చెన్నై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ప్రారంభించింది. బెంగాల్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. రవితేజ (43; 2 ఫోర్లు), శివ కుమార్ (40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 226 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ 48.5 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి అధిగమించింది.
ధోని జట్టుకు షాక్: భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని సారథ్యంలో ఈ టోర్నీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. కర్ణాటకతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో జార్ఖండ్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులవద్ద ఆలౌటైంది. సౌరభ్ తివారి (68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జార్ఖండ్‌కు పరాజయం తప్పలేదు. అంతకుముందు కర్ణాటక 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది.
బెంగాల్ చేతిలో ఆంధ్ర పరాజయం
Published Sun, Feb 26 2017 2:56 AM | Last Updated on Tue, Sep 5 2017 4:35 AM
Advertisement
Advertisement