
చాంపియన్స్‌ట్రోఫీలో సత్తాచాటుతా: యువరాజ్
దుబాయ్: వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్.. కప్పును తిరిగి దక్కించుకోవడంలో అర్ధవంతమైన పాత్రను పోషించగలనని డాషింగ్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ అభిప్రాయపడ్డాడు. తిరిగి వన్డే జట్టులోకి తాను ఎంపికవడం ఆనందం కలిగించిందని పేర్కొన్న యువీ.. ఈ టోర్నీ సవాలుతో కూడుకున్నదని పేర్కొన్నాడు. టోర్నీలో ఆడే ప్రతీజట్టు చాంపియన్‌గా నిలవాలని కోరుకుంటుందని వ్యాఖ్యానించాడు.
తాము ఉన్న గ్రూప్‌లో పోటీ చాలా తీవ్రంగా ఉందని, అయితే వరుసగా రెండోసారి టోర్నీ నెగ్గేందుకు ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. గతంలో ఆస్ట్రేలియా మాత్రమే వరుసగా రెండుసార్లు ఈ టైటిల్‌ను సాధించింది. అలాగే టోర్నీ వేదికైన బ్రిటన్ తమకు సొంతగడ్డలాంటిదని తెలిపాడు. చాలామంది అభిమానుల మద్దతు లభిస్తుందని పేర్కొన్నాడు. దాదాపు 11 ఏళ్ల తర్వాత చాంపియన్స్ ట్రోఫీలో యూవీ ఆడతుండడం విశేషం. కెన్యా (2002)లో జరిగిన టోర్నీలో అరంగేట్రం చేసిన యువీ.. 2006 వరకు వరుసగా ఈ టోర్నీల్లో పాల్గొన్నాడు. అయితే 2009, 2013 టోర్నీల్లో యూవీ ఈ టోర్నీలో చోటు దక్కలేదు.