ఆ 88 మంది... | unchanged from the first season of the IPL players | Sakshi
Sakshi News home page

ఆ 88 మంది...

Published Wed, Apr 5 2017 12:00 AM | Last Updated on Tue, Sep 5 2017 7:56 AM

ఆ 88 మంది...

ఆ 88 మంది...

పదేళ్ల ఐపీఎల్‌ ప్రస్థానంలో తొలి అడుగు ఆసక్తికరం. ఆటగాళ్లకు సంబంధించి అదో అద్భుతం. క్రికెటర్ల వేలం, భారీ మొత్తాలు దక్కించుకోవడం, ఆటలో నిబంధనలు, మైదానంలో వినోదం... ఇలా ప్రతీది విశేషమే. ఐపీఎల్‌ మ్యాచ్‌ ఆడటం వారికి కొత్త తరహా అనుభవం. ఇప్పుడు పదో సీజన్‌ ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. 2008 సీజన్‌లోని ఎనిమిది జట్ల తొలి మ్యాచ్‌ల బరిలోకి దిగిన ఆటగాళ్లందరికీ అదే మొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌. నాడు ఆయా టీమ్‌ల తుది జట్టులో ఆడిన 88 మందిలో ఇప్పుడు ఎంత మంది చురుగ్గా ఉన్నారు...ఆటకు దూరమైనవారిలో మీకు ఎంత మంది గుర్తున్నారో మీరే చూసుకోండి.

తొలి మ్యాచ్‌ ఆడిన 8 జట్ల ఆటగాళ్లు వీరే...
కోల్‌కతా: గంగూలీ, బ్రెండన్‌ మెకల్లమ్, పాంటింగ్, డేవిడ్‌ హస్సీ, మొహమ్మద్‌ హఫీజ్, లక్ష్మీరతన్‌ శుక్లా, సాహా, అగార్కర్, దిండా, మురళీ కార్తీక్, ఇషాంత్‌.

బెంగళూరు: ద్రవిడ్, వసీం జాఫర్, కోహ్లి, కలిస్, వైట్, బౌచర్, బాలచంద్ర అఖిల్, ఆష్లే నోఫ్‌కీ, ప్రవీణ్‌ కుమార్, జహీర్, సునీల్‌ జోషి (కుంబ్లే తొలి మ్యాచ్‌ ఆడలేదు).

చెన్నై: ధోని, రైనా, పార్థివ్, హేడెన్, మైక్‌ హస్సీ, ఓరమ్, బద్రీనాథ్, జోగీందర్, పళని అమర్‌నాథ్, గోనీ, మురళీధరన్‌.

పంజాబ్‌: యువరాజ్, కరణ్‌ గోయల్, హోప్స్, సంగక్కర,  కటిచ్, ఇర్ఫాన్‌ పఠాన్, పంకజ్‌ ధర్మాణి, బ్రెట్‌లీ, పీయూష్‌ చావ్లా, విల్కిన్‌ మోటా, శ్రీశాంత్‌.

ఢిల్లీ: సెహ్వాగ్, గంభీర్, శిఖర్‌ ధావన్,  మనోజ్‌ తివారి, దినేశ్‌ కార్తీక్, రజత్‌ భాటియా, మన్హాస్, వెటోరి, మహరూఫ్, బ్రెట్‌ గీవ్స్, మెక్‌గ్రాత్‌.
రాజస్థాన్‌: వాట్సన్, కైఫ్, లీమన్, రవీంద్ర జడేజా, తరువర్‌ కోహ్లి, యూసుఫ్, మహేశ్‌ రావత్, దినేశ్‌ సాలుంకే, వార్న్, సిద్ధార్థ్‌ త్రివేది, మునాఫ్‌.

హైదరాబాద్‌ దక్కన్‌ చార్జర్స్‌: గిల్‌క్రిస్ట్, లక్ష్మణ్, సైమండ్స్, రోహిత్, స్టయిరిస్, వేణుగోపాలరావు, అర్జున్‌ యాదవ్, బంగర్, వాస్, ఆర్పీ సింగ్, ప్రజ్ఞాన్‌ ఓజా.

ముంబై: ల్యూక్‌ రోంచి, జయసూర్య, డొమినిక్‌ థోర్నిలి, ఉతప్ప, పినాల్‌ షా, అభిషేక్‌ నాయర్, పొలాక్, హర్భజన్, ముసవిర్‌ ఖోటే, నెహ్రా, ధావల్‌ కులకర్ణి (సచిన్‌ తొలి మ్యాచ్‌ ఆడలేదు)

ఐపీఎల్‌ తొలి సీజన్‌ నుంచి పదో సీజన్‌ వరకు కూడా జట్టు మారకుండా ఉన్న ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, హర్భజన్‌ సింగ్‌ మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement