కోహ్లిని సర్‌ప్రైజ్‌ చేసిన హోటల్‌ స్టాఫ్‌ | Virat Kohli touched by hotel staffs sweet gesture on reaching 6000 run milestone | Sakshi
Sakshi News home page

కోహ్లిని సర్‌ప్రైజ్‌ చేసిన హోటల్‌ స్టాఫ్‌

Sep 1 2018 11:48 AM | Updated on Sep 1 2018 11:51 AM

Virat Kohli touched by hotel staffs sweet gesture on reaching 6000 run milestone - Sakshi

టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టు ఫార్మాట్‌లో ఆరువేల పరుగుల మార్కును చేరిన సంగతి తెలిసిందే.

సౌతాంప్టన్‌: టీమిండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి టెస్టు ఫార్మాట్‌లో ఆరువేల పరుగుల మార్కును చేరిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో నాల్గో టెస్టులో కోహ్లి ఆరు వేల పరుగుల్ని పూర్తి చేసుకున్నాడు. ఫలితంగా భారత్‌ తరపున తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో కోహ్లి(119 ఇన్నింగ్స్‌లు) కంటే మందు సునీల్‌ గావస్కర్‌(117 ఇన్నింగ్స్‌లు) ఉన్నాడు.

కాగా, రెండో రోజు శుక్రవారం ఆట ముగించుకుని టీమిండియా ఆటగాళ్లు యథావిధిగా తాము బస చేసే హోటల్‌కు వచ్చారు. టెస్టుల్లో ఆరు వేల మైలురాయిని అందుకున్న కోహ్లికి ఆ హోటల్‌ సిబ్బంది చిన్న సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఒక ప్లేటులో ఆరు వేల పరుగుల అంకె వేసి నాలుగు స్ట్రాబెర్రిస్‌తో అందంగా అలంకరించి కోహ్లికి అందించారు. ఇందుకు సంబంధించిన ఫొటోను ట్విటర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు కోహ్లి. ‘సౌతాంప్టన్‌లోని హార్బర్‌ హోటల్‌ సిబ్బంది అందించిన ఈ కానుక ఎంతో నచ్చింది’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ జరుగుతున్న నాలుగో టెస్టులో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 273 పరుగులు చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement