యువీ ఐపీఎల్‌ ప్రాక్టీస్ షురూ | Yuvraj Singh joins Mumbai Indians preparatory camp ahead of IPL 2019 | Sakshi
Sakshi News home page

యువీ ఐపీఎల్‌ ప్రాక్టీస్ షురూ

Published Fri, Mar 15 2019 1:11 PM | Last Updated on Thu, Mar 21 2019 1:45 PM

Yuvraj Singh joins Mumbai Indians preparatory camp ahead of IPL 2019 - Sakshi

ముంబై: ఈ సీజన్‌ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున బరిలోకి దిగుతున్న టీమిండియా సీనియర్‌ క్రికెటర్‌ యువరాజ్‌ సింగ్‌ తన నెట్‌ ప్రాక్టీస్‌ను షురూ చేశాడు.  ముంబై ఇండియన్స్‌ హోం గ్రౌండ్‌ వాంఖేడే స్టేడియంలో ఆ జట్టు ప్రాక్టీస్‌కు సిద్ధమైన తరుణంలో యువరాజ్‌ సింగ్‌ సైతం కాసేపు ప్రాక్టీస్‌ చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్‌ వేలంలో యువరాజ్‌ సింగ్‌ను ఏ జట్టు కొనుగోలు చేయడానికి ముందుకు రాకపోగా, చివరి నిమిషంలో ముంబై ఇండియన్స్‌ అతన్ని కనీస ధరకే దక్కించుకుంది.

గతేడాది కింగ్స్‌ పంజాబ్‌ తరఫున ఎనిమిది మ్యాచ్‌లు ఆడిన యువరాజ్‌ సింగ్‌ 65 పరుగులు మాత‍్రమే చేసి తీవ్రంగా నిరాశపరిచాడు. దాంతో ఈ ఏడాది అతన్ని జట్టులో కొనసాగించే సాహసం కింగ్స్‌ పంజాబ్‌ ఫ్రాంచైజీ చేయలేదు. ఈ క్రమంలోనే వేలానికి వచ్చిన యువీపై ఏ ఫ్రాంచైజీ కూడా ఆసక్తి కనబరచలేదు. కాగా, చివర్లో అతని కనీస ధర కోటి రూపాయలకే ముంబై ఇండియన్స్‌ కొనుగోలు చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement