ఉప్పల్‌కు మెట్రో దన్ను! | a premium apartment | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌కు మెట్రో దన్ను!

Oct 18 2014 12:45 AM | Updated on Oct 16 2018 5:14 PM

ఉప్పల్‌కు మెట్రో దన్ను! - Sakshi

ఉప్పల్‌కు మెట్రో దన్ను!

ప్రతికూల సమయాల్లోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి జీవం పోసే ప్రాంతాలేవైనా ఉన్నాయంటే అవి గచ్చిబౌలి, ఉప్పల్ ప్రాంతాలే అని చెప్పాలి.

ఫిర్జాదిగూడలో ప్రగతి అవెన్యూ ప్రాజెక్ట్

సాక్షి, హైదరాబాద్: ప్రతికూల సమయాల్లోనూ హైదరాబాద్ స్థిరాస్తి రంగానికి జీవం పోసే ప్రాంతాలేవైనా ఉన్నాయంటే అవి గచ్చిబౌలి, ఉప్పల్ ప్రాంతాలే అని చెప్పాలి. ఒకటి ఐటీ రంగానికి, మరోటి మెట్రో పరుగులకు వేదిక కావడమే అంటున్నారు ట్రాన్స్‌కాన్ లైఫ్‌స్పేసెస్ ప్రై.లి. ఎండీ శ్రీధర్‌రెడ్డి. ప్రత్యేకించి మెట్రో ట్రయల్ రన్ సక్సెస్‌తో ఉప్పల్ స్థిరాస్తి మార్కెట్‌లో ఆరు నెలలుగా జోరుగా సాగుతోందన్నారు.
 
ఫిర్జాదిగూడలో ఎకరం విస్తీర్ణంలో ‘ట్రాన్స్‌కాన్స్ ప్రగతి అవెన్యూ’ పేరుతో ప్రీమియం అపార్ట్‌మెంట్‌ను నిర్మిస్తున్నాం. మొత్తం ఫ్లాట్ల సంఖ్య 70. అన్నీ 3 బీహెచ్‌కే ఫ్లాట్లే. ఎందుకంటే కొనుగోలుదారులందరి జీవన శైలి ఒకేలా ఉండాలి. నిర్వహణ వ్యవహారంలో ఎలాంటి ఇబ్బందులుండొద్దంటే అందరికీ సమానమైన విస్తీర్ణంలో ఫ్లాట్లుండాలి.

రూ. 15 కోట్ల పెట్టుబడితో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో ఏసీ జిమ్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాకింగ్ ట్రాక్, 270 గజాల్లో ల్యాండ్ స్కేపింగ్, అంపి థియేటర్, 8 వేల చ.అ. విస్తీర ్ణంలో క్లబ్ హౌస్, విశాలమైన పార్కింగ్, కార్ డ్రైవర్లకు ప్రత్యేకమైన రెస్ట్ రూములు వంటి ఆధునిక సౌకర్యాలెన్నో కల్పిస్తున్నాం. చ.అ. ధర రూ. 2,650గా చెబుతున్నాం. త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ఆనుకొనే కమర్షియల్ ప్రాజెక్ట్‌నూ ప్రారంభిస్తాం.

భువనగిరిలో ఏరియా ఆసుపత్రి పక్కనే ‘ట్రాన్స్‌కాన్ లక్ష్మి నరసింహా రెసిడెన్సీ’ పేరుతో మరో ప్రాజెక్ట్‌ను కూడా నిర్మిస్తున్నాం. 2 వేల గజాల్లో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌లో మొత్తం 35 ప్రీమియం ఫ్లాట్లుంటాయి. చ.అ. ధర రూ. 2,250.
 
చిల్డ్రన్స్ ప్లే ఏరియా, ల్యాండ్ స్కేపింగ్‌లతో నివాసితులకు గాలి, వెలుతురు విశాలంగా వచ్చేందుకు వీలుగా ఫ్లాట్ల గోడకు గోడకు మధ్య ఆరున్నర ఫీట్ల స్థలాన్ని వదులుతున్నాం. టైల్స్, రంగులు, లిఫ్ట్, సిమెంట్, బాత్ రూమ్ ఫిట్టింగ్స్.. ఇలా నిర్మాణ సామగ్రి అంతా నాణ్యమైనవే వినియోగిస్తున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement