Julan Goswami
-
జూలన్ గోస్వామిగా స్టార్ హీరోయిన్.. టీజర్ అదిరింది...
టీమిండియా స్టార్ బౌలర్ జూలన్ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "చక్దా ఎక్స్‌ప్రెస్" చిత్రం టీజర్ గురువారం విడుదలైంది. ఈ బయోపిక్‌లో గోస్వామి పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ సినిమాను హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఇక ఈ మూవీలో భారత క్రికెట్‌కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ఈ సినిమాకు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్ణేష్ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుష్క తెలిపింది. "ఇది నాకు నిజంగా ప్రత్యేకమైన చిత్రం. ఎందకంటే గోస్వామి వంటి స్టార్ బౌలర్ జీవిత ఆధారంగా తెరక్కెతుంది. ఇటువంటి పాత్రలో నటించడం నా అదృష్టం. చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రం మహిళా క్రికెట్ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది" అని అనుష్క శర్మ పేర్కొంది. భారత్ తరుపున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20 ఆడిన గోస్వామి వరుసగా 44, 240, 56 వికెట్లు సాధించింది. కాగా ప్రస్తుతం అనుష్క శర్మ.. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భర్త విరాట్ కోహ్లితో అక్కడే ఉంది. చదవండి: IND vs SA: నోరు అదుపులో పెట్టుకోమని అన్నాడు.. వెంటనే ఔటయ్యాడు.. -
మిథాలీ రాజ్ ర్యాంక్ యథాతథం..
ICC ODI Rankings: అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల వన్డే బ్యాటర్స్ ర్యాంకింగ్స్‌లో భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, స్మృతి మంధాన స్థానాల్లో ఎటువంటి మార్పు లేదు. 738 రేటింగ్స్‌తో మిథాలీ మూడో స్థానంలో కొనసాగుతుండగా... 710 రేటింగ్స్‌తో స్మృతి ఆరో ర్యాంక్‌లో నిలిచింది. వీరిద్దరు మినహా మరో భారత బ్యాటర్ టాప్–10లో చోటు దక్కించుకోలేదు. బౌలింగ్ విభాగంలో టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి రెండో స్థానంలో ఉంది. చదవండి: Trent Boult: బస్ డ్రైవర్‌ను హగ్ చేసుకున్న కివీస్ స్టార్ బౌలర్ -
స్టార్ క్రికెటర్ బయోపిక్‌లో అనుష్క..?
ముంబై: భారత చలన చిత్ర రంగంలో ఇటీవలి కాలంలో బయోపిక్‌ల హవా కొనసాగుతోంది. ముఖ్యంగా ప్రముఖ క్రీడాకారుల జీవిత చరిత్రలపై వరుసపెట్టి సినిమాలు తెరకెక్కుతున్నాయి. కొంతకాలం క్రితం టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్ ధోనీ జీవిత చరిత్ర ఆధారంగా ‘ఎంఎస్ ధోనీ.. ది అన్‌టోల్డ్ స్టోరీ’ తెరకెక్కగా, తాజాగా టీమిండియా మహిళా జట్టు పేసర్ ఝులన్ గోస్వామి బయోపిక్ అభిమానుల ముందుకు రాబోతుందని తెలుస్తోంది. ఝులన్ గోస్వామి పాత్రలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ భార్య, బాలీవుడ్ స్టార్ నటి అనుష్క శర్మ నటించనున్నట్లు బీటౌన్ వర్గాల సమాచారం. కాగా, గతేడాది జనవరిలో అనుష్కశర్మ టీమిండియా జెర్సీలో కనిపించినప్పటి నుంచి ఝులన్ గోస్వామి బయోపిక్ అంశంపై వార్తలు గుప్పుమంటున్నాయి. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో ఝులన్‌తో కలిసి అనుష్క కనిపించడం ఈ వార్తలకు మరింత బలం చేకూర్చింది. అయితే, ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హంగామా అనే మ్యాగజీన్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అంశాన్ని ప్రచురించింది. ఈ ఏడాది చివరినాటికి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని, ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్‌కు చెందిన 38 ఏళ్ల ఝులన్ గోస్వామి.. 2002లో అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టింది. ఆమె భారత్ తరఫున మూడు ఫార్మాట్లలో 330కి పైగా వికెట్లు పడగొట్టింది. మహిళల క్రికెట్లో ఆమె దాదాపు రెండు దశాబ్దాలుగా రాణిస్తుంది. ప్రస్తుతం ఇంగ్లండ్‌లో పర్యటిస్తున్న భారత మహిళల జట్టులో గోస్వామి సభ్యురాలిగా ఉంది. త్వరలోనే భారత్, ఇంగ్లండ్ మహిళల మధ్య టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఇరు దేశాల మధ్య జరిగిన ఏకైక టెస్టు డ్రా కాగా, మూడు వన్డేల సిరీస్‌ను 1-2తో భారత్ చేజార్చుకుంది. ఈ నెల 9 నుంచి మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. -
ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్: దుమ్మురేపిన మిథాలీ.. రెండేళ్ల తర్వాత
దుబాయ్: ఐసీసీ మంగళవారం ప్రకటించిన ఐసీసీ వుమెన్స్ వన్డే ర్యాంకింగ్స్‌లో టీమిండియా వుమెన్స్ జట్టు కెప్టెన్ మిథాలీ రాజ్ సత్తా చాటింది. ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో 72 పరుగులతో ఆకట్టుకున్న మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో టాప్ 5లోకి అడుగుపెట్టింది. 725 పాయింట్లతో మూడు స్థానాలు ఎగబాకిన ఆమె ఐదో స్థానంలో నిలిచింది. తాజాగా 22 ఏళ్ల క్రికెట్ కెరీర్‌ను పూర్తి చేసుకున్న మిథాలీ 38 ఏళ్ల వయసులోనూ అద్భుత ఫామ్‌తో అదరగొడుతుంది. 2019 తర్వాత మిథాలీ వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ టాప్ 5లోకి అడుగుపెట్టడం విశేషం. ఇక బ్యాటింగ్ విభాగంలో ఇంగ్లండ్‌కు చెందిన టామీ బ్యూమాంట్ 791 పాయింట్లతో తొలి స్థానంలో ఉంది. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌వుమన్ లిజీ లీ 758 పాయింట్లతో రెండో స్థానంలో, ఆసీస్‌కు చెందిన అలీసా హేలీ 756 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో టీమిండియా నుంచి జులన్ గోస్వామి 681 పాయింట్లతో తన ఐదో స్థానాన్ని నిలుపుకోగా.. ఆసీస్‌కు చెందిన జెస్ జోనాసన్, మేఘన్ స్కట్ వరుసగా తొలి రెండు స్థానాల్లో నిలిచారు. ఇక ఆల్‌రౌండ్ విభాగంలో టీమిండియా నుంచి దీప్తి శర్మ ఐదో స్థానంలో నిలవగా.. ఎలిస్సే పేరీ(ఆస్ట్రేలియా) తొలి స్థానంలో,మేరీజన్నే కాప్(దక్షిణాఫ్రికా), స్టాఫైన్ టేలర్(వెస్టిండీస్) రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. ఇక ఇంగ్లండ్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా టీమిండియా తొలి వన్డేలో ఓటమి చవిచూసిన సంగతి తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 50 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన ఇంగ్లండ్ జట్టు 34.5 ఓవర్లలోనే రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. కాగా ఇరు జట్ల మధ్య రెండో వన్డే రేపు(బుధవారం) జరగనుంది. అంతకముందు ఇంగ్లండ్‌తో జరిగిన ఏకైక డే నైట్ టెస్టు మ్యాచ్‌ను టీమిండియా డ్రా చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ఐసీసీ అధికారిక ప్రకటన: టీ20 ప్రపంచకప్ టోర్నీ ఎప్పుడంటే.. ఊహించని విధంగా బౌన్సర్ వేశాడు.. దాంతో In the latest @MRFWorldwide ICC Women's ODI Player Rankings for batting: ↗️ @M_Raj03 enters top five ↗️ @natsciver moves up one spot Full list: https://t.co/KjDYT8qgqn pic.twitter.com/szonwdMmn9 — ICC (@ICC) June 29, 2021 -
చెలరేగిన స్మృతి మంధాన.. దక్షిణాఫ్రికా చిత్తు
లక్నో: తొలి వన్డేలో ఎదురైన పరాజయం నుంచి భారత మహిళల క్రికెట్ జట్టు వెంటనే తేరుకుంది. రెండో వన్డేలో దక్షిణాఫ్రికాను ఆల్‌రౌండ్ ప్రదర్శన తో దెబ్బకొట్టి సిరీస్‌లో సమంగా నిలిచింది. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ రాజ్ కెప్టెన్సీలోని భారత జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై జయభేరి మోగించింది. బౌలింగ్‌లో వెటరన్ సీమర్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/42) దక్షిణాఫ్రికాను వణికించగా... తర్వాత బ్యాటింగ్‌లో స్మృతి మంధాన (64 బంతుల్లో 80 నాటౌట్; 10 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగింది. స్మృతికి పూనమ్ రౌత్ (89 బంతుల్లో 62 నాటౌట్; 8 ఫోర్లు) తోడుగా నిలిచింది. దాంతో భారత్ 28.4 ఓవర్లలో కేవలం వికెట్ నష్టపోయి 160 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది. ఛేజింగ్‌లో వరుసగా పది అర్ధ సెంచరీలు చేసిన తొలి క్రికెటర్‌గా స్మృతి గుర్తింపు పొందింది. అంతకుముందు టాస్ నెగ్గిన భారత్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు లిజెల్లి లీ (4), వోల్వర్డ్ (9) జట్టు స్కోరు 20 పరుగులకే వెనుదిరిగారు. ఈ దశలో లారా గుడ్‌ఆల్ (49; 2 ఫోర్లు), సునే లూస్ (36; 5 ఫోర్లు) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు. మూడో వికెట్‌కు 60 పరుగులు జోడించాక కెప్టెన్ లూస్‌ను మాన్సీ జోషి అవుట్ చేసింది. అక్కడి నుంచి భారత బౌలర్లు పట్టుబిగించారు. కేవలం 58 పరుగుల వ్యవధిలోనే 7 వికెట్లను పడేశారు. లూస్, గుడ్‌ఆల్ తర్వాత ఇంకెవరూ భారత బౌలింగ్‌కు అసలు క్రీజులో నిలిచే సాహసం చేయలేకపోయారు. స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ 3, మాన్సి జోషి 2 వికెట్లు తీశారు. ఛేజింగ్‌లో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (9) తక్కువ స్కోరుకే వెనుదిరగగా... స్మృతి, పూనమ్ రౌత్‌తో కలిసి అబేధ్యమైన రెండో వికెట్‌కు 138 పరుగులు జోడించడంతో భారత్ విజయం ఖాయమైంది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే షబ్నిమ్ బౌలింగ్‌లో స్మృతి రెండు వరుస సిక్సర్లతో ఎదురుదాడికి దిగింది. ఈ క్రమంలో స్మృతి 46 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆమెకు అండగా నిలిచిన పూనమ్ రౌత్ 79 బంతుల్లో ఫిఫ్టీని అధిగమించింది. ఐదు వన్డేల సిరీస్ 1–1తో సమంగా ఉండగా... మూడో వన్డే శుక్రవారం ఇదే వేదికపై జరుగుతుంది. దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో ఆడటం ద్వారా అంతర్జాతీయ మహిళల క్రికెట్లో అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రికెటర్‌గా మిథాలీ రాజ్ గుర్తింపు పొందింది. 1999లో అరంగేట్రం చేసిన మిథాలీ ఇప్పటివరకు 310 మ్యాచ్‌లు (10 టెస్టులు+211 వన్డేలు+82 టి20లు) ఆడింది. 309 మ్యాచ్‌లతో (23 టెస్టులు+191 వన్డేలు+95 టి20లు) చార్లోటి ఎడ్వర్డ్స్ (ఇంగ్లండ్) పేరిట ఉన్న రికార్డును మిథాలీ అధిగమించింది. -
బోణి కొట్టిన భారత్
లక్నో: ఐదు వన్డేల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికా మహిళల జట్టుతో మంగళవారం జరిగిన రెండో వన్డేలో టీమిండియా బోణి కొట్టింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా.. టీమిండియా బౌలర్లు జులన్ గోస్వామి (4/42), గైక్వాడ్ (3/37), మాన్సీ జోషి (2/23) ధాటికి 41 ఓవర్లలో 157 పరుగులకే కుప్పకూలింది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో లారా గుడాల్(49) టాప్ స్కోరర్‌గా నిలిచింది. అనంతరం కష్టసాధ్యం కాని లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన భారత్.. కేవలం 28.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేరుకొని సునాయాస విజయాన్ని సాధించింది. ఓపెనర్ జేమిమా రోడ్రిగ్స్ (20 బంతుల్లో 9) విఫలమైనప్పటికీ, మరో ఓపెనర్ మంధన ( 64 బంతుల్లో 80 పరుగులు;10 ఫోర్లు, 3 సిక్స్‌లు), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్‌లు ( 89 బంతుల్లో 62 పరుగులు; 8 ఫోర్లు) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. దీంతో భారత్ తొమ్మిది వికెట్ల తేడాతో విజయం సాధించి 5 వన్డేల సిరీస్‌లో బోణీ కొట్టింది. 4 వికెట్లతో రాణించిన జులన్ గోస్వామి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికైంది. -
తాప్సీకి పోటీగా.. కోహ్లి భార్య మైదానంలోకి!
సినిమా రంగంలో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. అందుకు అనుగుణంగానే తాజాగా బాలీవుడ్ బ్యూటీ, క్రికెటర్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మ ఓ ప్రాజెక్టుకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. భారత మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి బయోపిక్‌లో ప్రధానపాత్ర పోషించేందుకు అనుష్క అంగీకరించారు. 2002లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా లెజెండ్ మహిళా క్రికెటర్ ఝులన్ గోస్వామి తన 18 ఏళ్ల కెరియర్లో ఎన్నో ఒడిదుడుకులను చవిచూసింది. ఝలన్ గోస్వామి 2010లో అర్జున అవార్డ్‌తో పాటు పద్మశ్రీ అవార్డు కూడా దక్కించుకుంది. 2002లో తొలి వన్డే మ్యాచ్ ఆడిన గోస్వామి ఇటీవల టీ20లకి రిటైర్మెంట్ ప్రకటించింది. అటు భారత మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ బయోపిక్ కూడా రూపొందుతోంది. ఈ మూవీలో నటి తాప్సీ మిథాలీరాజ్ పాత్రను పోషిస్తోంది. శభాష్ మిథు పేరుతో సినిమా నిర్మాణం జరుపుకుంటోంది. ఇటు అనుష్క శర్మ కూడా ఝలన్ గోస్వామి బయోపిక్‌లో నటించనుండడంతో రెండు బయోపిక్ లు త్వరలో ప్రేక్షకులను అలరించనున్నాయి. క్రీడాకారుల జీవిత చరిత్రలతో రూపొందే బయోపిక్‌లకు మంచి ఆదరణ లభిస్తున్న విషయం తెలిసిందే. చదవండి: 2020 కోసం వెయింటింగ్: అనుష్క శర్మ -
జులన్... నంబర్‌వన్
దుబాయ్: ఇంగ్లండ్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో ఎనిమిది వికెట్లు తీసి భారత మహిళల జట్టుకు సిరీస్ లభించడంలో కీలకపాత్ర పోషించిన టీమిండియా వెటరన్ పేసర్ జులన్ గోస్వామి... అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) మహిళల బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానాన్ని అలంకరించింది. సోమవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో జులన్ టాప్ ర్యాంక్‌ను అందుకుంది. గత ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో నిలిచిన 36 ఏళ్ల జులన్ ఈసారి రెండు స్థానాలు ఎగబాకి నంబర్‌వన్ స్థానానికి చేరుకుంది. బెంగాల్‌కు చెందిన జులన్ ఖాతాలో 730 ర్యాంకింగ్ పాయింట్లున్నాయి. 2016 ఫిబ్రవరిలో తొలిసారి వరల్డ్ నంబర్‌వన్ బౌలర్‌గా అవతరించిన జులన్ ఆ తర్వాత తన టాప్ ర్యాంక్‌ను కోల్పోయింది. మళ్లీ ఇంగ్లండ్‌తో తాజా వన్డే సిరీస్‌లో అద్భుత ప్రదర్శన చేసి నంబర్‌వన్ స్థానాన్ని అందుకుంది. ఇప్పటివరకు 177 వన్డేలు ఆడిన జులన్ 218 వికెట్లు తీసింది. భారత్‌కే చెందిన మరో పేస్ బౌలర్ శిఖా పాండే 13వ ర్యాంక్ నుంచి ఐదో ర్యాంక్‌కు చేరుకుంది. దాంతో 2010 తర్వాత టాప్–5లో ఇద్దరు భారత పేస్ బౌలర్లు నిలువడం ఇదే ప్రథమం. 2010లో రుమేలీ ధర్, జులన్ టాప్–5లో నిలిచారు. బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కే చెందిన స్మృతి మంధాన 797 పాయింట్లతో టాప్ ర్యాంక్‌లో కొనసాగుతోంది. 2012 తర్వాత అటు బౌలింగ్ విభాగంలో... ఇటు బ్యాటింగ్ విభాగంలో భారత ప్లేయర్లు నంబర్‌వన్ స్థానంలో ఉండటం ఇదే తొలిసారి. 2012లో జులన్ గోస్వామి... మిథాలీ రాజ్ ఈ ఘనత సాధించారు. -
జులన్,శిఖా పేస్ ప్రతాపం
ముందుగా బౌలింగ్‌లో జులన్ గోస్వామి, శిఖా పాండే పేస్‌తో హడలెత్తించారు. మధ్యలో స్పిన్నర్ పూనమ్ యాదవ్ ఓ చేయి వేసింది. తర్వాత స్మృతి మంధాన, కెప్టెన్ మిథాలీ బ్యాటింగ్‌లో అదరగొట్టారు! ఫలితం... ప్రత్యర్థి ఇంగ్లండ్‌కు అవకాశమే లేకుండా భారత మహిళల జట్టు రెండో వన్డేనూ వశం చేసుకుని... మరో రెండు ఐసీసీ చాంపియన్ షిప్ పాయింట్లను ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో శిఖా తన కెరీర్లో ఉత్తమ గణాంకాలను నమోదు చేయడం విశేషం. మ్యాచ్‌లో తనదైన హిట్టింగ్ చూపిన స్మృతి... డ్రైవ్‌లు, పుల్ షాట్లతో పరుగులు రాబట్టి ఆకట్టుకుంది. ఆమెకు మిథాలీ అనుభవం తోడవడంతో టీమిండియా విజయం సులభమైంది. ముంబై: ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబర్చిన భారత మహిళలు వరుసగా రెండో వన్డేలోనూ ప్రపంచ చాంపియన్ ఇంగ్లండ్‌పై ఘన విజయం సాధించారు. మూడు వన్డేల ఐసీసీ మహిళల చాంపియన్‌షిప్‌లో భాగంగా సోమవారం ఇక్కడ జరిగిన ఈ మ్యాచ్‌లో మిథాలీ సేన ఏడు వికెట్ల తేడాతో సునాయాసంగా గెలుపొందింది. మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకుంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్... పేస్ ద్వయం, ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ జులన్ గోస్వామి (4/30), శిఖా పాండే (4/18) ధాటికి 43.3 ఓవర్లలో 161 పరుగులకే ఆలౌటైంది. ఓపెనర్లు ఎలెన్ జోన్స్ (3), బ్యూమాంట్ (20)ను ఔట్ చేసి శిఖా శుభారంభమివ్వగా... సారా టేలర్ (1), కెప్టెన్ హీతెర్ నైట్ (2)లను జులన్ వెనక్కు పంపింది. జట్టు 44/4తో నిలిచిన ఈ దశలో నటాలీ సీవర్ (109 బంతుల్లో 85; 12 ఫోర్లు, 1 సిక్స్), విన్ఫీల్డ్ (49 బంతుల్లో 28; 4 ఫోర్లు) ఆదుకున్నారు. ఐదో వికెట్‌కు 49 పరుగులు జోడించిన వీరిని... విన్‌ఫీల్డ్‌ను ఔట్ చేయడం ద్వారా స్పిన్నర్ పూనమ్ యాదవ్ (2/28) విడదీసింది. శిఖా దెబ్బకు ఎల్విస్ (0), బ్రంట్ (0) ఖాతా తెరవకుండానే బౌల్డయ్యారు. ష్రబ్సోల్ (1)ను పూనమ్, ఎకిల్‌స్టోన్ (5)ను జులన్ ఔట్ చేయడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ముగిసింది. స్వల్ప లక్ష్య ఛేదనలో ఓపెనర్ జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్‌గా వెనుదిరిగినా, మరో ఓపెనర్ స్మృతి మంధాన (74 బంతుల్లో 63; 7 ఫోర్లు, 1 సిక్స్), వన్ డౌన్ బ్యాటర్ పూనమ్ రౌత్ (65 బంతుల్లో 32; 4 ఫోర్లు) నిలకడగా ఆడటంతో టీమిండియాకు ఇబ్బంది ఎదురవలేదు. రెండో వికెట్‌కు 73 పరుగులు జోడించాక రౌత్ ఔటైంది. మంధాన, కెప్టెన్ మిథాలీ రాజ్ (69 బంతుల్లో 47; 8 ఫోర్లు) మరింత సాధికారికంగా ఆడి లక్ష్యాన్ని కరిగించారు. స్మృతి వెనుదిరిగాక మిథాలీ, దీప్తి శర్మ (6 నాటౌట్) పని పూర్తి చేశారు. భారత్ 41.1 ఓవర్లకే విజయాన్ని అందుకుంది. ► 589 గత ఏడాది కాలంలో భారత జట్టు ఛేజింగ్ చేసిన ఎనిమిది ఇన్నింగ్స్‌లలో స్మృతి మంధాన 117.8 సగటుతో మొత్తం 589 పరుగులు చేసింది. ఇందులో ఏడు అర్ధ సెంచరీలు, ఒక సెంచరీ ఉండటం విశేషం. ► 1 ఒకే ఇన్నింగ్స్‌లో భారత మహిళల జట్టుకు చెందిన ఇద్దరు పేస్ బౌలర్లు నాలుగు చొప్పున వికెట్లు తీయడం ఇదే ప్రథమం. -
మంధాన అదరహో
దుబాయ్ : భారత మహిళా క్రికెట్ అనగానే మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్ మాత్రమే కాదు.. డాషింగ్ ఓపెనర్ స్మృతి మంధానా కూడా అని అనుకొనే రోజులు వచ్చాయి. వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై విశ్వరూపం ప్రదర్శించి.. తాజాగా న్యూజిలాండ్‌తో జరిగిన సిరీస్‌లో సైతం మంధానా పరుగుల జోరు కొనసాగించింది. ప్రస్తుతం కళ్లు చెదిరే బ్యాటింగ్ తో ప్రత్యర్థిజట్ల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది ఈ మరాఠా మెరుపుతీగ. తన బ్యాటింగ్ మెరుపులతో తాజాగా ఐసీసీ ప్రకటించిన మహిళల వన్డే ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధాన ఆగ్రస్థానానికి ఎగబాకింది. ఆస్ట్రేలియా బ్యాటర్ ఎలైసే పెర్రీ, మెగ్ లానింగ్‌లు తరువాతి స్థానాల్లో ఉన్నారు ఇక ఈ జాబితాలో సీనియర్ బ్యాటర్, వన్డే సారథి మిథాలీ రాజ్ ఐదో స్థానాన్ని కాపాడుకోగా.. దీప్తి శర్మ, హర్మన్ ప్రీత్ కౌర్‌లు టాప్ 20లో కొనసాగుతున్నారు. ఇక బౌలింగ్ జాబితాలో జులాన్ గోస్వామి మూడో స్థానంలో కొనసాగుతుండగా.. దీప్తి శర్మ, పూనమ్ యాదవ్‌లు వరుసగా ఎనిమిది, తొమ్మిదో స్థానాల్లో నిలిచారు. ఈ జాబితాలో పాకిస్తాన్ బౌలర్ సనా మిర్ ఆగ్రస్థానంలో కొనసాగుతోంది. న్యూజిలాండ్ వన్డే సిరీస్ గెలిచిన మిథాలీ సేన టీమ్ జాబితాలో మూడో స్థానంలో నిలిచింది. టీమ్ జాబితాలో ఆసీస్ ఆగ్ర స్థానంలో కొనసాగుతుండగా, ఇంగ్లండ్ రెండో స్థానంలో నిలిచింది. -
గంట మోగించిన సెహ్వాగ్, జులన్
ఈడెన్ గార్డెన్స్ మైదానంలో మ్యాచ్‌కు ముందు గంట మోగించే సంప్రదాయాన్ని రెండో వన్డేలోనూ కొనసాగించారు. భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్, మహిళల క్రికెట్ జట్టు సీనియర్ సభ్యురాలు జులన్ గోస్వామి కలిసి గంట మోగించారు. మరోవైపు ఇటీవల మరణించిన తమ దేశ మాజీ క్రికెటర్ బాబ్ హాలండ్‌కు నివాళిగా ఆసీస్ ఆటగాళ్లు నల్ల బ్యాండ్లు ధరించి మైదానంలోకి దిగారు. -
జులన్‌కు రూ. 50 వేలేనా?
భారత మహిళా స్టార్ క్రికెటర్‌కు ఎయిరిండియా ‘చౌక’బారు ప్రోత్సాహం కోల్‌కతా: గత కొన్నాళ్లుగా ఎయిర్‌లైన్స్ సంస్థలు చౌక టికెట్లతో ప్రయాణికుల్ని ఆకర్షిస్తున్న సంగతి తెలిసిందే. బహుశా ఎయిరిండియా కూడా ఇదే ఫార్ములాను ప్రోత్సాహక సందర్భానికి వాడుకున్నట్లుంది. ఇటీవల జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌లో విశేషంగా రాణిం చిన భారత స్టార్ క్రికెటర్ జులన్ గోస్వామికి రూ. 50 వేల ప్రోత్సాహం, ప్రశంస పత్రంతో సరిపెట్టి చేతులు దులిపేసుకుంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఈ సంస్థ నా కుటుంబంలాంటిది. నా కెరీర్ ఎదుగుదలకు వెన్నుతట్టి ప్రోత్సహించింది. ఈ రోజు నన్ను ఇలా గౌరవించడం చాలా ఆనందంగా ఉంది. నాలాగే వివిధ క్రీడల్లో రాణిస్తున్న వారందరిని ఈ సంస్థ ఇలాగే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’నని తెలిపి సంస్థ పరువు నిలిపే ప్రయత్నం చేసింది. ఇచ్చిన డబ్బు కన్నా సంస్థ గౌరవానికే ప్రాధాన్యమిచ్చిన జులన్ నిజంగా గ్రేట్! 2006 నుంచి ఈ సంస్థలో పనిచేస్తున్న జులన్‌కు డిప్యూటీ మేనేజర్ నుంచి మేనేజర్‌గా పదోన్నతి కల్పించారు. మరోవైపు ప్రపంచకప్‌లో రన్నరప్‌గా నిలిచిన భారత జట్టులో సభ్యులుగా ఉన్న రైల్వే క్రీడాకారిణులకు ఆ సంస్థ రూ. 13 లక్షల చొప్పున నగదు ఇవ్వడమే కాకుండా ప్రమోషన్లు ఇచ్చిన సంగతి తెలిసిందే. -
జులన్... ‘పేస్’ గన్!
-
జులన్... ‘పేస్’ గన్!
స్ఫూర్తిదాయకం బౌలర్ జులన్ గోస్వామి ప్రస్థానం దాదాపు ఇరవై ఏళ్ల క్రితం... 1997లో మహిళల క్రికెట్ వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. కోల్‌కతా ఈడెన్ గార్డెన్స్‌లో ఈ మ్యాచ్ చూసేందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థినులకు ఉచిత కాంప్లిమెంటరీ పాస్‌లు పంపించారు. అలా ఆ మ్యాచ్ చూసే అవకాశం దక్కించుకున్న 15 ఏళ్ల జులన్ గోస్వామి... తాను కూడా క్రికెట్‌ను ప్రొఫెషన్‌గా ఎంచుకోవాలని, భారత్‌కు ప్రాతినిధ్యం వహించాలని గట్టిగా నిర్ణయించుకుంది. సరిగ్గా పదేళ్ల తర్వాత 2007లో ఐసీసీ ఉమన్ క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును అందుకొని శిఖరాన నిలిచిన ఈ పేస్ బౌలర్, మరో పదేళ్లకు ఇప్పుడు వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్రలో తన పేరును లిఖించుకోగలిగింది. మహిళా క్రికెట్‌కు పెద్దగా గుర్తింపు లేని సమయంలో, మీడియం పేస్ వేస్తే చాలనుకునే స్థితిలో ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఉమన్ బౌలర్‌గా జులన్ ఎదగడంలో ఎంతో శ్రమ, పట్టుదల ఉన్నాయి. సాక్షి క్రీడా విభాగం :కోల్‌కతాకు దాదాపు 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న చక్దహా పట్టణం జులన్ స్వస్థలం. చాలా మందిలాగే సరదాగా టీనేజ్‌లో టెన్నిస్ బాల్‌తో ఆమె బౌలింగ్ చేసేందుకు ఆసక్తి చూపించింది. అయితే అక్కడి కుర్రాళ్లు ఆమె నెమ్మదైన బౌలింగ్‌ను చితక్కొట్టి నువ్వు బౌలింగ్ చేయడం మానేస్తే మంచిదని వ్యంగ్యంగా అన్నారు. దాంతో పట్టుదల పెరిగిన జులన్, ఫాస్ట్ బౌలింగ్‌పై దృష్టి పెట్టింది. కోల్‌కతాలో ప్రత్యేకంగా అమ్మాయిలకు క్రికెట్ కోచింగ్ ఇచ్చే స్వపన్ సాధు, జులన్ తల్లిదండ్రులను ఒప్పించి ఆమెకు తగిన మార్గనిర్దేశనం చేశాడు. అయితే రోజూ చక్దహా నుంచి కోల్‌కతా వరకు కిక్కిరిసిన ట్రైన్లలో ప్రయాణించడం, శిక్షణ పూర్తి చేసుకొని తిరిగి రావడం... ఇలా ఆట కోసం జులన్ తీవ్రంగా కష్టపడింది. ‘ఆ ప్రయాణం అంత సులువుగా ఉండేది కాదు. టీనేజ్ అమ్మాయిలు సహజంగానే ఎదుర్కొనే సమస్యలు నాకు కూడా వచ్చాయి. అయితే రానురానూ మానసికంగా దృఢంగా మారి వాటిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకున్నాను’ అని జులన్ చెప్పుకుంది. వేగంగా దూసుకెళ్లి... బౌలింగ్‌లో మెళకువలు నేర్చుకున్న కొద్ది రోజులకే జులన్ కెరీర్ వేగంగా దూసుకుపోయింది. జూనియర్ స్థాయిలో మంచి ప్రదర్శన కనబర్చిన తర్వాత ఆమె బెంగాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైంది. ఆ తర్వాత ఈస్ట్‌జోన్ తరఫున ఒక మ్యాచ్‌లో ఆమె ప్రదర్శన (3/13) ఎయిరిండియా అధికారులను ఆకట్టుకుంది. దాంతో ఎయిరిండియాలో ఆమె రెగ్యులర్ సభ్యురాలిగా మారింది. ఆ తర్వాత రెండేళ్లకే తొలిసారి భారత జట్టులో అవకాశం లభించింది. ఇంగ్లండ్‌తో ఆడిన తొలి వన్డేలోనే జులన్ (2/15) రాణించింది. ఆ తర్వాత ఆమెకు ఎలాంటి అడ్డంకీ ఎదురు కాలేదు. ఆరంభంలో జూనియర్‌గా, ఆ తర్వాత సీనియర్ సభ్యురాలిగా కూడా భారత జట్టులో కీలకంగా ఎదిగి జులన్ పలు చిరస్మరణీయ విజయాల్లో భాగమైంది. 2006లో టాంటన్‌లో అద్భుత బౌలింగ్ ప్రదర్శన (10/78)తో ఇంగ్లండ్‌పై భారత్ చారిత్రక టెస్టు విజయం సాధించడంలో జులన్‌దే ప్రధాన పాత్ర. 2006, 2008 ఆస్ట్రేలియా పర్యటనలో వన్డేల్లో విశేషంగా రాణించిన ఈ పేసర్, 2007లో నాలుగు దేశాల టోర్నీలో 20.99 సగటుతో 11 వికెట్లు తీసి సత్తా చాటింది. అదే ఏడాది ఐసీసీ ఉమన్ క్రికెటర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును అందుకుంది. అర్జున, పద్మశ్రీ పురస్కారాలు కూడా ఆమెకు లభించాయి. ఇప్పటికీ అదే జోరు... చాలా కాలంగా మహిళల క్రికెట్లో ఫాస్టెస్ట్ బౌలర్‌గా జులన్‌కు గుర్తింపు ఉంది. ఇటీవలే ఆస్ట్రేలియాతో జరిగిన సిరీస్‌లో ఆమె నిలకడగా గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసింది. 5 అడుగుల 11 అంగుళాల ఎత్తు ఉన్న జులన్, పేసర్‌గా ఎదిగే క్రమంలో ఎంఆర్ఎఫ్ పేస్ ఫౌండేషన్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకుంది. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆమెలో కొన్ని లోపాలు సరిదిద్ది మరింతగా తీర్చిదిద్దారు. దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్‌ను ఆరాధించే జులన్, అతని వీడియోలను రెగ్యులర్‌గా చూస్తుంది. తన బౌలింగ్‌కు సంబంధించి గ్లెన్ నుంచి కూడా సూచనలు తీసుకుంది. చాలా కాలంగా భారత జట్టులో జులన్‌కు రెండో ఎండ్ నుంచి సరైన మద్దతు లేదు. 34 ఏళ్ల వయసులో కూడా దాదాపు సింగిల్ హ్యాండ్‌తో ఆమె జట్టు పేస్ బౌలింగ్ భారం మోస్తోంది. ఇప్పుడు తాజా రికార్డు జులన్ ఇన్నేళ్ల శ్రమకు దక్కిన గుర్తింపుగా చెప్పవచ్చు. భారత మహిళల మరో గెలుపు 7 వికెట్లతో దక్షిణాఫ్రికా చిత్తు 181 వికెట్లతో జులన్ ప్రపంచ రికార్డు పోష్‌స్ట్రూమ్: నాలుగు దేశాల వన్డే టోర్నీలో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయం సాధించింది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 7 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించింది. ముందుగా దక్షిణాఫ్రికా 39.3 ఓవర్లలో 119 పరుగులకే ఆలౌటైంది. డు ప్రీజ్ (31), త్రిషా చెట్టి (28) రాణించారు. జులన్ గోస్వామి (3/20), శిఖా పాండే (3/22) ప్రత్యర్థిని కుప్పకూల్చారు. అనంతరం భారత్ 41.2 ఓవర్లలో 3 వికెట్లకు 121 పరుగులు చేసింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (66 బంతుల్లో 51 నాటౌట్; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ అర్ధ సెంచరీ సాధించగా, మోనా మేశ్రమ్ (38) అండగా నిలిచింది. వన్డే క్రికెట్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా జులన్ గోస్వామి ప్రపంచ రికార్డు సృష్టించింది. 153 మ్యాచ్‌లలో 181 వికెట్లు పడగొట్టిన జులన్... దాదాపు దశాబ్ద కాలంగా క్యాథరీన్ ఫిట్జ్ ప్యాట్రిక్ (ఆస్ట్రేలియా–180) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టడం విశేషం.