
న్యూఢిల్లీ:తన పదునైన బౌలింగ్‌తో టీమిండియా బ్యాటింగ్ లైనప్‌ను కకావికలం చేస్తానన్న దక్షిణాఫ్రికా పేసర్ డేల్ స్టెయిన్ వ్యాఖ్యలకు మొహ్మద్ షమీ దీటైన జవాబిచ్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనలో స్టెయిన్‌కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి భయపడబోమంటూ టీమిండియా ప్రధాన పేసర్ షమీ స్పష్టం చేశాడు. 'ఎవరైనా ఏమైనా మాట్లాడొచ్చు. మమ్మల్ని భయపెడతామని ఎవరైనా చెప్పొచ్చు. దక్షిణాఫ్రికా గట్టి కౌంటర్ ఇచ్చేందుకు మేము సిద్దంగా ఉన్నాం. అక్కడ స్టెయిన్ పేస్‌కే కాదు.. ఏ ఒక్క బౌలర్‌కి టీమిండియా భయపడదు. మా జట్టు 100 శాతం ప్రదర్శన ఇవ్వడంపైనే దృష్టి సారించింది. దక్షిణాఫ్రికా పేస్‌కు దీటుగా బదులిచ్చేందుకు మా జట్టు సభ్యులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత కొన్నేళ్లనుంచి మేము ఏ జట్టుకు భయపడటం లేదనేది గుర్తుంచుకోవాలి.
త్వరలో దక్షిణాఫ్రికా దైపాక్షిక సిరీస్‌లో కూడా అదే రిపీట్ చేస్తాం. కాకపోతే మా ప్రణాళికలు ఏమిటో మీడియా ముందు చెప్పాలనుకోవడం లేదు. కాకపోతే ఒక్క విషయం చెబుతున్నా. దక్షిణాఫ్రికా పిచ్‌లపై షార్ట్ బంతుల్ని సంధించడానికి దూరంగా ఉంటాం. దక్షిణాఫ్రికా జట్టులో స్వ్కేర్ కట్, పుల్ షార్ట్, హుక్ షాట్‌లను అవలీలగా ఆడే ఆటగాళ్లు ఉన్నారు. ఈసారి విభిన‍్నమైన ప్రణాళికలతో సఫారీ పర్యటన ఉండబోతుంది' అని షమీ పేర్కొన్నాడు. అంతకుముందు స్టెయిన్ మాట్లాడుతూ.. మా పిచ్‌లపై 150 కి.మీ వేగంతో బంతులు సంధించి టీమిండియాను భయపెడతాం. కచ్చితమైన లెంగ్త్‌తో పాటు బౌన్సర్లతో విరాట్ సేనను హడలెత్తిస్తాం' అని స్టెయిన్ ముందుగా మాటల యుద్ధానికి తెరలేపాడు.
Comments
Please login to add a commentAdd a comment