
మరో ముగ్గురు క్రికెటర్లు వచ్చారు..
టీమిండియా తరపున మరో ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు.
హరారే: టీమిండియా తరపున మరో ముగ్గురు ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశారు. జింబాబ్వేతో తొలి వన్డేకు భారత్ తుది జట్టులో కేఎల్ రాహుల్, కరుణ్ నాయర్, యజువేంద్ర చహల్కు చోటు దక్కింది. జింబాబ్వే, భారత్ వన్డే సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ శనివారం హరారే స్పోర్ట్స్ క్లబ్లో మొదలైంది. టీమిండియా కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
తుది జట్లు:
భారత్: ధోని (కెప్టెన్), కేఎల్ రాహుల్, మనీష్ పాండే, కరుణ్ నాయర్, అంబటి రాయుడు, కేదార్ జాదవ్, చహల్, ధావల్ కులకర్ణి, అక్షర్ పటేల్, బుమ్రా, బరీందర్.
జింబాబ్వే: క్రీమర్ (కెప్టెన్), చిబాబా, హామిల్టన్ మసకద్జా, ముటుంబమి, సిబాందా, ఇర్విన్, సికందర్ రజా, పీటర్ మూర్, చిగుంబురా, ముజరబని, చటారా.