బంగ్లాపై విండీస్ విజయం | Pollard, Ramdin rescue West Indies | Sakshi
Sakshi News home page

బంగ్లాపై విండీస్ విజయం

Published Fri, Aug 22 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:14 PM

బంగ్లాపై విండీస్ విజయం

బంగ్లాపై విండీస్ విజయం

- పొలార్డ్, రామ్‌దిన్ అర్ధ సెంచరీలు
- తొలి వన్డే

సెయింట్ జార్జి (గ్రెనడా): బంగ్లాదేశ్‌తో వన్డేలో 34 పరుగులకే  ఐదు వికెట్లు కోల్పోయిన దశలో... వెస్టిండీస్ బ్యాట్స్‌మెన్ కీరన్ పొలార్డ్ (70 బంతుల్లో 89; 5 ఫోర్లు; 6 సిక్సర్లు), దినేశ్ రామ్‌దిన్ (76 బంతుల్లో 74; 6 ఫోర్లు; 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్‌తో అదరగొట్టారు. ఫలితంగా గ్రెనడాలోని జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన తొలి వన్డేలో విండీస్ మూడు వికెట్ల తేడాతో నెగ్గింది. దీంతో మూడు వన్డేల ఈ సిరీస్‌లో విండీస్ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ జట్టు 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 217 పరుగులు సాధించింది.

పేసర్ డ్వేన్ బ్రేవో (4/32) ధాటికి బంగ్లా బ్యాటింగ్ ఆర్డర్ చేతులెత్తేసినా... ఓపెనర్ అనముల్ హక్ (138 బంతుల్లో 109; 11 ఫోర్లు; 1 సిక్స్) వీరోచిత సెంచరీ చేశాడు. తమీమ్ ఇక్బాల్ (47 బంతుల్లో 26; 3 ఫోర్లు), నాసిర్ హుస్సేన్ (38 బంతుల్లో 26; 2 ఫోర్లు) ఓ మాదిరిగా ఆడారు. ఆ తర్వాత 218 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 39.4 ఓవర్లలో ఏడు వికెట్లకు 219 పరుగులు చేసి నెగ్గింది. పొలార్డ్, బ్రేవో కలిసి ఆరో వికెట్‌కు 145 పరుగులు జోడించారు. జేసన్ హోల్డర్ (15 బంతుల్లో 22 నాటౌట్; 3 ఫోర్లు) చివర్లో వేగంగా ఆడాడు. మిగిలిన వారంతా నిరాశపరిచారు. అల్ అమిన్ హుస్సేన్‌కు నాలుగు వికెట్లు పడ్డాయి. పొలార్డ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement