కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది | Yuvraj Singh loses cool, storms off over Virat Kohli captaincy question | Sakshi
Sakshi News home page

కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది

Published Mon, Jun 6 2016 2:25 PM | Last Updated on Mon, May 28 2018 2:02 PM

కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది - Sakshi

కోహ్లీ విషయం అడగ్గానే.. యువీకి కోపమొచ్చింది

మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది.

టీమిండియా టెస్ట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫౌండేషన్, మరో ఛారిటీ సంస్థ స్మైల్ ఫౌండేషన్ కలసి ముంబైలో శుక్రవారం రాత్రి నిర్వహించిన  ఛారిటీ కార్యక్రమంలో కోహ్లీ, డాషింగ్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్, యువ ఆటగాడు హార్దిక్ పాండ్యా స్టెప్పులతో అదరగొట్టారు. ఈ కార్యక్రమంలో టీమిండియా టి-20, వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, కె.ఎల్ రాహుల్, అజింక్యా రహానేతో పాటు ఆకాశ్ అంబానీ, గౌతమ్ సింఘానియా, నికిల్ చతుర్వేది, దిగ్విజయ్ సిన్హ్ కతివాడా తదితర ప్రముఖులు పాల్గొన్నారు. క్రికెటర్లు చిన్నారులతో ఫొటోలు దిగి సందడి చేశారు.

ఇంతవరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమానికి ముందు అనూహ్య సంఘటన జరిగింది. మీడియా ప్రతినిధులు ఊహించని ప్రశ్న అడిగే సరికి యువరాజ్ సింగ్ శాంతం కోల్పోయాడు. ఒక్కసారిగా యువీకి ఒకింత కోపం వచ్చింది. యువీ సహనం కోల్పోయేలా చేసిన ఆ ప్రశ్న ఏంటంటే.. అన్ని ఫార్మాట్లకు టీమిండియా కెప్టెన్గా విరాట్ కోహ్లీని నియమించే అవకాశం గురించి మీడియా ప్రతినిధులు అడిగారు. 'ఈ ఈవెంట్ గురించి మాట్లాడేందుకు ఇక్కడి వచ్చా. క్రికెట్ గురించి మాట్లాడేందుకు కాదు. ఓకే..? థ్యాంక్యూ' అంటూ మీడియా ప్రతినిధులకు మరో ప్రశ్న అడిగే అవకాశం ఇవ్వకుండా యువీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కాగా యువీ ఈ విషయాన్ని మనసులో పెట్టుకోకుండా ఈవెంట్లో అందరితో కలసి హుషారుగా పాల్గొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement