బ్రహ్మోత్సవాలకు లక్ష విస్తరాకులు
Published Sat, Oct 29 2016 4:39 PM | Last Updated on Wed, Sep 18 2019 3:21 PM
రాజమహేంద్రవరం కల్చరల్ : తిరుమల బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తుల వినియోగం కోసం తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ గ్రామానికి చెందిన శ్రీకృష్ణ చైతన్య సంఘం వ్యవస్థాపకుడు కల్యాణం అప్పారావు లక్ష విస్తరాకులను పంపారు. సుమారు 50 మంది భక్తులు ఆదివారం ఉదయం రాజమహేంద్రవరం రైల్వేస్టేషన్ నుంచి తిరుపతి ప్యాసింజరు రైలులో లక్ష విస్తరాకులతో తిరుమలకు పయనమయ్యారు. తిరుమలలోని తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రానికి ఈ విస్తర్లు అందజేస్తారు. ఆరేళ్లుగా తిరుమలలో జరిగే శ్రీవారి బ్రహ్మోత్సవాలకు లక్ష విస్తరాకులను అందజేస్తున్నామని అప్పారావు తెలిపారు.
Advertisement
Advertisement