ప్రొఫెషనల్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ నాలుగో బౌట్ ఫిబ్రవరి 13న జరగనుంది.
న్యూఢిల్లీ: ప్రొఫెషనల్‌గా మారిన భారత బాక్సర్ విజేందర్ సింగ్ నాలుగో బౌట్ ఫిబ్రవరి 13న జరగనుంది. అయితే ప్రత్యర్థి ఎవరనేది తేలాల్సి ఉంది. తొలి మూడు బౌట్లలో ప్రత్యర్థులను నాకౌట్ చేసిన విజేందర్ నాలుగో బౌట్‌లోనూ అదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తున్నాడు. స్వల్ప విరామం కోసం భారత్‌కు వచ్చిన బాక్సర్ ఇప్పుడు మంచి జిమ్ కోసం వెతుకుతున్నాడు. జనవరి 4న అతను యూకే తిరిగి వెళ్లనున్నాడు. ‘నా తదుపరి బౌట్ ఫిబ్రవరిలో ఉంది. ప్రత్యర్థి తేలకపోయినా... రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తున్నా. కొత్త సంవత్సర వేడుకల సందర్భంగా జిమ్‌లన్నీ మూసి ఉన్నాయి. రోజు వారి కసరత్తుల కోసం మంచి జిమ్‌ను వెతుకుతున్నా. వర్కవుట్స్ లేకుండా నా శరీరం ఏ పని చేయనివ్వదు. కాబట్టి తప్పకుండా జిమ్‌కు వెళ్లాల్సిందే’ అని విజేందర్ వ్యాఖ్యానించాడు.