కెప్టెన్‌కు సహకరించేవాడే కోచ్ : గంగూలీ
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టు కోచ్ ఎంపికపై సస్పెన్స్‌కు తెరపడేలా లేదు. ఇటీవల కెప్టెన్ విరాట్ కోహ్లీకి మధ్య విభేదాల నేపధ్యంలో కుంబ్లే తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కనీసం వెస్టిండీస్ పర్యటన వరకైనా కొనసాగమని క్రికెట్ సలహా మండలి అభ్యర్ధనను కుంబ్లే తిరస్కరించాడు. అయితే తర్వాతి కోచ్ ఎవరు అనేదానిపై సస్సెన్స్‌కు మాత్రం సమాధానం లభించట్లేదు. అయితే దీనిపై తాజాగా సలహా మండలి సభ్యుడు సౌరవ్ గంగూలీ బీసీసీఐ సమావేశంలో స్పందించాడు.
త్రిసభ్య సలహా కమిటీ సరైన కోచ్ కోసం అన్వేషిస్తోందని తెలిపాడు. జట్టులోని సభ్యులను సమన్వయం చేసుకుపోయే మనస్తత్వం, కెప్టెన్ నిర్ణయాలను గౌరవించే వ్యక్తికోసం సలహా కమిటీ సభ్యులు వెతుకున్నారని తెలిపాడు. సరైన ప్రణాళికలతో మ్యాచ్‌లను గెలిపించగలిగే సత్తా ఉన్నవాడినే కోచ్‌గా ఎంపిక చేస్తామని సౌరవ్ పేర్కన్నాడు. దీనికోసం మళ్లీ దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని, జూలై 9లోపు కొత్త దరఖాస్తులను పంపవచ్చని చెప్పాడు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారినికూడా పరిగణలోకి తీసుకుంటామని అన్నాడు. కోచ్ ఎంపికలో బీసీసీఐ సూచనలు తీసుకుంటామని సౌరవ్ తెలిపాడు. జూలై 21 నుంచి ప్రారంభం కానున్న శ్రీలంక పర్యటనలోపే కోచ్ ఎంపిక చేస్తామని గంగూలీ చెప్పాడు. కోహ్లీ కుంబ్లే వివాదాలను దృష్టిలో ఉంచుకుని కొత్తకోచ్ ఎంపిక చేస్తామని, దీని కోసం ప్రస్తుతం ప్రయత్నాలు కొనసాగుతున్నాయని బీసీసీఐ వర్కింగ్ వైస్ ప్రెసిడెంట్ అమితాబ్ చౌదరి అన్నారు.