
విండీస్ విజయం
నార్త్‌సౌండ్: బ్యాటింగ్‌లో కెప్టెన్ డ్వేన్ బ్రేవో (91 బంతుల్లో 87 నాటౌట్; 8 ఫోర్లు, సిక్స్), డారెన్ స్యామీ (36 బంతుల్లో 61; 5 ఫోర్లు, 4 సిక్స్‌లు), లెండిల్ సిమ్మన్స్ (94 బంతుల్లో 65; 6 ఫోర్లు) వీరోచిత పోరాటం... బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్... వెరసి ఇంగ్లండ్‌తో జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్ 15 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది.
ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య విండీస్ 1-0 ఆధిక్యం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 269 పరుగులు సాధించింది. లక్ష్యఛేదనలో విఫలమైన ఇంగ్లండ్ 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 254 పరుగులు మాత్రమే చేయగలిగింది.
అరంగేట్రంలోనే సెంచరీ చేసిన ఓపెనర్ మైకేల్ లంబ్ (117 బంతుల్లో 106; 7 ఫోర్లు, 2 సిక్స్‌లు) తొలి వికెట్‌కు మొయిన్ అలీ (59 బంతుల్లో 44; 3 ఫోర్లు)తో కలిసి 96 పరుగులతో శుభారంభం ఇచ్చారు. అయితే ఇతర బ్యాట్స్‌మెన్ దాన్ని కొనసాగించలేకపోయారు. విండీస్ బౌలర్లలో నరైన్ రెండు వికెట్లు తీసుకోగా... రాంపాల్, డ్వేన్ బ్రేవో, స్యామీ, డ్వేన్ స్మిత్ ఒక్కో వికెట్ పడగొట్టారు.