యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్ | Yuvraj Singh hits century and Manan Vohra's double ton power Punjab against Baroda | Sakshi
Sakshi News home page

యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్

Published Sat, Oct 29 2016 8:11 PM | Last Updated on Mon, Sep 4 2017 6:41 PM

యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్

యువీ భారీ సెంచరీ.. వోహ్రా డబుల్

న్యూఢిల్లీ: ఫామ్లోలేని భారత ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అజేయ భారీ సెంచరీతో చెలరేగగా, మనన్ వోహ్రా అజేయ డబుల్ సెంచరీ చేశాడు. రంజీ ట్రోఫీ గ్రూప్-ఎలో భాగంగా బరోడాతో మ్యాచ్లో పంజాబ్ తరఫున బరిలోకి దిగిన యువీ (179), వోహ్రా (201) అద్భుతంగా ఆడారు.

ఫిరోజ్ షా కోట్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో తొలి ఇన్నింగ్స్లో బరోడా 529 పరుగులు చేసింది. మ్యాచ్ మూడోరోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన పంజాబ్ 452/2 స్కోరు చేసి దీటైన సమాధానం ఇచ్చింది. యువీ, వోహ్రా అజేయంగా 314 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. పంజాబ్ తొలి ఇన్నింగ్స్లో ఇంకా 77 పరుగులు వెనుకబడివుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement