విండీస్ ‘ఎక్స్‌ట్రా’ ప్రాక్టీస్
కోల్‌కతా: భారత్‌తో సిరీస్ నేపథ్యంలో వెస్టిండీస్ జట్టు ప్రాక్టీస్‌ను ముమ్మరం చేసింది. ఇప్పటి వరకు నెట్ సెషన్లకే పరిమితమైన ఆటగాళ్లందరూ బుధవారం పూర్తిస్థాయిలో కసరత్తులు చేశారు. ఉదయం జాదవ్‌పూర్ యూనివర్సిటీ మైదానం చిత్తడిగా ఉండటంతో అక్కడికి దగ్గర్లో ఉన్న గంగూలీ అకాడమీలో ప్రాక్టీస్ చేశారు.
మధ్యాహ్నం మళ్లీ స్టేడియానికి వచ్చిన క్రికెటర్లు దాదాపు రెండున్నర గంటలపాటు చెమటోడ్చారు. బౌలర్లు పేస్ బౌలింగ్‌పై ఎక్కువగా దృష్టిపెట్టి నెట్స్‌లో తీవ్రంగా సాధన చేశారు. 150వ టెస్టు ఆడుతున్న సీనియర్ ఆటగాడు చందర్‌పాల్ ‘ఎక్స్‌ట్రా’ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. మైదానం వెలుపల ఉన్న నెట్స్‌లో చాలాసేపు బ్యాటింగ్ చేస్తూ గడిపాడు.
నేటి నుంచి యూపీసీఏతో ప్రాక్టీస్ మ్యాచ్
భారత్‌తో సిరీస్‌కు ముందు విండీస్‌కు ఒకే ఒక్క సన్నాహాక మ్యాచ్‌ను కేటాయించారు. అందులో భాగంగా నేటి నుంచి ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (యూపీసీఏ) జట్టుతో మూడు రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది.