స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు | 10 injured in school bus accident at kurnool district | Sakshi
Sakshi News home page

స్కూలు బస్సు బోల్తా.. 10 మందికి గాయాలు

Published Tue, Dec 20 2016 11:12 AM | Last Updated on Sat, Sep 15 2018 4:05 PM

10 injured in school bus accident at kurnool district

సంజామల : కర్నూలు జిల్లా సంజామల మండలం రెడ్డిపల్లి సమీపంలో మంగళవారం ఉదయం ఓ మూలమలుపు వద్ద పాఠశాల బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది విద్యార్థులకు గాయాలయ్యాయి. ఇద్దరు మహిళా టీచర్లకు చేతులు విరిగాయి. క్షతగాత్రులను కోవెలకుంట్ల ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో 8 మంది ఉపాధ్యాయులతో కలిసి 68 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా అనంతపురం జిల్లా బొమ్మనహళ్ మండల ఉద్దేహళ్ ప్రభుత్వ పాఠశాలకు చెందిన వారు. విహారయాత్ర నిమిత్తం శ్రీశైలం వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement