ధోనీ అరుదైన రికార్డు | MS Dhoni completes 9000 runs in one-day cricket | Sakshi
Sakshi News home page

ధోనీ అరుదైన రికార్డు

Published Sun, Oct 23 2016 7:20 PM | Last Updated on Mon, Sep 4 2017 6:06 PM

ధోనీ అరుదైన రికార్డు

ధోనీ అరుదైన రికార్డు

మొహాలీ: టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్‌ ధోనీ అరుదైన రికార్డు సాధించాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్లో ధోనీ 9 వేల పరుగులు పూర్తి చేశాడు. న్యూజిలాండ్తో మూడో వన్డేలో శాంట్నర్ బౌలింగ్లో ధోనీ సిక్సర్ బాదడంతో 9వేల పరుగుల మైలురాయిని దాటాడు. ఈ ఘనత సాధించిన ఐదో భారత క్రికెటర్గా, ప్రపంచంలో 17వ బ్యాట్స్మన్గా, మూడో వికెట్ కీపర్గా నిలిచాడు. ఇంతకుముందు టీమిండియా తరఫున సచిన్ టెండూల్కర్, గంగూలీ, ద్రావిడ్, అజరుద్దీన్ ఈ రికార్డు నమోదు చేశారు.

50కి పైగా సగటుతో 9 వేల పరుగులు పూర్తి చేసిన ఏకైక క్రికెటర్గా ధోనీ అరుదైన రికార్డు నెలకొల్పాడు. ధోనీ 281 వన్డేల్లో 51.15 సగటుతో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇందులో 9 సెంచరీలు, 60 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement