
గంట మోగించిన సెహ్వాగ్, జులన్
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్‌కు ముందు గంట మోగించే సంప్రదాయాన్ని రెండో వన్డేలోనూ కొనసాగించారు. భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, మహిళల క్రికెట్ జట్టు సీనియర్ సభ్యురాలు జులన్ గోస్వామి కలిసి గంట మోగించారు.
మరోవైపు ఇటీవల మరణించిన తమ దేశ మాజీ క్రికెటర్ బాబ్ హాలండ్‌కు నివాళిగా ఆసీస్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్‌లు ధరించి మైదానంలోకి దిగారు.