One-day cricket
-
వన్డేల్లో మరో డబుల్ సెంచరీ
సిడ్నీ : డొమెస్టిక్ క్రికెట్లో ఆస్ట్రేలియా క్రికెటర్ డీఆర్సీ షార్ట్ విధ్వంసం సృష్టించాడు. 148 బంతుల్లో 23 సిక్సర్లతో 257 పరుగులు చేశాడు. దీంతో ఆస్ట్రేలియా తరపున వన్డేల్లో వ్యక్తిగత అత్యధిక స్కోర్ నమోదు చేసిన క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా, క్విన్స్‌లాండ్ మధ్య జరిగిన దేశవాళి వన్డే మ్యాచ్‌లో డీఆర్సీ ఈ ఘనతను అందుకున్నాడు. వెస్టర్న్ ఆస్ట్రేలియా తరపున బరిలోకి దిగిన డీఆర్సీ.. 83 బంతుల్లో సెంచరీ సాధించగా.. మరో 100 పరుగులను 45 బంతుల్లోనే పూర్తి చేయడం విశేషం. ఇన్నింగ్స్ 46 ఓవర్లో డీఆర్సీ ఔటయ్యాడు.. కానీ లేకపోతే ట్రిపుల్ సెంచరీ సాధించేవాడన్నట్లు సాగింది అతని బ్యాటింగ్. ఇక ఈ మ్యాచ్‌లో వెస్టర్న్ ఆస్ట్రేలియా 106 పరుగుల తేడాతో క్విన్స్లాండ్పై విజయం సాధించింది. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ నమోదు చేసిన మూడో క్రికెటర్‌గా డీఆర్సీ నిలిచాడు. డీఆర్సీ కన్నా ముందు అలిస్టైర్ బ్రౌన్, రోహిత్ శర్మలున్నారు. 2002లో జరిగిన లిస్ట్-ఏ మ్యాచ్‌లో సర్రే తరుపున అలిస్టర్ బ్రౌన్ 268 పరుగులు చేయగా.. 2014లో శ్రీలంకతో జరిగిన అంతర్జాతీయ వన్డేలో భారత క్రికెటర్ రోహిత్ శర్మ 264 పరుగులు చేశాడు. 23 సిక్స్‌లతో డబుల్ సెంచరీ సాధించిన డీఆర్సీ.. వన్డే క్రికెట్లో అత్యధిక సిక్స్‌లు బాదిన బ్యాట్స్‌మన్‌గా కూడా గుర్తింపు పొందాడు. న్యూజిలాండ్ క్రికెటర్ కొలిన్ మున్రో ఒక్కడే డొమెస్టిక్ క్రికెట్లో 23 సిక్స్‌లు బాదాడు. అంతేకాకుండా ఆస్ట్రేలియా లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 23 సిక్స్‌లు బాదిన తొలి క్రికెటర్‌గా కూడా గుర్తింపు పొందాడు. ఈ ఏడాదే ఇంగ్లండ్‌పై అంతర్జాతీయ వన్డే క్రికెట్లోకి అరంగ్రేటం చేసిన డీఆర్సీ.. 10 టీ20 మ్యాచ్‌లు కూడా ఆడాడు. This man has just shattered the record books! 💥@ShortDarcy smacked 257 off 148 balls against QLD -- the highest score EVER in Australian one-day cricket! His demolition included 15 fours and... 23 SIXES (no joke)!!! 😮#WestIsBest #JLTCup pic.twitter.com/UX2gPSA2FG — WACA (@WACA_Cricket) September 28, 2018 -
బెంగాల్ చేతిలో ఆంధ్ర పరాజయం
చెన్నై: విజయ్ హజారే ట్రోఫీ దేశవాళీ వన్డే క్రికెట్ టోర్నమెంట్‌ను ఆంధ్ర జట్టు ఓటమితో ప్రారంభించింది. బెంగాల్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘సి’ లీగ్ మ్యాచ్‌లో ఆంధ్ర నాలుగు వికెట్ల తేడాతో ఓడింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆంధ్ర 50 ఓవర్లలో 8 వికెట్లకు 225 పరుగులు చేసింది. రవితేజ (43; 2 ఫోర్లు), శివ కుమార్ (40; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించారు. 226 పరుగుల లక్ష్యాన్ని బెంగాల్ 48.5 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి అధిగమించింది. ధోని జట్టుకు షాక్: భారత మాజీ కెప్టెన్ ఎం.ఎస్.ధోని సారథ్యంలో ఈ టోర్నీలో పాల్గొంటున్న జార్ఖండ్ జట్టుకు తొలి మ్యాచ్‌లో ఓటమి ఎదురైంది. కర్ణాటకతో జరిగిన గ్రూప్ ‘డి’ మ్యాచ్‌లో జార్ఖండ్ ఐదు పరుగుల తేడాతో ఓడింది. 267 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జార్ఖండ్ 49.5 ఓవర్లలో 261 పరుగులవద్ద ఆలౌటైంది. సౌరభ్ తివారి (68; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), కెప్టెన్ ధోని (43; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించినా జార్ఖండ్‌కు పరాజయం తప్పలేదు. అంతకుముందు కర్ణాటక 49.4 ఓవర్లలో 266 పరుగులకు ఆలౌటైంది. -
సచిన్ రికార్డును బ్రేక్ చేసిన ధోనీ
మొహాలీ: న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ రికార్డుల మోత మోగించాడు. అంతర్జాతీయ వన్డేల్లో 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా అరుదైన రికార్డు నెలకొల్పిన ధోనీ.. సచిన్ పేరిట ఉన్న అత్యధిక సిక్సర్ల రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో టీమిండియా తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా ధోనీ (196) సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేగాక వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక సిక్సర్లు సంధించిన కెప్టెన్‌గా మరో ఘనత సాధించాడు. న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో 286 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన భారత్‌ను కోహ్లీ, ధోనీ ఆదుకున్నారు. ఓపెనర్లు రోహిత్ (13), రహానె (5) తక్కువ పరుగులకే అవుట్ కాగా.. ధోనీ, విరాట్ హాఫ్ సెంచరీలు చేశారు. ధోనీ మూడు సిక్సర్లు బాదడంతో సచిన్ (195) రికార్డు బ్రేక్ అయ్యింది. భారత్ 31 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన కివీస్ 49.4 ఓవర్లలో 285 పరుగులకు ఆలౌటైంది. -
ధోనీ అరుదైన రికార్డు
మొహాలీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ధోనీ 9 వేల పరుగులు పూర్తి చేశాడు. న్యూజిలాండ్‌తో మూడో వన్డేలో శాంట్నర్ బౌలింగ్‌లో ధోనీ సిక్సర్ బాదడంతో 9వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్‌గా, ప్రపంచంలో 17వ బ్యాట్స్‌మన్‌గా, మూడో వికెట్ కీపర్‌గా నిలిచాడు. ఇంతకుముందు టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్, అజరుద్దీన్ ఈ రికార్డు నమోదు చేశారు. 50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్‌గా ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధోనీ 281 వన్డేల్లో 51.15 సగటుతో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. -
వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్?
1. 2015, ఏప్రిల్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు? 1) వై.వేణుగోపాల్‌రెడ్డి 2) కౌశిక్ బసు 3) సి.రంగరాజన్ 4) దువ్వూరి సుబ్బారావు 2. 2015, ఏప్రిల్ 19న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు? 1) రామచంద్రన్ పిళ్లై 2) మాణిక్ సర్కార్ 3) వి.ఎస్.అచ్యుతానందన్ 4) సీతారం ఏచూరి 3. 2015-16 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? 1) సి.పి.గుర్నాని 2) ఎన్.చంద్రశేఖరన్ 3) బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి 4) ఎవరూ కాదు 4. 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఎక్కడ జరిగాయి? 1) బెంగళూరు 2) మైసూరు 3) చెన్నై 4) పనాజి 5. 2014 సంవత్సరానికి కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? 1) సునీల్ గవాస్కర్ 2) కపిల్‌దేవ్ 3) దిలీప్ వెంగ్‌సర్కార్ 4) కె.శ్రీకాంత్ 6. హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1) 1526 2) 1556 3) 1576 4) 1529 7. హర్ష చరిత్ర అనే గ్రంథ రచయిత? 1) శూద్రకుడు 2) బాణుడు 3) ఆర్యభట్ట 4) హాలుడు 8. 324వ అధికరణం దేనికి సంబంధించినది? 1) కేంద్ర ఆర్థిక సంఘం 2) రాష్ట్ర ఆర్థిక సంఘం 3) కేంద్ర ఎన్నికల సంఘం 4) ఏవీకావు 9. గిర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? 1) మహారాష్ట్ర 2) కర్ణాటక 3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్ 10. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి? 1) పెల్లాగ్రా 2) స్కర్వీ 3) రక్త హీనత 4) రికెట్స్ 11. వర్కర్స్ పార్టీ ఏ దేశంలో అధికారంలో ఉంది? 1) బ్రెజిల్ 2) చైనా 3) జపాన్ 4) రష్యా 12. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు? 1) అక్టోబర్ 2 2) నవంబర్ 19 3) ఆగస్టు 20 4) అక్టోబర్ 31 13. నల్లధనంపై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛైర్మన్ ఎవరు? 1) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు 2) జస్టిస్ ఎం.బి.షా 3) జస్టిస్ మదల్ లోకూర్ 4) జస్టిస్ రంజనా ప్రకాశ్ 14. {పపంచ లింగభేద సూచీని ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది? 1) ప్రపంచ బ్యాంక్ 2) అంతర్జాతీయ ద్రవ్యనిధి 3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం 4) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 15. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ దేశం నేతృత్వంలో ఏర్పాటు కానుంది? 1) జపాన్ 2) చైనా 3) భారత్ 4) సింగపూర్ 16. సీఎంసీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ఐటీ కంపెనీ? 1) విప్రో 2) కాగ్నిజెంట్ 3) ఇన్ఫోసిస్ 4) టీసీఎస్ 17. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? 1) అరవింద్ సుబ్రమణియన్ 2) కౌశిక్ బసు 3) ఆర్.ఎస్.గుజ్రాల్ 4) జి.ఎస్.సంధు 18. లిబర్టీ మెడల్‌ను మలాలా యూసఫ్జాయ్కు ఏ దేశం ప్రదానం చేసింది? 1) కెనడా 2) అమెరికా 3) స్వీడన్ 4) నార్వే 19. ఏ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి 150 ఏళ్లు పూర్తయ్యాయి? 1) వాంఖడే స్టేడియం 2) చిన్నస్వామి స్టేడియం 3) ఈడెన్ గార్డెన్స్ 4) గ్రీన్ పార్క్ స్టేడియం 20. {పస్తుత ఆర్థిక కార్యదర్శి ఎవరు? 1) అరవింద్ మాయారం 2) అనితా కపూర్ 3) హర్‌ప్రీత్‌సింగ్ 4) రాజీవ్ మెహరిషి 21. స్నేహితురాలి హత్య కేసులో ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ఏ దేశానికి చెందిన అథ్లెట్. 1) బ్రిటన్ 2) అమెరికా 3) దక్షిణాఫ్రికా 4) మెక్సికో 22. యునిసెఫ్ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) జెనీవా 2) న్యూయార్క్ 3) పారిస్ 4) వాషింగ్టన్ 23. ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ సంస్థలో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది? 1) 10 2) 14 3) 21 4) 19 24. ఇథియోపియా దేశ రాజధాని? 1) కంపాలా 2) లుసాకా 3) ఆక్రా 4)అడిస్ అబాబా 25. థీన్‌సేన్ ఏ దేశానికి అధ్యక్షుడు? 1) వియత్నాం 2) ఉత్తర కొరియా 3) మయన్మార్ 4) సింగపూర్ 26. 2014 నవంబర్‌లో తొమ్మిదవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు జరిగింది? 1) సియోల్ 2) టోక్యో 3) న్యూఢిల్లీ 4) నేపిత 27. ఇటీవల భారత్‌లో పర్యటించిన దిమిత్రీ రోగోజన్ ఏ దేశ ఉపప్రధాని? 1) ఉక్రెయిన్ 2) కజకిస్థాన్ 3) రష్యా 4) మంగోలియా 28. ఇవో మొరేల్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా వరుసగా 3వసారి ఎన్నికయ్యారు? 1) ఉరుగ్వే 2) బొలీవియా 3) అర్జెంటీనా 4) ఈక్వెడార్ 29. కేంద్ర మంత్రి జేపీ నద్దా ఏ శాఖను నిర్వహిస్తున్నారు? 1) గిరిజన వ్యవహారాలు 2) వ్యవసాయం 3) గ్రామీణాభివృద్ధి 4) ఆరోగ్యం 30. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ పార్లమెంటరీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు? 1) విదిష 2) దక్షిణ ఢిల్లీ 3) లక్నో 4) రాయ్‌బరేలీ 31. {పత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్? 1) అరుణా జయంతి 2) శోభనా భార్తియా 3) అనితా కపూర్ 4) నిషి వాసుదేవ 32. ‘2014-ద ఎలక్షన్ దట్ ఛేంజ్జ్ ఇండియా’ పుస్తక రచయిత? 1) ప్రణయ్ రాయ్ 2) మార్క్ టులీ 3) అర్నాబ్ గోస్వామి 4) రాజ్‌దీప్ సర్దేశాయ్ 33. యూరోమనీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? 1) జానెట్ ఎల్లెన్ 2) రఘురాం రాజన్ 3) మార్క్ కార్నీ 4) ఎవరూ కాదు 34. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఎవరికి ప్రదానం చేస్తారు? 1) రచయితలు 2) పాత్రికేయులు 3) శాస్త్రవేత్తలు 4) ఆర్థికవేత్తలు 35. 2014 సంవత్సరానికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? 1) మిచెల్ జాన్సన్ 2) మైకేల్ క్లార్క్ 3) స్టీవ్ స్మిత్ 4) కుమార్ సంగక్కర 36. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎంత? 1) 267 2) 264 3) 257 4) 254 37. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డెరైక్టర్ ఎవరు? 1) రతన్ కుమార్ సిన్హా 2) ఉపేంద్ర కుమార్ సిన్హా 3) అమర్ ప్రతాప్ సింగ్ 4) అనిల్ కుమార్ సిన్హా 38. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) జూలై 1 2) జూన్ 29 3) మే 26 4) జూలై 31 39. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది? 1) నాగ్‌పూర్ 2) పుణె 3) గాంధీనగర్ 4) భోపాల్ 40. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో జాతీయీకరణం చేశారు? 1) 1969 2) 1980 3) 1955 4) 1949 సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 4; 5) 3; 6) 3; 7) 2; 8) 3; 9) 4; 10) 2; 11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2; 16) 4; 17) 1; 18) 2; 19) 3; 20) 4; 21) 3; 22) 2; 23) 3; 24) 4; 25) 3; 26) 4; 27) 3; 28) 2; 29) 4; 30) 3; 31) 3; 32) 4; 33) 2; 34) 3; 35) 1; 36) 2; 37) 4; 38) 2; 39) 1; 40) 3. -
వన్డేలో ఒక్కడే 350 పరుగులు
ఇంగ్లండ్ క్లబ్ క్రికెట్లో రికార్డు లండన్: వన్డే క్రికెట్లో డబుల్ సెంచరీలు సాధారణమై పోయిన రోజుల్లో ఇక ట్రిపుల్ సెంచరీలు కూడా అసాధ్యం కాదని నిరూపించాడు ఇంగ్లండ్‌లోని యువ క్రికెటర్. 138 బంతుల్లో 34 ఫోర్లు, 27 సిక్సర్లతో 350 పరుగులు... ఇంగ్లండ్ బోర్డు నిర్వహించే జాతీయ క్లబ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో లాంకషైర్‌కు చెందిన 20 ఏళ్ల క్రికెటర్ లియామ్ లివింగ్‌స్టోన్ ఈ ఘనత సాధించాడు. క్లాడీ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో నాన్‌ట్‌విచ్ జట్టు తరఫున ఆడుతూ లివింగ్‌స్టోన్ పరుగుల వరద పారించాడు. ‘గతంలో భారత్‌లోని హైదరాబాద్‌లో జరిగిన క్లబ్ మ్యాచ్‌లో నిఖిలేశ్ అనే కుర్రాడు 334 పరుగులు చేశాడు. ఇన్నాళ్లూ వన్డేల్లో ఇదే రికార్డు. దీనిని లివింగ్‌స్టోన్ అధిగమించాడు’ అని ఇంగ్లండ్ బోర్డు తెలిపింది. అయితే సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం కెనడాలోని ఒటాగోలో 2014లో ఈగెన్ అనే క్రికెటర్ 358 పరుగులు సాధించాడట. అత్యధిక పరుగుల రికార్డు సంగతి ఎలా ఉన్నా లివింగ్‌స్టోన్ 350 పరుగుల సాయంతో నాన్‌ట్‌విచ్ జట్టు 45 ఓవర్లలో 7 వికెట్లకు 579 పరుగులు చేసింది. ప్రత్యర్థి క్లాడీ జట్టు 79 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఏకంగా 500 పరుగుల విజయం సాధించి నాన్‌ట్‌విచ్ క్లబ్ కొత్త రికార్డు సృష్టించింది. -
వన్డే క్రికెట్ కష్టాల్లో ఉంది: ద్రవిడ్
ముంబై: పరిమిత ఓవర్ల ఫార్మాట్ ఉనికిపై భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వన్డే క్రికెట్ కష్టాల్లో ఉందన్నాడు. ఆరవ దిలీప్ సర్దేశాయ్ స్మారక లెక్చర్‌లో ప్రసంగించిన ద్రవిడ్ ఈ ఫార్మాట్ మరింత ఆకర్షణీయంగా ఉండాలంటే ఏం చేయాలో సూచనలిచ్చాడు. ‘నా ఉద్దేశం ప్రకారం వన్డే క్రికెట్ అనేది తీవ్ర కష్టాల్లో ఉంది. చాంపియన్స్ ట్రోఫీ లేదా ప్రపంచకప్‌ల దృష్టి కోణం నుంచి చూస్తే ఇది అర్థమవుతుంది. అందుకే ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడడం తగ్గించి వన్డే టోర్నమెంట్స్‌ను ఎక్కువగా ఆడించాలి. ఇక చకింగ్ అనేది నా దృష్టిలో నేరం కాదు. అది ఓ సాంకేతిక తప్పిదం మాత్రమే. అలాంటప్పుడు ఆ లోపాన్ని సరిచేసుకుని తిరిగి ఆడాలి. జట్టు విదేశీ పర్యటనల్లో భార్యలు, ప్రియురాళ్లను అనుమతించడంలో తప్పు లేదు’ అని ద్రవిడ్ స్పష్టం చేశాడు. వైకల్య విజేతలపై పుస్తకాన్ని ఆవిష్కరించిన ద్రవిడ్ శారీరక, మానసిక వైకల్యాన్ని జయించి క్రీడల్లో విజేతలుగా నిలిచిన వారి గురించి రాసిన పుస్తకాన్ని రాహుల్ ద్రవిడ్ ఆవిష్కరించాడు. అంతర్జాతీయ మాజీ షట్లర్ సంజయ్ శర్మ, తన కూతురు మేదిని ఈ పుస్తకాన్ని రచించారు. -
బంగ్లాపై విండీస్ విజయం
- పొలార్డ్, రామ్‌దిన్ అర్ధ సెంచరీలు - తొలి వన్డే సెయింట్ జార్జి (గ్రెనడా): బంగ్లాదేశ్‌తో వన్డేలో 34 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన దశలో... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (70 బంతుల్లో 89; 5 ఫోర్లు; 6 సిక్సర్లు), దినేశ్ రామ్‌దిన్ (76 బంతుల్లో 74; 6 ఫోర్లు; 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. ఫలితంగా గ్రెనడాలోని జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు సాధించింది. పేసర్ డ్వేన్ బ్రేవో (4/32) ధాటికి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ చేతులెత్తేసినా... ఓపెనర్ అనముల్ హక్ (138 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) వీరోచిత సెంచరీ చేశాడు. తమీమ్ ఇక్బాల్ (47 బంతుల్లో 26; 3 ఫోర్లు), నాసిర్ హుస్సేన్ (38 బంతుల్లో 26; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు. ఆ తర్వాత 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 39.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 219 పరుగులు చేసి నెగ్గింది. పొలార్డ్, బ్రేవో కలిసి ఆరో వికెట్‌కు 145 పరుగులు జోడించారు. జేసన్ హోల్డర్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) చివర్లో వేగంగా ఆడాడు. మిగిలిన వారంతా నిరాశపరిచారు. అల్ అమిన్ హుస్సేన్‌కు నాలుగు వికెట్లు పడ్డాయి. పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.