దుబాయ్: ఆసియాకప్‌లో టీమిండియాతో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ పాకిస్తాన్ ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడం ఆ దేశ మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. భారత్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌లో పాకిస్తాన్ ఓటమి పాలుకావడంపై వకార్ యూనిస్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తగా, సూపర్-4లో సైతం అదే ఆట తీరును పునరావృతం చేయడంపై వసీం అక్రమ్ విమర్శలు గుప్పించాడు.
‘ప్రతీ విభాగంలోనూ పాకిస్తాన్ చెత్త ప్రదర్శన చేసింది. ఫలాన దాంట్లో పాకిస్తాన్ మెరుగైన ఆట తీరు కనబరిచింది అని చెప్పుకోవడానికి లేదు. ఇది మొత్తంగా దారుణమైన ప్రదర్శన. టాస్ గెలిచిన పాకిస్తాన్ బౌలింగ్ తీసుకోకుండా బ్యాటింగ్ తీసుకుంది. ఇది పాకిస్తాన్ హోంగ్రౌండ్. అటువంటప్పుడు పాక్ ఛేజింగ్ చేస్తేనే ఫలితం మరొకలా ఉండేది. ఆటలో గెలుపు-ఓటముల అనేవి సహజం. కానీ ఇంత దారుణంగా ఓడిపోతారా. ఆసియాకప్‌లో ఈ తరహా ప్రదర్శనను పాక్ నుంచి ఆశించలేదు. ఒక పాకిస్తానీ మాజీ ఆటగాడిగా చెబుతున్నా. ఇది పాకిస్తాన్ అన్ని విభాగాల్లో విఫలమై ఓటమి చెందడం చాలా నిరాశను కల్గించింది. ఇదొక బోరింగ్ గేమ్. మొత్తం దేశాన్నే నిరాశపరిచారు’ అని అక్రమ్ విమర్శించాడు. మరొకవైపు భారత్ జట్టులో కీలక ఆటగాడు, రెగ్యులర్ కెప్టెన్ కోహ్లి లేకుండానే వరుస విజయాలు సాధించడాన్ని అక్రమ్ కొనియాడాడు.
Comments
Please login to add a commentAdd a comment