యువరాజ్ జెర్సీ తప్పిదం! | Yuvraj Singh wore Champions Trophy jersey during second ODI against West Indies | Sakshi
Sakshi News home page

యువరాజ్ జెర్సీ తప్పిదం!

Published Mon, Jun 26 2017 1:04 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

యువరాజ్ జెర్సీ తప్పిదం!

యువరాజ్ జెర్సీ తప్పిదం!

పోర్ట్ ఆఫ్ స్పెయిన్: ఇటీవల కాలంలో పేలవమైన ఫామ్తో తంటాలు పడుతున్న క్రికెటర్ యువరాజ్ సింగ్. అడపా దడపా మెరుపులు తప్పితే నిలకడగా రాణించడంలో యువరాజ్ విఫలమవుతూనే ఉన్నాడు. అటు చాంపియన్స్ ట్రోఫీలో అలంకార ప్రాయ పాత్రకే పరిమితమైన యువరాజ్.. వెస్టిండీస్ పర్యటనలో సైతం ఇప్పటివరకూ చెప్పుకోదగ్గ స్కోరు చేయలేదు. ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా తొలి వన్డేలో నాలుగు పరుగులు మాత్రమే చేసిన యువీ, రెండో వన్డేలో 14 పరుగులు చేసి నిరాశపరిచాడు.

అయితే రెండో వన్డేలో హార్దిక్ పాండ్యా అవుటైన తరువాత బ్యాటింగ్ కు వెళ్లిన యువరాజ్ సెంట్రాఫ్ అట్రాక్షన్గా నిలిచాడు. ఇందుకు కారణం ఒక టోర్నీకి తయారు చేసిన జెర్సీని  మరొక సిరీస్ లో ధరించడమే. చాంపియన్స్ ట్రోఫీలో వేసుకున్న జెర్సీని విండీస్ తో రెండో్ వన్డేలో సైతం యువరాజ్ ధరించి అందర్నీ ఆలోచనలో పడేశాడు. సాధారణంగా ప్రతీ సిరీస్ ముందు జట్టు మేనేజ్మెంట్ కొత్త జెర్సీలను ఆటగాళ్లకు అందజేస్తుంది. అయితే చాంపియన్ప్ ట్రోఫీ తరువాత భారత్ జట్టు నేరుగా విండీస్ పర్యటనకు వెళ్లింది. దాంతో చాంపియన్స్ ట్రోఫీలో ధరించిన జెర్సీలను ఆటగాళ్లు కూడా తీసుకెళ్లాల్సి వచ్చింది. ఆ క్రమంలోనే యువరాజ్ పొరపాటును చాంపియన్స్ ట్రోఫీ జెర్సీ ధరించి బ్యాటింగ్ కు వెళ్లిపోయాడు. ఆ తరువాత తప్పును గ్రహించిన యువరాజ్ సింగ్.. విండీస్ పర్యటనకు తయారు చేసిన జెర్సీని తిరిగి ధరించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement