Highest individual score
-
లంకతో మూడో వన్డే.. వన్డేల్లో అత్యధిక స్కోర్ బాదిన ఆఫ్ఘన్ బ్యాటర్
AFG VS SL 3rd ODI: 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం శ్రీలంకలో పర్యటించిన ఆఫ్ఘనస్తాన్ జట్టు 1-1తో సిరీస్‌ను సమం చేసుకుంది. సిరీస్‌లోని తొలి మ్యాచ్‌లో పర్యాటక జట్టు 60 పరుగుల తేడాతో గెలుపొందగా.. వర్షం కారణంగా రెండో మ్యాచ్ ఫలితం తేలకుండా రద్దైంది. నిన్న (నవంబర్ 30) జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆతిధ్య జట్టు 4 వికెట్ల తేడాతో ఆఫ్ఘన్ ఓడించడంతో సిరీస్ సమంగా ముగిసింది. మూడో వన్డేలో టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 313 పరుగుల భారీ స్కోర్ చేయగా.. శ్రీలంక జట్టు అద్భుతమైన పోరాటపటిమ కనబర్చి 49.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. సిరీస్ తొలి మ్యాచ్‌లో సెంచరీ బాది సూపర్ ఫామ్‌లో ఉన్న ఇబ్రహీమ్ జద్రాన్ ఈ మ్యాచ్‌లోనూ భారీ శతకం (138 బంతుల్లో 162; 15 ఫోర్లు, 4 సిక్సర్లు) బాది ఆఫ్ఘనిస్తాన్ భారీ స్కోర్ చేయడంలో కీలకపాత్ర పోషించాడు. ఈ సెంచరీ సాధించడం ద్వారా జద్రాన్ మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకన్నాడు. కేవలం 8 వన్డేల్లోనే 3 శతకాలు బాది జోరుమీదున్న 20 ఏళ్ల జద్రాన్.. ఆఫ్ఘన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోరర్‌గా రికార్డుల్లోకెక్కాడు. గతంలో వన్డేల్లో ఆఫ్ఘన్ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డు మహ్మద్ షెహజాద్ (131) పేరిట ఉండేది. కాగా, ఈ మ్యాచ్‌లో జద్రాన్‌కు జతగా నజీబుల్లా (77) రాణించినప్పటికీ.. ఆఫ్ఘన్ బౌలర్లు భారీ టార్గెట్‌ను డిఫెండ్ చేసుకోవడంలో విఫలమ్యారు. కుశాల్ మెండిస్ (67), చరిత్ అసలంక (83 నాటౌట్), చండీమాల్ (33), దసున్ షనక (43), దునిత్ వెల్లలగే (31 నాటౌట్) సంయుక్తంగా రాణించి మ్యాచ్‌ను గెలిపించడంతో పాటు శ్రీలంక సిరీస్ కోల్పోకుండా కాపాడుకోగలిగారు. సిరీస్‌లో రెండు శతకాలతో చెలరేగిన ఇబ్రహీమ్ జద్రాన్‌కు ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డు దక్కగా.. చరిత్ అసలంకకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. -
ఆ విధ్వంసానికి ఎనిమిదేళ్లు.. నేడు మళ్లీ రిపీటయ్యేనా
చెన్నై: సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇదే రోజు(2013 ఏప్రిల్ 23) విండీస్ యోధుడు క్రిస్ గేల్ ఐపీఎల్లో పెను విధ్వంసాన్ని సృష్టించాడు. 2013 ఐపీఎల్ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిధ్యం వహించిన అతను.. పూణే వారియర్స్ ఇండియాపై 66 బంతుల్లో ఏకంగా 175 పరుగులు సాధించి క్రికెట్ ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేశాడు. ఈ మ్యాచ్‌కు ముందు చిరుజల్లులతో తడిసి ముద్దైన బెంగళూరు వేదిక, గేల్ సిక్సర్ల సునామీలో కొట్టుకుపోయింది. అప్పటివరకు నాటి కేకేఆర్ ఆటగాడు బ్రెండన్ మెక్కల్లమ్(158) పేరిట ఉన్న ఐపీఎల్ అత్యధిక వ్యక్తిగత స్కోర్ రికార్డును గేల్, ఈ ఇన్నింగ్స్ ద్వారా తుడిచిపెట్టాడు. క్రికెట్ ప్రపంచంలో గేల్ సృష్టించిన ఈ మహా ప్రళయం ధాటికి పలు రికార్డులు కాలగర్భంలో కలిసిపోయాయి. Highest-ever T20 score (175)💥 Fastest T20 century 🔥 Most sixes in an innings 💪#OnThisDay, we all witnessed a #GayleStorm 🤩#SaddaPunjab #PunjabKings #IPL pic.twitter.com/hvUlqvZAOT — Punjab Kings (@PunjabKingsIPL) April 23, 2021 ఈ భాయనక ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీని 17 బంతుల్లో, సెంచరీని 30 బంతుల్లో పూర్తి చేసిన యూనివర్సల్ బాస్.. క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన టీ20 శతకాన్ని తన పేరిట నమోదు చేసుకున్నాడు. సెంచరీ తర్వాత కూడా శాంతించని ఈ భారీకాయుడు.. మరో 36 బంతులను ఎదుర్కొని మొత్తంగా 175 పరుగులు సాధించాడు. 