సాక్షి, హైదరాబాద్: టీఐఈ (ది ఇండస్ ఎంటర్‌ప్రెన్యూర్స్) సీఈఓ గోల్ఫ్ టోర్నమెంట్‌లో వాసు మెరుగు గ్రాస్ విజేతగా నిలిచాడు. గచ్చిబౌలిలోని బౌల్డర్ హిల్స్ గోల్ఫ్ కోర్స్‌లో శనివారం ఈ టోర్నీ ముగిసింది. వివిధ కార్పొరేట్ సంస్థలకు చెందిన దాదాపు 100 మంది ప్రతినిధులు ఈ 18 హోల్ గోల్ఫ్ టోర్నీలో పాల్గొన్నారు. మహిళల విభాగంలో షెర్రీ రెడ్డి టైటిల్ నెగ్గగా... శ్రీదేవి చల్లా రన్నరప్‌గా నిలిచింది.
ఇతర విభాగాల ఫలితాలు: 0-12 కేటగిరీ: విజేత అశోక్ రెడ్డి, రన్నరప్ అనిల్; 13-24 కేటగిరీ: విజేత సురేందర్ కుమార్, రన్నరప్ వెంకట్ రావిళ్ల ; స్ట్రెయిటెస్ట్ డ్రైవ్ విజేత: ఎ.బాపన్న; లాంగెస్ట్ డ్రైవ్ విజేత: మాధవ్ కోట; క్లోజెస్ట్ టు పిన్ విజేత: కె.భాస్కర్ వర్మ.
టీఐఈ గోల్ఫ్ విజేతలు వాసు, షెర్రీ
Published Sun, Dec 22 2013 12:06 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement