
ఢాకా: కొరకరాని కొరియాతో భారత హాకీ జట్టు ‘సూపర్ ఫోర్’ సమరానికి సిద్ధమైంది. ఆసియా కప్ హాకీలో కొత్తగా సెమీఫైనల్‌కు బదులుగా ఈ రౌండ్ రాబిన్ స్టేజ్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం ప్రపంచ ఆరో ర్యాంకర్ భారత్ తమ తొలి మ్యాచ్‌లో 13వ ర్యాంకులో ఉన్న దక్షిణ కొరియాను ఎదుర్కోనుంది. ఈ టోర్నమెంట్‌లో పూల్ ‘ఎ’లో భారత్ అజేయంగా లీగ్ దశను ముగించింది. వరుస విజయాలు సాధించడమే కాకుండా టీమిండియా ఆటగాళ్లు ప్రతీ మ్యాచ్‌లోనూ అసాధారణ ప్రదర్శన కనబరిచారు. కొత్త కోచ్ జోయెర్డ్ మరిన్ మార్గదర్శకంలో కుర్రాళ్లు రాణిస్తున్నారు. స్ట్రయికర్లు రమణ్‌దీప్ సింగ్, ఆకాశ్‌దీప్ సింగ్, లలిత్ ఉపాధ్యాయ్, చింగ్లేన్‌సన సింగ్ దూకుడు కనబరుస్తున్నారు.
వీళ్లతో పాటు మిడ్‌ఫీల్డర్లు సర్దార్ సింగ్, కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్‌లతో భారత్ ఇప్పుడు అత్యంత పటిష్టంగా ఉంది. అయితే అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌లను గోల్‌గా మలచలేకపోవడంపై కోచ్ మరిన్ దృష్టిపెట్టారు. మరోవైపు కొరియా పూల్ ‘బి’లో రెండో స్థానంలో నిలువడం ద్వారా సూపర్ ఫోర్‌కు చేరింది. గతంలో భారత్‌కు చేడు ఫలితాలిచ్చిన అనుభవం కొరియాది. అటాకింగ్ గేమ్‌లో, మ్యాచ్ ముగిసే దశలో కొరియన్ల ఆటతీరు ప్రమాదకరంగా ఉంటుంది. భారత్ ఫామ్ దృష్ట్యా దక్షిణ కొరియాను ఓడించే సత్తా ఉన్నప్పటికీ అదేమంత సులభం మాత్రం కాదు. మరో సూపర్ ఫోర్ మ్యాచ్‌లో పూల్ ‘బి’ టాపర్ మలేసియాతో పాకిస్తాన్ తలపడనుంది.
►సాయంత్రం 5 గం. నుంచి స్టార్ స్పోర్ట్స్–2లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment