వార్నర్‌-క్యాండిస్‌ల ‘వేషాలు’ చూడండి..! | Warner, Wife Candice Switch Roles In Hilarious TikTok Video | Sakshi
Sakshi News home page

వార్నర్‌-క్యాండిస్‌ల ‘వేషాలు’ చూడండి..!

Published Mon, Apr 27 2020 4:19 PM | Last Updated on Mon, Apr 27 2020 4:31 PM

Warner, Wife Candice Switch Roles In Hilarious TikTok Video - Sakshi

సిడ్నీ: ఇటీవలే టిక్‌టాక్‌లో ‘అరంగేట్రం’ చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌  డేవిడ్‌ వార్నర్‌ వరుస పెట్టి వీడియోల మోత మోగిస్తున్నాడు. ఎక్కడా కూడా తగ్గే ప్రసక్తే  లేదన్నట్లు వార్నర్‌ తనకు నచ్చింది చేసేస్తున్నాడు. లాక్‌డౌన్‌ కారణంగా టిక్‌టాక్‌ను ఆస్వాదిస్తూ అభిమానులకు  మాత్రం పసందైన వీడియోలను షేర్‌ చేస్తున్నాడు ఈ సన్‌రైజర్స్‌ ఆటగాడు వార్నర్‌.  తొలి రెండు వీడియోలను కూతుళ్లతో చేసిన వార్నర్‌.. ఆ తర్వాత తన జోడిగా భార్య క్యాండిస్‌ను వేసుకున్నాడు. తాజాగా చేసిన వీడియో వార్నర్‌లో కొత్త కోణాన్ని చూపెట్టింది. ఇక్కడ వీరు తమ తమ రోల్స్‌ను మార్చుకుని మరీ టిక్‌టాక్‌ వీడియో చేయడమే ఇందుకు కారణం.. (‘షీలా కి జవాని’కి వార్నర్‌ ఇరగదీశాడు..)

స్విమ్మింగ్‌ పూల్‌ డ్రెస్‌లో వార్నర్‌ కనిపిస్తుండగా, యెల్లో కలర్‌ జెర్సీ వేసుకుని క్యాండిస్‌ కనిపించారు. ఒక బోటులో షికారుకు వెళుతున్నట్లు వీరు ఈ వీడియోను చిత్రీకరించారు. తొలుత క్యాండిస్‌ తన స్విమ్‌ సూట్‌లో కనిపించగా, వార్నర్‌ మాత్రం క్రికెట్‌ జెర్సీలో బ్యాట్‌ పట్టుకుని ఉంటాడు. ఆపై వీరిద్దరూ తమ పాత్రలను ఎక్సేంజ్‌ చేసుకుని మరింత వినోదాన్ని జోడించారు. దీన్ని వార్నర్‌-క్యాండిస్‌లు వేర్వేరుగా తమ ఇన్‌స్టాగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేశారు.  సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోపై ఫన్నీ కామెంట్లు వస్తున్నాయి. గత శనివారం క్యాండిస్‌తో కలిసి ఒక డ్యాన్స్‌ వీడియో చేసిన వార్నర్‌.. ఒక్కరోజు గ్యాప్‌ ఇచ్చి మరో వీడియో చేశాడు. ఇలా ‘సీరియల్‌’గా వీడియోలో చేసుకుపోతున్న వార్నర్‌.. మళ్లీ క్రికెట్‌ పట్టాలెక్కేవరకూ ఇలానే చేస్తూ ఉంటాడేమో చూడాలి. (నాకు అండగా నిలవలేదు: అశ్విన్‌)

ISO Monday’s #flicktheswitch @candywarner1

A post shared by David Warner (@davidwarner31) on

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement