
సెహ్వాగ్ పోస్ట్ చేసిన వీడియో చూస్తారా?
కండ బలం కన్నా బుద్ధి బలం గొప్పదని పెద్దోళ్లు ఎప్పుడో చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తే గండాలను తప్పించుకోవచ్చన్నది జగమెరిగిన సత్యం. వీటి గురించి తెలియకపోయినా ఓ గాడిద సమయస్ఫూర్తితో వ్యవహరించి తమకు ‘బుర్ర’ ఉందని నిరూపించింది. గాడిద చాకిరి చేయడమే కాదు చాకచక్యంగా సమస్యల నుంచి బయటపడగలమని వీడియో సాక్షిగా చాటిచెప్పింది.
నాలుగు గాడిదలు ఓ దారిలో వెళుతుండగా వాటికి పెద్ద కర్ర అడ్డుగా నిలిచింది. రెండు గాడిదలు కష్టపడి కర్ర పైనుంచి దూకి బయటపడ్డాయి. మూడో గాడిద కర్రపై నుంచి గెంతకుండా ఒక్కసారి ఆలోచించింది. సింపుల్ గా కర్రను నోటితో పట్టుకుని కింద పడేసింది. కష్టపడి గెంతాల్సిన అవసరం లేకుండానే కర్రను దాటి వెళ్లింది. సమయస్ఫూర్తితో దాని వెనుకున్న మరో గాడిదకు కూడా మార్గం సుగమం చేసింది. ఈ ఆసక్తికర వీడియోను టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తన ట్విటర్ పేజీలో పోస్ట్ చేశాడు.