టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి.. న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌లు మైదానంలో పత్యర్థులుగా.. వెలుపల మంచి స్నేహితులుగా ఉంటారన్న విషయం తెలిసిందే. అంతేగాక మ్యాచ్ మధ్యలో వీలు చిక్కినప్పుడల్లా వీరిద్దరూ సంభాషించుకుంటుంటారు. ఈ నేపథ్యంలో విరాట్, విలియమ్సన్తో కలిసి ఉన్న ఫొటోను శుక్రవారం ట్విటర్‌లో షేర్ చేశాడు. ‘మా మధ్య సంభాషణ ఆసక్తిగా ఉంటుంది. అది ఇష్టపడతాను. మీరు కూడా ఇష్టపడండి. విలియం మంచి వ్యక్తి’ అంటూ ట్వీట్ చేశాడు. కాగా 2019 ప్రపంచ కప్‌లో సెమీఫైనల్‌లో భారత్-న్యూజిలాండ్‌లు తలపడిన విషయం తెలిసిందే. ఇందులో భారత్ ఓడి ఇంటిదారి పట్టింది. (కోహ్లి కన్నా సచిన్ గొప్ప ఆటగాడు: గంభీర్)
Love our chats. Good man. pic.twitter.com/LOG62xQslM
— Virat Kohli (@imVkohli) May 22, 2020
కాగా.. మ్యాచ్ అనంతరం కోహ్లి ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోవిలియమ్సన్ గురించి అడగ్గా.. ‘కేన్.. నేను ఒకేలా మాట్లాడతాం, ఒకేలా ఆలోచిస్తాం, అంతేకాదు మా మనస్తత్వాలు కూడా ఒకేలా ఉంటాయి. ఇది నిజంగా అద్భుతం. వివిధ దేశాలకు చెందిన మేము ఒకేలా ఆలోచిండం, ఒకే బాషలో మాట్లాడుకోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు. వీరిద్దరికి సంబంధించి మరో ఆసక్తికర విషయం ఏంటంటే విరాట్, విలియమ్సన్‌లు 2008 అండర్-19 టోర్నమెంట్ సమీ ఫైనల్‌లో పత్యర్థులుగా తలపడ్డారు. అప్పుడు భారత్ జట్టుకు విరాట్ కెప్టెన్ కాగా.. న్యూజిలాండ్‌కు విలియమ్స్‌న్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ మ్యాచ్‌లో పార్ట్‌టైం బౌలర్‌గా వ్యవహరించిన కోహ్లి.. పత్యర్థులను తన బౌలింగ్‌తో కట్టడి చేసి జట్టును గెలిపించాడు. అండర్-19లో కోహ్లి బ్యాట్సమన్‌గా, బౌలర్‌గా అద్భుత ప్రదర్శన కనబరిచి అంతార్జాతీయ స్థాయికి ఎదిగాడు. (‘ప్రపంచ క్రికెట్‌లో వారిద్దరే అత్యుత్తమం’)
Comments
Please login to add a commentAdd a comment