డేవిడ్ లూయిజ్
ఫుట్‌బాల్‌కు సంబంధించి డేవిడ్ లూయిజ్ ఖాతాలో ఎన్ని టైటిళ్లు ఉన్నా ఇప్పటిదాకా ఇంగ్లిష్ ప్రీమియర్ లీగ్ (ఈపీఎల్) మాత్రం అందుకోలేకపోయాడు. చెల్సీకి ఆడుతున్న ఈ బ్రెజిల్ డిఫెండర్ జట్టు విజయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్నాడు. వరుసగా 13 విజయాలు సాధించిన ఈ జట్టు పాయింట్ల పట్టికలో ‘టాప్’లో ఉంది. అయితే గత వారం టాటెన్‌హామ్ చేతిలో తొలి ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో నేడు (శనివారం) డిఫెండింగ్ చాంపియన్ లీస్టర్ సిటీతో తలపడనుంది. మరోసారి విజయాల బాట పట్టడం ఖాయమని లూయిజ్ భావిస్తున్నాడు.
చెల్సీ వరుస విజయాల రికార్డుకు టాటెన్‌హామ్ అడ్డుకట్ట వేసింది. ఇప్పుడు లీస్టర్‌తో మ్యాచ్‌కు ముందు అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?
అంతగా భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది జనవరి మాత్రమే. ప్రీమియర్ లీగ్ పాయింట్ల పట్టికలో మే నెలకు ప్రాధాన్యం ఉంటుంది. ఫిబ్రవరి, మార్చిలో ఎవరూ టైటిల్ గెలవగా నేను చూడలేదు. ఇప్పటికైతే మేం చాలా బాగా ఆడుతున్నాం. మంచి ఆత్మవిశ్వాసంతో ఉన్నాం. మా జోరును ఆపలేరు.
తిరిగి విజయాల బాట పట్టేందుకు చెల్సీ ఏం చేయాల్సి ఉంటుంది?
ఇందులో మార్చుకోవాల్సిందేమీ లేదు. పట్టికలో మేమే టాప్‌లో ఉన్నాం. ఇప్పటిదాకా మేమంతా ఎలాంటి దృక్పథంతో ఆడామో అలాగే ముందుకెళ్లాల్సి ఉంది. లీగ్‌లో ప్రతీ మ్యాచ్ విభిన్నమైందే కాకుండా కఠినంగానూ ఉంటుంది.
ఇప్పటిదాకా టాప్‌లో ఉన్నా మీకు ఎదురైన తొలి ఓటమితో ఇతర జట్లు కూడా టైటిల్ రేసులోకి వచ్చాయని భావించాలా? టాటెన్‌హామ్ కూడా పోటీలో ఉందంటారా?
కచ్చితంగా. సీజన్ ఆరంభం నుంచే వారిని నేను ప్రత్యర్థిగా భావిస్తున్నాను. అయితే ఇంకా చాలా సమయం ఉంది కాబట్టి ఎవరైనా పోటీలోకి రావచ్చు.
చాలామంది చెల్సీయే టైటిల్ ఫేవరెట్ అని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు గత సీజన్ చాంపియన్‌ను ఎదుర్కొనబోతున్నారు. ఎలా అనిపిస్తుంది?
టైటిల్ గెలవడం అంత సులువు కాదు. ఇంటా, బయటా ఎక్కడ మ్యాచ్‌లు ఆడినా కఠినంగానే సాగుతాయి. ఇప్పుడే టైటిల్ గురించి మాట్లాడుకోవడం తొందరపాటే. ప్రతీ రోజు కష్టపడి ప్రాక్టీస్ కొనసాగిస్తుండాలి. అయితే కచ్చితంగా ఈసారి చాంపియన్ కావాలని కోరుకుంటున్నాను.
మా జోరును ఆపలేరు
Published Sat, Jan 14 2017 1:07 AM | Last Updated on Tue, Oct 2 2018 8:39 PM
Advertisement
Advertisement