టీమిండియా క్రికెటర్లలో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ హార్దిక్ పాండ్యా. తాను చేసే పనులతో ప్రతీసారి వార్తల్లో హైలెట్ నిలుస్తాడు. తాజాగా టీమిండియా దిగ్గజ బౌలర్ జహీర్ ఖాన్ బర్త్‌డే సందర్భంగా హార్దిక్ చేసిన ట్వీట్ వివాదస్పదంగా మారింది. దీనిపై హార్దిక్ విమర్శకులు, జహీర్ ఖాన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాజాగా హార్దిక్ ట్వీట్‌పై జహీర్ స్పందించాడు. ‘ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపినందకు హార్దిక్‌కు ధన్యవాదాలు. అయితే నీలా బ్యాటింగ్ నేనెప్పటికీ చేయలేను. కానీ ఈ మ్యాచ్‌లో(హార్దిక్ పోస్ట్ చేసిన మ్యాచ్ వీడియో) నువ్వు నా నుంచి ఎదుర్కొన్న తర్వాతి బంతి వలే నా పుట్టినరోజు చాలా బాగా జరిగింది’ అంటూ హార్దిక్‌కు గట్టి కౌంటర్ ఇచ్చాడు. అదేవిధంగా బర్త్‌డే విషెస్ చెప్పిన ప్రతీ ఒక్కరికి జహీర్ ధన‍్యవాదాలు తెలిపాడు.
కాగా.. జహీర్ బర్త్‌డే సందర్భంగా ‘ ‘హ్యాపీ బర్త్‌డే జాక్.. నేనిక్కడ కొట్టినట్టు నువ్వు కూడా మైదానం బయటకి దంచి కొడతావనే ఆశిస్తున్నా’అంటూ ఓ దేశవాళీ మ్యాచ్‌లో జహీర్ బౌలింగ్‌లో హార్దిక్ సిక్సర్ కొట్టిన వీడియోను జతచేసి ట్వీట్ చేశాడు. దీనిపై జహీర్ ఖాన్ అభిమానులు మండిపడ్డారు. ‘ముందు జహీర్‌లా టీమిండియాకు ప్రపంచకప్ తీసుకరా’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక హార్దిక్ లండన్‌లో వెన్నునొప్పి గాయానికి శస్త్రచికిత్స చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కోలుకుంటున్నానని.. త్వరలోనే మైదానంలోకి అడుగుపెడుతానిని హార్దిక్ పేర్కొన్నాడు. అయితే గాయం తీవ్రత, జరిగిన శస్త్ర చికిత్సను పరిశీలిస్తే ఐదు నెలల పాటు హార్దిక్ విశ్రాంతి అవసరముంటుందుని వైద్యులు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment