1. 2015, ఏప్రిల్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు?
1) వై.వేణుగోపాల్‌రెడ్డి 2) కౌశిక్ బసు
3) సి.రంగరాజన్ 4) దువ్వూరి సుబ్బారావు
2. 2015, ఏప్రిల్ 19న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు?
1) రామచంద్రన్ పిళ్లై 2) మాణిక్ సర్కార్
3) వి.ఎస్.అచ్యుతానందన్ 4) సీతారం ఏచూరి
3. 2015-16 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు?
1) సి.పి.గుర్నాని 2) ఎన్.చంద్రశేఖరన్
3) బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి 4) ఎవరూ కాదు
4. 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఎక్కడ జరిగాయి?
1) బెంగళూరు 2) మైసూరు 3) చెన్నై 4) పనాజి
5. 2014 సంవత్సరానికి కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు?
1) సునీల్ గవాస్కర్ 2) కపిల్‌దేవ్
3) దిలీప్ వెంగ్‌సర్కార్ 4) కె.శ్రీకాంత్
6. హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది?
1) 1526 2) 1556 3) 1576 4) 1529
7. హర్ష చరిత్ర అనే గ్రంథ రచయిత?
1) శూద్రకుడు 2) బాణుడు
3) ఆర్యభట్ట 4) హాలుడు
8. 324వ అధికరణం దేనికి సంబంధించినది?
1) కేంద్ర ఆర్థిక సంఘం 2) రాష్ట్ర ఆర్థిక సంఘం
3) కేంద్ర ఎన్నికల సంఘం 4) ఏవీకావు
9. గిర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది?
1) మహారాష్ట్ర 2) కర్ణాటక
3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్
10. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి?
1) పెల్లాగ్రా 2) స్కర్వీ 3) రక్త హీనత 4) రికెట్స్
11. వర్కర్స్ పార్టీ ఏ దేశంలో అధికారంలో ఉంది?
1) బ్రెజిల్ 2) చైనా 3) జపాన్ 4) రష్యా
12. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు?
1) అక్టోబర్ 2 2) నవంబర్ 19
3) ఆగస్టు 20 4) అక్టోబర్ 31
13. నల్లధనంపై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛైర్మన్ ఎవరు?
1) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు 2) జస్టిస్ ఎం.బి.షా
3) జస్టిస్ మదల్ లోకూర్ 4) జస్టిస్ రంజనా ప్రకాశ్
14. {పపంచ లింగభేద సూచీని ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది?
1) ప్రపంచ బ్యాంక్ 2) అంతర్జాతీయ ద్రవ్యనిధి
3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం
4) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్
15. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ ఏ దేశం నేతృత్వంలో ఏర్పాటు కానుంది?
1) జపాన్ 2) చైనా
3) భారత్ 4) సింగపూర్
16. సీఎంసీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ఐటీ కంపెనీ?
1) విప్రో 2) కాగ్నిజెంట్
3) ఇన్ఫోసిస్ 4) టీసీఎస్
17. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు?
1) అరవింద్ సుబ్రమణియన్ 2) కౌశిక్ బసు
3) ఆర్.ఎస్.గుజ్రాల్ 4) జి.ఎస్.సంధు
18. లిబర్టీ మెడల్‌ను మలాలా యూసఫ్‌జాయ్‌కు ఏ దేశం ప్రదానం చేసింది?
1) కెనడా 2) అమెరికా 3) స్వీడన్ 4) నార్వే
19. ఏ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి 150 ఏళ్లు పూర్తయ్యాయి?
1) వాంఖడే స్టేడియం 2) చిన్నస్వామి స్టేడియం
3) ఈడెన్ గార్డెన్స్ 4) గ్రీన్ పార్క్ స్టేడియం
20. {పస్తుత ఆర్థిక కార్యదర్శి ఎవరు?
1) అరవింద్ మాయారం 2) అనితా కపూర్
3) హర్‌ప్రీత్‌సింగ్ 4) రాజీవ్ మెహరిషి
21. స్నేహితురాలి హత్య కేసులో ఆస్కార్ పిస్టోరియస్‌కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ఏ దేశానికి చెందిన అథ్లెట్.
1) బ్రిటన్ 2) అమెరికా 3) దక్షిణాఫ్రికా 4) మెక్సికో
22. యునిసెఫ్ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది?
1) జెనీవా 2) న్యూయార్క్ 3) పారిస్ 4) వాషింగ్టన్
23. ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ సంస్థలో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది?
1) 10 2) 14 3) 21 4) 19
24. ఇథియోపియా దేశ రాజధాని?
1) కంపాలా 2) లుసాకా 3) ఆక్రా 4)అడిస్ అబాబా
25. థీన్‌సేన్ ఏ దేశానికి అధ్యక్షుడు?
1) వియత్నాం 2) ఉత్తర కొరియా
3) మయన్మార్ 4) సింగపూర్
26. 2014 నవంబర్‌లో తొమ్మిదవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు జరిగింది?
1) సియోల్ 2) టోక్యో
3) న్యూఢిల్లీ 4) నేపిత
27. ఇటీవల భారత్‌లో పర్యటించిన దిమిత్రీ రోగోజన్ ఏ దేశ ఉపప్రధాని?
1) ఉక్రెయిన్ 2) కజకిస్థాన్
3) రష్యా 4) మంగోలియా
28. ఇవో మొరేల్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా వరుసగా 3వసారి ఎన్నికయ్యారు?
1) ఉరుగ్వే 2) బొలీవియా
3) అర్జెంటీనా 4) ఈక్వెడార్
29. కేంద్ర మంత్రి జేపీ నద్దా ఏ శాఖను నిర్వహిస్తున్నారు?
1) గిరిజన వ్యవహారాలు 2) వ్యవసాయం
3) గ్రామీణాభివృద్ధి 4) ఆరోగ్యం
30. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ పార్లమెంటరీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు?
1) విదిష 2) దక్షిణ ఢిల్లీ
3) లక్నో 4) రాయ్‌బరేలీ
31. {పత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సీబీడీటీ) చైర్‌పర్సన్?
1) అరుణా జయంతి 2) శోభనా భార్తియా
3) అనితా కపూర్ 4) నిషి వాసుదేవ
32. ‘2014-ద ఎలక్షన్ దట్ ఛేంజ్జ్ ఇండియా’ పుస్తక రచయిత?
1) ప్రణయ్ రాయ్ 2) మార్క్ టులీ
3) అర్నాబ్ గోస్వామి 4) రాజ్‌దీప్ సర్దేశాయ్
33. యూరోమనీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది?
1) జానెట్ ఎల్లెన్ 2) రఘురాం రాజన్
3) మార్క్ కార్నీ 4) ఎవరూ కాదు
34. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఎవరికి ప్రదానం చేస్తారు?
1) రచయితలు 2) పాత్రికేయులు
3) శాస్త్రవేత్తలు 4) ఆర్థికవేత్తలు
35. 2014 సంవత్సరానికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు?
1) మిచెల్ జాన్సన్ 2) మైకేల్ క్లార్క్
3) స్టీవ్ స్మిత్ 4) కుమార్ సంగక్కర
36. వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎంత?
1) 267 2) 264 3) 257 4) 254
37. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డెరైక్టర్ ఎవరు?
1) రతన్ కుమార్ సిన్హా 2) ఉపేంద్ర కుమార్ సిన్హా
3) అమర్ ప్రతాప్ సింగ్ 4) అనిల్ కుమార్ సిన్హా
38. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు?
1) జూలై 1 2) జూన్ 29
3) మే 26 4) జూలై 31
39. సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది?
1) నాగ్‌పూర్ 2) పుణె
3) గాంధీనగర్ 4) భోపాల్
40. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో జాతీయీకరణం చేశారు?
1) 1969 2) 1980 3) 1955 4) 1949
సమాధానాలు
1) 3; 2) 4; 3) 3; 4) 4; 5) 3;
6) 3; 7) 2; 8) 3; 9) 4; 10) 2;
11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2;
16) 4; 17) 1; 18) 2; 19) 3; 20) 4;
21) 3; 22) 2; 23) 3; 24) 4; 25) 3;
26) 4; 27) 3; 28) 2; 29) 4; 30) 3;
31) 3; 32) 4; 33) 2; 34) 3; 35) 1;
36) 2; 37) 4; 38) 2; 39) 1; 40) 3.
వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోర్?
Published Thu, Apr 23 2015 3:19 AM | Last Updated on Sun, Sep 3 2017 12:41 AM
Advertisement