
జైపూర్: ప్రొ కబడ్డీ లీగ్‌లో యూపీ యోధ తొమ్మిదో విజయాన్ని నమోదు చేసింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో యూపీ 42–22తో తమిళ్ తలైవాస్‌ను చిత్తుచేసింది. యూపీ రైడర్ శ్రీకాంత్ జాధవ్ 8 పాయింట్లతో రైడింగ్‌లో మెరవగా...ట్యాక్లింగ్‌లో సమిత్ ‘హై–ఫై’ (5 పాయింట్లు)తో జట్టును గెలిపించాడు. తలైవాస్ రైడర్ రాహుల్ (5 పాయిం ట్లు) నిరాశ పరిచాడు. జైపూర్ పింక్ పాంథర్స్, గుజరాత్ ఫార్చూన్ జెయింట్స్ మ్యాచ్ 28–28తో ‘డ్రా’గా ముగిసింది. నేటి మ్యాచ్‌ల్లో యు ముంబాతో ఫార్చూన్ జెయింట్స్; బెంగాల్ వారియర్స్‌తో జైపూర్ పింక్ పాంథర్స్ తలపడతాయి.
Comments
Please login to add a commentAdd a comment