విహారి సెంచరీ | vihari Century | Sakshi
Sakshi News home page

విహారి సెంచరీ

Published Fri, Oct 17 2014 4:04 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 PM

విహారి సెంచరీ

విహారి సెంచరీ

* ఆంధ్రా బ్యాంక్ విజయం
* వన్డే నాకౌట్ టోర్నీ

సాక్షి, హైదరాబాద్: హనుమ విహారి (115) సెంచరీ సాధించడంతో ఆంధ్రా బ్యాంక్ 40 పరుగుల తేడాతో డెక్కన్ క్రానికల్ (డీసీ)పై విజయం సాధించింది. ఎ-డివిజన్ మూడు రోజుల లీగ్ జట్లు పోటీపడుతున్న ఈ వన్డే నాకౌట్ టోర్నీలో గురువారం జరిగిన మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్రా బ్యాంక్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 316 పరుగులు చేసింది. రవితేజ (56), అభినవ్ కుమార్ (53) రాణించారు. డీసీ బౌలర్ షాదాబ్ తుంబి 3 వికెట్లు తీశాడు. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన డెక్కన్ క్రానికల్ జట్టు 8 వికెట్ల నష్టానికి 276 పరుగులు చేసింది.

ప్రణీత్ కుమార్ (96), షాదాబ్ తుంబి (72) జట్టు విజయం కోసం శ్రమించినా ఫలితం లేకపోయింది. ఆంధ్రా బ్యాంక్ బౌలర్ కనిష్క్ నాయుడు 3 వికెట్లు పడగొట్టాడు. మరో మ్యాచ్‌లో బీడీఎల్ జట్టు 7 వికెట్ల తేడాతో ఎన్స్‌కాన్స్‌పై గెలిచింది. తొలుత ఎన్స్‌కాన్స్ 8 వికెట్లకు 250 పరుగులు చేసింది. అరుణ్ దేవా (95), హుస్సేన్ (56) అర్ధసెంచరీలు చేశారు. బీడీఎల్ బౌలర్లు శ్రవణ్ 4, శివశంకర్ 3 వికెట్లు తీశారు. తర్వాత బీడీఎల్ మూడే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సమర్థ్ (80), కె. సుమంత్ (57 నాటౌట్), రాహుల్ సింగ్ (53), యతిన్ రెడ్డి (46) సమష్టిగా రాణించి జట్టును గెలిపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement