Chakdaha Express Trailer: Jhulan Goswamis Biopic Chakda Xpress Teaser Released - Sakshi
Sakshi News home page

Chakda Xpress: జూలన్‌ గోస్వామిగా స్టార్‌ హీరోయిన్‌.. టీజర్‌ అదిరింది...

Published Thu, Jan 6 2022 1:21 PM | Last Updated on Thu, Jan 6 2022 2:24 PM

Jhulan Goswamis biopic Chakda Xpress Teaser released - Sakshi

టీమిండియా స్టార్‌ బౌలర్‌ జూలన్‌ గోస్వామి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్న "చక్దా ఎక్స్‌ప్రెస్" చిత్రం టీజర్‌ గురువారం విడుదలైంది. ఈ బయోపిక్‌లో  గోస్వామి పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్క శర్మ నటిస్తోంది. ఈ సినిమాను హాట్‌స్టార్‌లో ప్రసారం చేయనున్నారు. ఇక ఈ మూవీలో భారత క్రికెట్‌కు గోస్వామి అందించిన సేవలను, సాధించిన రికార్డులను చూపించనున్నారు. ఈ సినిమాకు ప్రోసిత్ రాయ్ దర్శకత్వం వహిస్తుండగా, అనుష్క శర్మ, ఆమె సోదరుడు కర్ణేష్‌ శర్మ క్లీన్ స్లేట్ ఫిల్మ్జ్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. కాగా నిజ జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న పాత్రలో నటించినందుకు చాలా సంతోషంగా ఉంది అని అనుష్క తెలిపింది.

"ఇది నాకు నిజంగా ప్రత్యేకమైన చిత్రం. ఎందకంటే గోస్వామి వంటి స్టార్‌ బౌలర్‌  జీవిత ఆధారంగా తెరక్కెతుంది. ఇటువంటి పాత్రలో నటించడం నా అదృష్టం.  చక్దా ఎక్స్‌ప్రెస్ చిత్రం మహిళా క్రికెట్‌ విలువను ప్రపంచానికి తెలియజేస్తుంది" అని  అనుష్క శర్మ పేర్కొంది. భారత్‌ తరుపున 12 టెస్టులు, 192 వన్డేలు, 68 టీ20 ఆడిన గోస్వామి వరుసగా 44, 240, 56 వికెట్లు సాధించింది. కాగా ప్రస్తుతం అనుష్క శర్మ.. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న భర్త విరాట్‌ కోహ్లితో అక్కడే ఉంది.

చదవండి: IND vs SA: నోరు అదుపులో పెట్టుకోమని అన్నాడు.. వెంటనే ఔటయ్యాడు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement