ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో భారత్ ఓపెనర్ రహానె (50) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు.
పెర్త్: ఇంగ్లండ్తో కీలక మ్యాచ్లో భారత్ ఓపెనర్ రహానె (50) అజేయ హాఫ్ సెంచరీతో రాణించి జట్టును ఆదుకున్నాడు. ప్రస్తుతం రహానెకు తోడు విరాట్ క్రీజులో ఉన్నాడు.
ముక్కోణపు సిరీస్లో భాగంగా చివరి లీగ్ మ్యాచ్లో టీమిండియా 25 ఓవర్లలో వికెట్ నష్టానికి 95 పరుగులు చేసింది. రహానె మరో ఓపెనర్ ధవన్తో కలసి జట్టుకు శుభారంభం అందించాడు. వీరిద్దరూ 83 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. కాగా అదే స్కోరు వద్ద భారత ఓపెనర్ ధవన్ (38) అవుటయ్యాడు. వోక్స్ బౌలింగ్లో ధవన్ కీపర్ బట్లర్కు దొరికిపోయాడు.