102 నిమిషాల పాటు క్రీజ్‌లో ఉన్న అతను.. 13 బౌండరీలు, 17 భారీ సిక్సర్లు బాది క్రికెట్ అభిమానులకు చిరకాలం గుర్తండిపోయే కనువిందును అందించాడు. ఈ క్రమంలో అతను టీ20ల్లో వేగవంతమైన శతకం(30 బంతుల్లో), అత్యధిక వ్యక్తిగత స్కోర్(175 నాటౌట్), ఒక ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్ల(17 సిక్సర్లు) రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ రికార్డులు నేటికీ చెక్కుచెదరకుండా పదిలంగా ఉన్నాయి. గేల్ నాటి విధ్వంసం ధాటికి తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 5 వికెట్ల నష్టానికి 263 పరుగుల భారీ స్కోర్ చేయగా, ప్రత్యర్ధి జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి కేవలం 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో బెంగళూరు130 పరుగుల భారీ తేడాతో పూణేపై ఘనవిజయం సాధించింది. కాగా, నాటి ఆ జి'గేల్' ఇన్నింగ్స్‌ను గర్తుచేసుకుంటూ, ప్రస్తుతం అతను ప్రాతినిధ్యం వహిస్తున్న పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజ్ ట్వీట్ చేసింది. ఎనిమిదేళ్ల క్రితం గేల్ విధ్వంసాన్ని మేమంతా సాక్షులమంటూ క్యాప్షన్‌ను జోడించింది. నేడు చెన్నై వేదికగా పంజాబ్, ముంబై జట్లు తలపడనున్న నేపథ్యంలో గేల్ విధ్వంసం మరోసారి రిపీట్ కావాలని పంజాబ్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. చదవండి: మలాన్ నం.1 టీ20 బ్యాట్స్‌మెన్ అయ్యుండొచ్చు.. కానీ గేల్‌తో పోలికా -
విలియమ్సన్ డబుల్ సెంచరీ
హామిల్టన్ (న్యూజిలాండ్): కెప్టెన్ కేన్ విలియమ్సన్ (412 బంతుల్లో 251; 34 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లో మూడో డబుల్ సెంచరీ సాధించడంతోపాటు అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేయడంతో... వెస్టిండీస్‌తో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్ భారీ స్కోరు చేసింది. ఓవర్‌నైట్ స్కోరు 243/2తో రెండో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన న్యూజిలాండ్ 145 ఓవర్లలో ఏడు వికెట్లకు 519 పరుగులవద్ద డిక్లేర్ చేసింది. 97 పరుగుల వ్యక్తిగత స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన విలియమ్సన్ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. కీమర్ రోచ్ వేసిన ఇన్నింగ్స్ 81వ ఓవర్లో మూడో బంతిని బౌండరీ దాటించిన విలియమ్సన్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత ఇతర బ్యాట్స్‌మెన్ వెనుదిరుగుతున్నా... మరోవైపు విలియమ్సన్ దూకుడు కొనసాగించాడు. ఈసారీ రోచ్ బౌలింగ్‌లోనే బౌండరీ బాది విలియమ్సన్ డబుల్ సెంచరీ సాధించాడు. జేమీసన్ (51 నాటౌట్; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు)తో కలిసి ఏడో వికెట్‌కు 94 పరుగులు జోడించాక విలియమ్సన్ అవుటయ్యాడు. జేమీసన్ అర్ధ సెంచరీ పూర్తి కాగానే విలియమ్సన్ కివీస్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన వెస్టిండీస్ వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. -
వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్?
1. 2015, ఏప్రిల్‌లో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఛాన్సలర్‌గా ఎవరు నియమితులయ్యారు? 1) వై.వేణుగోపాల్‌రెడ్డి 2) కౌశిక్ బసు 3) సి.రంగరాజన్ 4) దువ్వూరి సుబ్బారావు 2. 2015, ఏప్రిల్ 19న సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎవరు ఎన్నికయ్యారు? 1) రామచంద్రన్ పిళ్లై 2) మాణిక్ సర్కార్ 3) వి.ఎస్.అచ్యుతానందన్ 4) సీతారం ఏచూరి 3. 2015-16 సంవత్సరానికి నాస్కామ్ చైర్మన్‌గా ఎవరు ఎన్నికయ్యారు? 1) సి.పి.గుర్నాని 2) ఎన్.చంద్రశేఖరన్ 3) బి.వి.ఆర్.మోహన్‌రెడ్డి 4) ఎవరూ కాదు 4. 45వ భారత అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలు ఎక్కడ జరిగాయి? 1) బెంగళూరు 2) మైసూరు 3) చెన్నై 4) పనాజి 5. 2014 సంవత్సరానికి కల్నల్ సీకే నాయుడు జీవిత సాఫల్య పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేశారు? 1) సునీల్ గవాస్కర్ 2) కపిల్‌దేవ్ 3) దిలీప్ వెంగ్‌సర్కార్ 4) కె.శ్రీకాంత్ 6. హల్దీఘాట్ యుద్ధం ఏ సంవత్సరంలో జరిగింది? 1) 1526 2) 1556 3) 1576 4) 1529 7. హర్ష చరిత్ర అనే గ్రంథ రచయిత? 1) శూద్రకుడు 2) బాణుడు 3) ఆర్యభట్ట 4) హాలుడు 8. 324వ అధికరణం దేనికి సంబంధించినది? 1) కేంద్ర ఆర్థిక సంఘం 2) రాష్ట్ర ఆర్థిక సంఘం 3) కేంద్ర ఎన్నికల సంఘం 4) ఏవీకావు 9. గిర్ జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? 1) మహారాష్ట్ర 2) కర్ణాటక 3) మధ్యప్రదేశ్ 4) గుజరాత్ 10. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి? 1) పెల్లాగ్రా 2) స్కర్వీ 3) రక్త హీనత 4) రికెట్స్ 11. వర్కర్స్ పార్టీ ఏ దేశంలో అధికారంలో ఉంది? 1) బ్రెజిల్ 2) చైనా 3) జపాన్ 4) రష్యా 12. జాతీయ ఐక్యతా దినంగా ఏ రోజును పాటిస్తారు? 1) అక్టోబర్ 2 2) నవంబర్ 19 3) ఆగస్టు 20 4) అక్టోబర్ 31 13. నల్లధనంపై దర్యాప్తు కోసం ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఛైర్మన్ ఎవరు? 1) జస్టిస్ హెచ్.ఎల్.దత్తు 2) జస్టిస్ ఎం.బి.షా 3) జస్టిస్ మదల్ లోకూర్ 4) జస్టిస్ రంజనా ప్రకాశ్ 14. {పపంచ లింగభేద సూచీని ఏటా ఏ సంస్థ విడుదల చేస్తుంది? 1) ప్రపంచ బ్యాంక్ 2) అంతర్జాతీయ ద్రవ్యనిధి 3) వరల్డ్ ఎకనమిక్ ఫోరం 4) వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ 15. ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏ దేశం నేతృత్వంలో ఏర్పాటు కానుంది? 1) జపాన్ 2) చైనా 3) భారత్ 4) సింగపూర్ 16. సీఎంసీ లిమిటెడ్‌ను విలీనం చేసుకున్న ఐటీ కంపెనీ? 1) విప్రో 2) కాగ్నిజెంట్ 3) ఇన్ఫోసిస్ 4) టీసీఎస్ 17. 2014 అక్టోబర్‌లో ముఖ్య ఆర్థిక సలహాదారుగా ఎవరు నియమితులయ్యారు? 1) అరవింద్ సుబ్రమణియన్ 2) కౌశిక్ బసు 3) ఆర్.ఎస్.గుజ్రాల్ 4) జి.ఎస్.సంధు 18. లిబర్టీ మెడల్‌ను మలాలా యూసఫ్జాయ్కు ఏ దేశం ప్రదానం చేసింది? 1) కెనడా 2) అమెరికా 3) స్వీడన్ 4) నార్వే 19. ఏ క్రికెట్ స్టేడియాన్ని నిర్మించి 150 ఏళ్లు పూర్తయ్యాయి? 1) వాంఖడే స్టేడియం 2) చిన్నస్వామి స్టేడియం 3) ఈడెన్ గార్డెన్స్ 4) గ్రీన్ పార్క్ స్టేడియం 20. {పస్తుత ఆర్థిక కార్యదర్శి ఎవరు? 1) అరవింద్ మాయారం 2) అనితా కపూర్ 3) హర్‌ప్రీత్‌సింగ్ 4) రాజీవ్ మెహరిషి 21. స్నేహితురాలి హత్య కేసులో ఆస్కార్ పిస్టోరియస్కు ఐదేళ్ల జైలుశిక్ష పడింది. ఆయన ఏ దేశానికి చెందిన అథ్లెట్. 1) బ్రిటన్ 2) అమెరికా 3) దక్షిణాఫ్రికా 4) మెక్సికో 22. యునిసెఫ్ సంస్థ ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? 1) జెనీవా 2) న్యూయార్క్ 3) పారిస్ 4) వాషింగ్టన్ 23. ఆసియా-పసిఫిక్ ఎకనమిక్ కో ఆపరేషన్ సంస్థలో ఎన్ని దేశాలకు సభ్యత్వం ఉంది? 1) 10 2) 14 3) 21 4) 19 24. ఇథియోపియా దేశ రాజధాని? 1) కంపాలా 2) లుసాకా 3) ఆక్రా 4)అడిస్ అబాబా 25. థీన్‌సేన్ ఏ దేశానికి అధ్యక్షుడు? 1) వియత్నాం 2) ఉత్తర కొరియా 3) మయన్మార్ 4) సింగపూర్ 26. 2014 నవంబర్‌లో తొమ్మిదవ తూర్పు ఆసియా శిఖరాగ్ర సదస్సు జరిగింది? 1) సియోల్ 2) టోక్యో 3) న్యూఢిల్లీ 4) నేపిత 27. ఇటీవల భారత్‌లో పర్యటించిన దిమిత్రీ రోగోజన్ ఏ దేశ ఉపప్రధాని? 1) ఉక్రెయిన్ 2) కజకిస్థాన్ 3) రష్యా 4) మంగోలియా 28. ఇవో మొరేల్స్ ఏ దేశానికి అధ్యక్షుడిగా వరుసగా 3వసారి ఎన్నికయ్యారు? 1) ఉరుగ్వే 2) బొలీవియా 3) అర్జెంటీనా 4) ఈక్వెడార్ 29. కేంద్ర మంత్రి జేపీ నద్దా ఏ శాఖను నిర్వహిస్తున్నారు? 1) గిరిజన వ్యవహారాలు 2) వ్యవసాయం 3) గ్రామీణాభివృద్ధి 4) ఆరోగ్యం 30. కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఏ పార్లమెంటరీ నియోజక వర్గానికి ప్రాతినిథ్యం వహిస్తున్నారు? 1) విదిష 2) దక్షిణ ఢిల్లీ 3) లక్నో 4) రాయ్‌బరేలీ 31. {పత్యక్ష పన్నుల కేంద్రీయ బోర్డు (సీబీడీటీ) చైర్పర్సన్? 1) అరుణా జయంతి 2) శోభనా భార్తియా 3) అనితా కపూర్ 4) నిషి వాసుదేవ 32. ‘2014-ద ఎలక్షన్ దట్ ఛేంజ్జ్ ఇండియా’ పుస్తక రచయిత? 1) ప్రణయ్ రాయ్ 2) మార్క్ టులీ 3) అర్నాబ్ గోస్వామి 4) రాజ్‌దీప్ సర్దేశాయ్ 33. యూరోమనీ సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి లభించింది? 1) జానెట్ ఎల్లెన్ 2) రఘురాం రాజన్ 3) మార్క్ కార్నీ 4) ఎవరూ కాదు 34. శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డులు ఎవరికి ప్రదానం చేస్తారు? 1) రచయితలు 2) పాత్రికేయులు 3) శాస్త్రవేత్తలు 4) ఆర్థికవేత్తలు 35. 2014 సంవత్సరానికి ఐసీసీ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్‌గా ఎవరు ఎంపికయ్యారు? 1) మిచెల్ జాన్సన్ 2) మైకేల్ క్లార్క్ 3) స్టీవ్ స్మిత్ 4) కుమార్ సంగక్కర 36. వన్డే క్రికెట్లో అత్యధిక వ్యక్తిగత స్కోర్ ఎంత? 1) 267 2) 264 3) 257 4) 254 37. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నూతన డెరైక్టర్ ఎవరు? 1) రతన్ కుమార్ సిన్హా 2) ఉపేంద్ర కుమార్ సిన్హా 3) అమర్ ప్రతాప్ సింగ్ 4) అనిల్ కుమార్ సిన్హా 38. జాతీయ గణాంక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) జూలై 1 2) జూన్ 29 3) మే 26 4) జూలై 31 39. సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఫర్ కాటన్ రీసెర్చ్ ఏ నగరంలో ఉంది? 1) నాగ్‌పూర్ 2) పుణె 3) గాంధీనగర్ 4) భోపాల్ 40. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఏ సంవత్సరంలో జాతీయీకరణం చేశారు? 1) 1969 2) 1980 3) 1955 4) 1949 సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 4; 5) 3; 6) 3; 7) 2; 8) 3; 9) 4; 10) 2; 11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2; 16) 4; 17) 1; 18) 2; 19) 3; 20) 4; 21) 3; 22) 2; 23) 3; 24) 4; 25) 3; 26) 4; 27) 3; 28) 2; 29) 4; 30) 3; 31) 3; 32) 4; 33) 2; 34) 3; 35) 1; 36) 2; 37) 4; 38) 2; 39) 1; 40) 3.