
ముంబై: ఈసారి ఐపీఎల్ ట్రోఫీ గెలుస్తామని చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు సురేశ్ రైనా ధీమా వ‍్యక్తం చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఫైనల్‌లోకి ప్రవేశించిన వెంటనే తమ కెప్టెన్ ధోని చాలా ఎమోషనల్ అయిపోయాడని, అతడి కోసం టైటిల్ గెలవాలని జట్టు నిర్ణయించుకున్నట్టు ఈ సందర్భంగా రైనా పేర్కొన్నాడు. ఐపీఎల్‌లో తనపై విమర్శలు వచ్చిన ప్రతిసారీ ధోని తన ఆటతీరుతో వాళ్ల నోళ్లు మూయించాడని పేర్కొన్నాడు. ఈసారి మాత్రం అతని కోసమే కప్పు కొట్టుకొస్తామని రైనా విశ్వాసం వ్యక్తం చేశాడు.
ఈ సీజన్ లీగ్ దశలో చెన్నై సూపర్ కింగ్స్ లీగ్ దశలో రెండో స్థానానికి పరిమితం కాగా, క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో సన్ రైజర్స్ హైదరాబాద్‌పై విజయం సాధించి నేరుగా ఫైనల్‌కు దూసుకెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment