
ఇకపై వింబుల్డన్ గ్రాండ్‌స్లామ్‌లో సుదీర్ఘ మ్యాచ్‌లకు చెల్లుచీటి పడనుంది. మ్యాచ్ ఫలితాన్ని తేల్చే చివరి సెట్‌లో స్కోరు 12–12 వచ్చాక టైబ్రేక్‌ను ఆడించేందుకు ఆల్ ఇంగ్లండ్ లాన్ టెన్నిస్ క్లబ్ సిద్ధమైంది. వచ్చే ఏడాది నుంచి ఈ టైబ్రేక్ ఆట మొదలవుతుందని క్లబ్ చైర్మన్ ఫిలిప్ బ్రూక్ వెల్లడించారు.
‘టైబ్రేక్స్ పద్ధతిని ప్రవేశపెట్టే సమయం వచ్చింది. మ్యాచ్‌లకు ఇకపై అసాధారణ ముగింపుల్లేకుండా, నిర్ణీత సమయంలోనే పోటీలు ముగిసేందుకు ఈ టైబ్రేక్స్ దోహదపడతాయి’ అని ఆయన అన్నారు. ఏడాదిలో నాలుగు గ్రాండ్‌స్లామ్స్ జరుగుతుండగా... ఒక్క యూఎస్ ఓపెన్‌లోనే మ్యాచ్ చివరి సెట్‌లో టైబ్రేక్స్‌ను నిర్వహిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment