నేటి నుంచి హాకీ ఇండియా లీగ్‌ | Today onwords Hockey India League | Sakshi
Sakshi News home page

నేటి నుంచి హాకీ ఇండియా లీగ్‌

Published Sat, Jan 21 2017 1:56 AM | Last Updated on Tue, Sep 5 2017 1:42 AM

Today onwords Hockey India League

► ప్రారంభ మ్యాచ్‌లో ముంబై, రాంచీ పోరు
► స్టార్‌ స్పోర్ట్స్‌–2లో ప్రత్యక్ష ప్రసారం

ముంబై: హాకీ ఇండియా లీగ్‌ (హెచ్‌ఐఎల్‌) ఐదో సీజన్ కు నేడు (శనివారం) తెర లేవనుంది. నాలుగు సీజన్లపాటు అభిమానులను ఆకట్టుకున్న ఈ లీగ్‌ తాజా సీజన్  ప్రారంభ మ్యాచ్‌లో దబాంగ్‌ ముంబై, రాంచీ రేస్‌ జట్లు తలపడతాయి. పంజాబ్‌ వారియర్స్‌ డిఫెండింగ్‌ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. వచ్చే నెల 26 వరకు జరిగే హెచ్‌ఐఎల్‌లో మ్యాచ్‌లన్నీ రాత్రి 7 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి.

ఇక ఇప్పటిదాకా కనీసం సెమీఫైనల్స్‌కు కూడా చేరుకోలేకపోయిన ముంబై ఈనెల చివరి వరకు ఐదు మ్యాచ్‌లను సొంత వేదికపైనే ఆడనుంది. దీంతో ఈసారి టైటిల్‌ సాధించాలనే కసితో ఉంది. అష్లే జాక్సన్ , బారీ మిడిల్‌టన్ , ఫెర్గుస్, గుర్బజ్‌ సింగ్, కొతజిత్‌ సింగ్‌ మన్ ప్రీత్‌ సింగ్, బీరేంద్ర లక్రాలతో ఈ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. ఢిల్లీ వేవ్‌రైడర్స్, పంజాబ్‌ వారియర్స్, కళింగ లాన్సర్స్, ఉత్తరప్రదేశ్‌ విజార్డ్స్‌ ఇతర జట్లు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement