అండర్-14 విజేత శివాని | under -14 winner shivani | Sakshi
Sakshi News home page

అండర్-14 విజేత శివాని

Published Sat, Apr 26 2014 12:15 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

under -14 winner shivani

ఏఐటీఏ సూపర్ సిరీస్ టోర్నీ
 సాక్షి, హైదరాబాద్: అఖిల భారత టెన్నిస్ సంఘం (ఏఐటీఏ) టాలెంట్ సూపర్ సిరీస్ టోర్నమెంట్ అండర్-14 విభాగంలో అమినేని శివాని విజేతగా నిలిచింది. మొయినాబాద్‌లోని సానియామీర్జా టెన్నిస్ అకాడమీలో శుక్రవారం ముగిసిన ఈ టోర్నీ బాలికల ఫైనల్లో శివాని 6-2, 6-1 స్కోరుతో ధారణ ముదలియార్‌పై విజయం సాధించింది.
 

బాలుర విభాగంలో టాప్ సీడ్ శ్రీవత్స రాతకొండ టైటిల్ నెగ్గాడు. ఫైనల్లో అతను 7-5, 7-6 తేడాతో మూడో సీడ్ యెడ్ల కుశాల్‌పై నెగ్గాడు. అండర్-12 విభాగంలో రిచా చౌగ్లే, మహేశ్ మహాపాత్ర విజేతలుగా నిలిచారు. ఫైనల్లో రిచా 6-4, 6-0తో రేష్మ మరూరిపై, మహేశ్ 7-5, 2-6, 6-2తో వి. దేవ్‌పై గెలుపొందారు. డబుల్స్ ఫైనల్లో శివాని-సాయిదేదీప్య జోడి 6-2, 4-6, 10-8తో శ్రీవల్లి రష్మిక-ఈశ్వరి మాత్రేపై గెలిచి టైటిల్‌ను చేజిక్కించుకున్నారు. బాలుర డబుల్స్ ఫైనల్లో రిత్విక్ చౌదరి-ప్రలోక్ ఈకూర్తి ద్వయం 6-1, 7-6(3)తో యెడ్ల కుశాల్-నేమ హేమంత్ జంటపై నెగ్గింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement