హో చి మిన్ సిటీ (వియత్నాం): తన అద్వితీయ ప్రదర్శన కొనసాగిస్తూ హైదరాబాద్ టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేని వియత్నాం ఓపెన్ ఏటీపీ చాలెంజర్ టోర్నమెంట్‌లో సింగిల్స్ చాంపియన్‌గా అవతరించాడు. ఆదివారం జరిగిన ఫైనల్లో నాలుగో సీడ్ సాకేత్ 7-5, 6-3తో ఎనిమిదో సీడ్ జోర్డాన్ థాంప్సన్ (ఆస్ట్రేలియా)పై విజయం సాధించాడు. సాకేత్ కెరీర్‌లో ఇది రెండో ఏటీపీ చాలెంజర్ టైటిల్. గతేడాది ఇండోర్ ఓపెన్‌లో అతను తొలి ఏటీపీ చాలెంజర్ టైటిల్‌ను నెగ్గాడు. డబుల్స్‌లో మాత్రం సాకేత్-సనమ్ సింగ్ (భారత్) జంట రన్నరప్ ట్రోఫీతో సరిపెట్టుకుంది. ఫైనల్లో సాకేత్-సనమ్ ద్వయం 6-1, 3-6, 8-10తో లామసినె (ఫ్రాన్స్) -లాంగర్ (జర్మనీ) జంట చేతిలో ఓడింది.
వియత్నాం ఓపెన్ విజేత సాకేత్
Published Mon, Oct 19 2015 2:26 AM | Last Updated on Wed, Sep 19 2018 6:31 PM
Advertisement
Advertisement