విరాట్ కోహ్లి
బెంగళూరు : ముంబై ఇండియన్స్‌తో ఓటమి అనంతరం రాయల్‌చాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లి ఆరెంజ్ క్యాప్ అందుకోవడానికి విముఖత చూపాడు. దీనికి కారణం ఆర్సీబీ వరుస ఓటములేనన్న కోహ్లి.. శనివారం ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో విజయానంతరం సంతోషంగా ఆరేంజ్ క్యాప్ స్వీకరించాడు. మ్యాచ్ అనంతరం కోహ్లి మాట్లాడుతూ.. ‘ఏబీ ప్రపంచ అత్యుత్తమ బ్యాట్స్‌మన్.. అలాంటి ఆటగాడు జట్టులో ఉండటం గొప్ప విషయం. మేం ఇంకా కొన్ని తప్పిదాలను సరిదిద్దుకోవాలి. ఇక గత మ్యాచ్‌లో సాధించిన 90 పరుగుల కన్నా విజయంలో కీలకంగా మారిన నేటి 30 పరుగులే ఎక్కువ. మేం మ్యాచ్‌ను అర్థం చేసుకున్నాం. 60-70 పరుగుల భాగస్వామ్యం నమోదైతే విజయాన్నందుకోవచ్చని భావించాం. ఈ నేపథ్యంలోనే నేను రక్షణాత్మకంగా ఆడాను. ఏబీ తనదైన శైలిలో విజయాన్నిందించాడు. అతనికి కోరె అండర్సన్, మన్‌దీప్ సింగ్ సింగిల్స్ తీస్తూ అండగా నిలిచారు. అని కోహ్లి పేర్కొన్నాడు. ఏబీతో పాటు కోహ్లి (26 బంతుల్లో 30; 2 ఫోర్లు, 1 సిక్స్) మూడో వికెట్‌కు 63 పరుగులు జోడించాడు.
బోల్ట్ క్యాచ్‌పై స్పందిస్తూ.. ‘‘అది ఐపీఎల్‌లోనే అద్భుతమైన క్యాచ్. దాంతోనే మైదానంలో బిత్తరపోయా. క్రెడిట్ మాత్రం బోల్ట్‌దేనని’ కోహ్లి చెప్పుకొచ్చాడు. ఇక ఢిల్లీడేర్ డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఆరువికెట్ల తేడాతో ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఏబీ డివిలియర్స్ 39 బంతుల్లో 10 ఫోర్లు, 5 సిక్సర్లతో 90 నాటౌట్‌గా నిలిచి ఒంటి చెత్తో విజయాన్నందించాడు.
Comments
Please login to add a commentAdd a comment