 3 వికెట్ల విజయం
అగర్‌కు 5 వికెట్లు
చెన్నై: ముక్కోణపు వన్డే టోర్నీలో ఆస్ట్రేలియా ‘ఎ’ జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ టోర్నీలో ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఆ జట్టు విజయం సాధిం చింది. సోమవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఆసీస్ ‘ఎ’ 3 వికెట్లతో భారత్ ‘ఎ’ను ఓడించింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.
అనంతరం ఆస్ట్రేలియా 48.3 ఓవర్లలో 7 వికెట్లకు 262 పరుగులు చేసి విజయాన్నందుకుంది. భారత్ ఇన్నింగ్స్‌లో మయాంక్ అగర్వాల్ (61 బంతుల్లో 61; 7 ఫోర్లు, 1 సిక్స్), మనీశ్ పాండే (38 బంతుల్లో 50; 3 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. ఆసీస్ లెఫ్టార్మ్ స్పిన్నర్ అస్టిన్ అగర్ (5/39) చక్కటి బౌలింగ్‌తో భారత్‌ను కట్టి పడేశాడు. క్రిస్ లిన్ (61 బంతుల్లో 63; 5 ఫోర్లు, 3 సిక్సర్లు), ఆడమ్ జంపా (49 బంతుల్లో 54; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీలు చేయగా... ఫెర్గూసన్ (45 నాటౌట్), హెడ్ (45) రాణించాడు. లెగ్‌స్పిన్నర్ కరణ్ శర్మ (3/45) ధాటికి ఒక దశలో ఆసీస్ మిడిలార్డర్ 25 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి తడబడింది. అయితే జంపా, ఫెర్గూసన్ ఏడో వికెట్‌కు 80 పరుగులు జోడించి జట్టును గెలిపించారు.
ఫైనల్లో ఆస్ట్రేలియా ‘ఎ’
Published Tue, Aug 11 2015 12:44 AM | Last Updated on Sun, Sep 3 2017 7:10 AM
Advertisement
Advertisement