ముంబై:టీమిండియా క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లికి ఇటీవల మిస్ వరల్డ్‌గా ఎంపికైన మానుషి చిల్లర్ ఓ ప్రశ్న వేశారు. సీఎన్‌ఎన్-న్యూస్ 18-2017 అవార్డుల ఫంక్షన్‌లో కోహ్లితో చిల్లర్ ముచ్చటించింది. ఈ క్రమంలోనే కోహ్లికి ఒక ప్రశ్నను చిల్లర్ సంధించింది. 'ముందుగా నీకు శుభాకాంక్షలు. ప్రపంచంలోనే బ్యాట్స్‌మెన్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నావు. ఎందరో యువ క్రికెటర్లు నిన్ను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు సాగుతున్నారు. ఈ సందర్భంగా నిన్ను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. వీరికి నువ్వు ఇచ్చే సలహాలు ఏమిటి. ముఖ్యంగా చిన్నారులకు మీరిచ్చే సందేశం ఏమిటి' అని కోహ్లిని చిల్లర్ అడిగారు.
దీనికి కోహ్లి బదులిస్తూ.. 'ఫీల్డ్‌లో ఎప్పుడు, ఏం చేయాలి అనేది చాలా ముఖ్యం. అది చాలా కచ్చితత్వంతో ఉండాలి. మన ఆలోచన గుండెల్లోంచి రావాలి. అది మనల్ని చూస‍్తున్న ప్రజలకు నమ్మశక్యంగా అనిపించాలి. ఏదో నటిస్తున్నట్లు వారికి అనిపించకూడదు. ఒకవేళ అలా జరిగితే వారు ఎప్పుడూ మనల్ని నమ్మరు. మనం చేసే పనిలో నిజాయితీ ఉండాలి. నా గురించి ఎవరు ఏమీ అన‍్నా పట‍్టించుకోను. నా పని సక్రమంగా చేయడమే నాకు తెలిసింది. దాన్నే నమ్ముతా. అదే యువతకు నేనిచ్చే సందేశం'అని కోహ్లి సమాధానమిచ్చాడు.
Comments
Please login to add a commentAdd a comment